All Books showing popular- Kinige eBooks for rent/sale on Kinige Digital Technologiestag:kinige.com,2010:http://kinige.com/kfeed.php?entity=books&filter=all&order=popular2012-05-17T23:50:49-07:00 Kinige Admin noreply@kinige.com రుద్రాణి by Madhu babutag:kinige.com,2010:http://kinige.com/kbook.php?id=7892012-05-09T00:29:28-07:00Madhu babu noreply@kinige.com "సులోమీ పర్వతాల్లో వున్న పిశాచాలకు చిక్కి ప్రాణాలు పోగొట్టుకోకుండా అవతలి ప్రక్కకు చేరుకోగలిగితే సువిశాలమైన సులోమీ మైదానప్రాంతం అగుపిస్తుందిట.... రకరకాల రాజ్యాలు, వివిధ రకాల నగరాలు కలిగివుండే ఆ మైదాన ప్రదేశంలో ఎక్కడో దట్టమయిన అటవీప్రాంతం ఒకటి వున్నదిట..... ఆ అడవిలో రుద్రాణి అనే పువ్వు దొరుకుతుందిట -- ఆ రుద్రాణి పుష్పంతో తయారుచేయబడిన లేపనాన్ని ఉపయోగిస్తే నా కుమారుడు ఆరోగ్యవంతుడవుతాడని వైద్యులు చేపుతున్నారు. నువ్వు ఆ పుష్పాన్ని తెచ్చిపెట్టాలి” అన్నాడు. ఆ మాటల్ని మననం చేసుకుంటూ తల వూపాడు షాడో. సులోమీ కొండలలోని పిశాచులను గురించి చెప్పిన తర్వాత కూడా అతను భయాన్ని ప్రదర్శించక పోయేసరికి ఎనలేని సంతోషానికి గురి అయ్యాడు ఆ రాజు. ఎవరితో ఎలా మాట్లాడాలి by Dr. Gayatri Devitag:kinige.com,2010:http://kinige.com/kbook.php?id=742011-02-03T00:00:00-08:00Dr. Gayatri Devi noreply@kinige.com ముందుమాట మాట చేతకాక విరోధాలు తెచ్చుకొని ప్రాణాలు కోల్పోయే వారెందరో ఉన్నారు. మాటతో లోకాన్ని జయించి, సమాజంలో సన్మానాలు పొందే వారూ ఉన్నారు. మాట్లాడటం అనే విద్య నేర్చుకోవాలనుకున్న వారికి హనుమంతుడే గురువు. ఆ మహనీయుడు కార్యాచరణ దీక్షలో కూడా నేటి యువతీ యువకులకి ఆదర్శప్రాయుడు. అని ఎంతో గాఢంగా నమ్మేవారు ఉషశ్రీ. ఆ విషయాన్ని అందరికీ తెలియజేయాలన్న కోరికతోనే 'రామాయణంలో హనుమంతుడు' అనే పుస్తక రచనని ప్రారంభించారు. అయితే అది అసంపూర్ణంగా మిగిలిపోయింది. ఉషశ్రీ తన ఉపన్యాసాలలో తెలిపిన భావాలను అధ్యయనం చేసిన ఆయన పెద్దమ్మాయి డాక్టర్ గాయత్రీదేవి ఈ అసంపూర్ణ రచనని ఆయన మాటలతోనే పూర్తి చేశారు. రెండు ముద్రణలు పొందిన ఆపుస్తకం ఆధారంగా "ఎవరితో ఎలా మాట్లాడాలి?" రూపుదిద్దుకుంది. ఉషశ్రీ పెద్దమ్మాయి చేతిలోనే. ఉషశ్రీ జీవితాశయాలని ప్రజలకి చేరువ చెయ్యాలన్న ఉద్దేశ్యంతో కార్యక్రమాలు మొదలు పెట్టిన 'ఉషశ్రీ మిషన్' మీ అభిప్రాయాలనూ, సలహా సహకారాలనూ కోరుకుంటోంది. --ఉషశ్రీ మిషన్ ఉషశ్రీ ఆ రోజుల్లో పండితుల కర్మాగారంగా ప్రసిద్ధి పొందిన పశ్చిమగోదావరి జిల్లా కాకరపర్రులో జన్మించిన శ్రీ ఉషశ్రీకి తల్లి (కాశీ అన్నపూర్ణ) తండ్రులే (పురాణపండ రామమూర్తి) ప్రథమ గురువులు. కవీ, కథకుడూ, నాటకకర్తా అయిన ఉషశ్రీ ఆకాశవాణిలో (1965) ప్రవేశించి, సూటిగా లక్ష్యంవైపు దూసుకుపోయే బాణం లాంటి తన వాక్కుతో (1973 నుండి దశాబ్దం పైగా) ఎందరికో ధర్మసందేహాలు తీర్చారు. రామాయణ, మహాభారత కావ్యాలని మధించి, మధుర గంభీర గళంతో అశేష జనావళికి జ్ఞానసుధను పంచారు. ఉపన్యాసాన్ని ఒక కళగా రూపొందించి రామాయణ భారతోపన్యాసాలతే యావదాంధ్రదేశాన్నీ ఉర్రూతలూగించారు. నేటికీ ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు సి.డిల రూపంలో ఆ జ్ఞానసుధని ఆస్వాదిస్తూనే ఉన్నారు. మానవజాతి సర్వకాలాలలోనూ సుఖశాంతులతో మనుగడ సాగించడానికి అవసరమయిన విశేషాలు అందించే గ్రంథాలు అని ప్రతిపాదిస్తూ ఆయన వ్రాసిన రామాయణ భారత భాగవతాల ప్రతులు లెక్కలేనన్ని లక్షల సంఖ్యలో పాఠకులకి చేరాయి. చేరుతూనే ఉన్నాయి. తన జీవితాన్ని (1928 - 1990) కావ్యత్రయ ప్రాచుర్యానికి అంకితం చేసిన ఉషశ్రీ కలం, గళం అమరం. గాయత్రీదేవి రెండున్నర దశాబ్దాలుగా ఎందరికో వైద్యసేవలు, మాస దిన పత్రికలూ, టి.వి. ఛానెల్స్, పుస్తకాల ద్వారా అందరికీ ఆరోగ్య సూచనలూ- వైద్య విద్యార్థులకి పాఠ్యగ్రంథాలూ- అందిస్తున్న డాక్టర్ గాయత్రీదేవి ఉషశ్రీ పెద్దమ్మాయి. వారసత్వంగా సంక్రమించిన 'రచనాసక్తితో' అప్పుడప్పుడూ కథలూ, రేడియో నాటికలూ, రూపకాలూ రాసే గాయత్రీదేవి, తండ్రి అసంపూర్ణ రచన 'రామాయణంలో హనుమంతుడి'ని పూర్తి చేశారు. తన రచనలకి కొన్ని అవార్డులతో పాటు భరతముని ఆర్ట్స్ అకాడమీ వారి 'ఆదర్శవనిత' పురస్కారం అందుకున్నారు. అరేబియన్ కామ శాస్త్రము by Sivaramtag:kinige.com,2010:http://kinige.com/kbook.php?id=7142012-04-11T23:24:08-07:00Sivaram noreply@kinige.com ప్రపంచ దేశాలలో అందరూ ఆసక్తి చూపించే ఒకే ఒక్క విషయం - శృంగారం అంటే అతిశయోక్తి కాదు. భారతదేశానికి వాత్సాయన కామసూత్రాలు ఉన్నట్లే, ప్రపంచంలోని చాలా దేశాలకు ఇలాంటి కామ సూత్రాలు ఉన్నాయి. ఆయా దేశాల పరిస్థితులకు అనుగుణంగా, అక్కడి స్త్రీపురుషుల ఆచార వ్యవహారాలను, అక్కడ వాడుకలో ఉన్న కామక్రీడలను మేళవించి ఆయా గ్రంథాలను ఆయా మహానుభావులు సృష్టించడం జరిగింది. వాటిలో చీనా కామ శాస్త్రం, ఫ్రెంచ్ కామ శాస్త్రం, అరేబియన్ కామ శాస్త్రం ముఖ్యంగా చెప్పుకోదగ్గవి. అరబ్బుల కామ శాస్త్రానికో ప్రత్యేకత ఉంది. ఆ శాస్త్రాన్ని రచించిన షేక్ నెఫ్జవీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతను 1394-1433 మధ్య కాలంలో జీవించినట్లు తెలుస్తోంది. అతను స్త్రీలలోని చక్కదనాన్ని, సౌకుమారాన్ని, అందాన్ని ఆవిష్కరించడమే కాదు, వారి హృదయపు అంతరాల్లో చెలరేగే అలోచనలను, మనసులోని మర్మాలను కూడా బయటపెట్టాడు. అరేబియాలో వ్రాయబడిన ఈ గ్రంథం 1876లో విడుదలై, ఎంతో ప్రజాదరణ, ప్రముఖుల ప్రశంసలు పొందింది. మచ్చల గుర్రం by Madhu babutag:kinige.com,2010:http://kinige.com/kbook.php?id=1922011-05-27T05:57:54-07:00Madhu babu noreply@kinige.com విపరీతమైన దాహం వేసింది వారుణికి. అదేపనిగా తడబడటం మొదలు పెట్టాయి అడుగులు. గిర్రుగిర్రున తిరగసాగాయి కళ్లు. 'ఇక నడవడం నావల్లకాదు. నా పని అయిపోయింది' అస్పష్టంగా అంటూ చతికిలబడింది ఒక చెట్టు మొదట్లో. బరిశె మాదిరిగా పొడుగ్గా ఉన్న ఒక చెట్టు కొమ్మని బిగించి పట్టుకుని, ఒక్కొక్క అడుగే ముందుకువేస్తున్న చంద్రుడి ఒళ్ళు ఝల్లుమంది ఒక్కసారిగా. తన వెనుకవస్తున్న మానవుల గురించి పట్టించుకోలేదు అప్పటివరకూ ఆ మహావ్యాఘ్రం. అసలు వారు తనను అనుసరిస్తున్నట్లుగా కూడా దానికి తెలియదు. ఉన్నట్లుండి వినవచ్చిన మాటల శబ్దాన్ని ఆలకించగానే గుండెలు జలదరించేటట్లు గాండ్రిస్తూ గిర్రున తిరిగింది వెనక్కి. “వెళ్ళిపో వారుణీ. వెనక్కి వెళ్ళిపో... అసలు ఈ ప్రదేశంలోనించి దూరంగా పారిపో” అని వారుణిని హెచ్చరిస్తూ, చేతుల్లో ఉన్న చెట్టుకొమ్మతో ఆ భీకరమృగాన్ని ఎదిరించటానికి సిద్దపడ్డాడు చంద్రుడు. .......... కంకాళలోయ by Madhu babutag:kinige.com,2010:http://kinige.com/kbook.php?id=1732011-05-10T10:11:39-07:00Madhu babu noreply@kinige.com రాజులు రాణులు మాంత్రికులు, అడవులు, లోయలు, కొండలు, నదులు, సెలయేళ్లు, ఒక అద్భుత జానపద ప్రపంచంలో మధుబాబు సృజించిన కాళికాలయం నవల రెండో భాగం ఈ కంకాళలోయ. తమ రాజ్యపు కన్యపిల్లలను హరించుతున్న ఆ పొగ శక్తి ఏమిటి? తమ తండ్రిగారిని మైకంలోకి నెట్టిన ఆ మంత్రబలం నుండి విముక్తి మార్గం ఏమిటి ? ఆముఖుని మంత్రతంత్రాలు ఎంత శక్తివంతమైనవి? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు కోసం బలదేవుడు, వసంతుడు చేసిన సాహసయాత్రలు ఎట్టివి? తప్పనిసరిగా చదవాల్సిన నవల ఈ కాళికాలయం! ఆపరేషన్ కౌంటర్ స్పై by Madhu babutag:kinige.com,2010:http://kinige.com/kbook.php?id=7832012-05-08T03:05:28-07:00Madhu babu noreply@kinige.com షాడో గొంతు ఎండిపోయింది. ఏమిటి ఈ అభాండాలు? తను దేశద్రోహం చెయ్యటమా? ఎన్నోసార్లు దొరికిన వాళ్ళను దొరికినట్లు ఆ కిరస్థాన్ ఏజెంట్లను, సీనాదేశపు ఏజెంట్లను చితకకొట్టాడే! అలాంటి తనని వాళ్ళు ఎలా చేర్చుకుంటారు? ఇందులో ఏదో తిరకాసు వుంది. తన దెబ్బకు తట్టుకోలేక వాళ్ళు వేసిన పథకమే ఇది. "సార్! మీరు ప్రశాంతంగా ఆలోచించండి. గజదొంగగా జీవితం గడిపినప్పుడు చెయ్యని ద్రోహం, బాధ్యత కలిగిన ఉద్యోగంలో వుండి, పరువుగా బ్రతుకుతూ ఇప్పుడు చేస్తానా? మీరు ఒప్పుకున్న తరువాతే గదా నేను కలకత్తా పోయింది. రెండునెలల నుంచీ కలకత్తాలోనే వున్నాను. అందుకు సాక్ష్యం బిందూ. ఆమె నడగండి తెలుస్తుంది." సిగార్ పంటికింద నొక్కిపట్టి పచార్లు చెయ్యసాగారు కులకర్ణిగారు. "అయామ్ సారీ షాడో, నువ్వు ఎంతో తెలివైనవాడివి, విశ్వాసపాత్ర్రుడివి అనుకున్నాను. యీ విధంగా మారతావని అనుకోలేదు. నీ మీద వచ్చిన ఆరోపణలన్నీ ఋజువైనాయి. డిఫెన్సు కోర్టులో నీ మీద విచారణ జరిగి దోషివని నిర్ణయింపబడింది. రేపు వుదయం పదిగంటలకు కర్గోజా మిలటరీ జైలులో డిఫెన్సు ఆఫీసర్ల ముందు, హోమ్ మినిష్టరు, డిఫెన్సు మినిష్టర్ల కళ్ళఎదుట... నిన్ను వురి తీస్తారు..." చైనీస్ బ్యూటీ by Madhu babutag:kinige.com,2010:http://kinige.com/kbook.php?id=1492011-04-07T10:45:02-07:00Madhu babu noreply@kinige.com చైనాలోని దుష్ట సైంటిస్టులు భూకంపాలు సృష్టించే యంత్ర సామాగ్రి కనుగొని భారతదేశాన్ని, చైనాను గడగడలాడిస్తుంటే - అదే సమయంలో భారతదేశం షాడోను రంగంలోకి దించితే, కలిసి పనిచేద్దాం అనే మిషతో షాడోను హతమార్చడానికి చైనీస్ బ్యూటీ రంగంలోకి దిగితే ఆ కథ చివరకు ఏ మజిలీ చేరుకుంటుందో ఈ మధుబాబు విరచిత రోమాంఛితమైన స్పై ధ్రిల్లర్ నందు చదివి ఆనందించవలసినదే. ద్రౌపది by Dr. Yarlagadda Lakshmi Prasadtag:kinige.com,2010:http://kinige.com/kbook.php?id=6202012-02-03T22:28:40-08:00Dr. Yarlagadda Lakshmi Prasad noreply@kinige.com ★ 1972 ఆంధ్రోద్యమంలోనూ, 1975 అత్యవసర పరిస్థితి కాలంలోనూ విద్యార్థి నాయకుడుగా అంతరంగిక భద్రతా చట్టం కింద నిర్బంధానికి గురైన డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మూడు దశాబ్దాలుగా విద్యార్థుల విశేష ఆదరాభిమానాలను చూరగొన్న అధ్యాపకుడు. ★ హిందీ, తెలుగు భాషలు రెండింటిలోనూ డాక్టరేట్లు పొందిన నిత్య పరిశోధకుడు. మూడు పదులకి పైగా ప్రసిద్ధ గ్రంథాలను రచించి పిన్న వయసులోనే కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారాన్ని పొందిన రచయిత. ★ అమెరికా, బ్రిటన్, జపాన్, హాంకాంగ్, బెల్జియం, మారిషస్, మలేషియా, థాయ్‌లాండ్, కెనడ, స్పెయిన్, రష్యా, ఉక్రెయిన్, ఈజిప్ట్, అరబ్, ఎమిరేట్స్ మొదలైన దేశాల్లో పర్యటించి వందలాది సమావేశాల్లో సభారంజకంగా ప్రసంగించి విద్వజ్జనుల మన్ననలందుకున్న వక్త. ★ రాజ్యసభ సభ్యునిగా ఉన్నా, రచనా వ్యాసంగం మాననివాడు. రాజ్యసభ పదవీ విరమణ అనంతరం కూడ అధ్యాపక వృత్తిని ఎంచుకున్న బోధనారంగ ప్రేమికుడు. ★ పార్లమెంటరీ అధికార భాషా సంఘ ఉపాధ్యక్షుడుగా, కేంద్రీయ హిందీ సమితి సభ్యుడుగా, ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ ఛైర్మన్‌గా , విశ్వహిందీ సదస్సు నిర్వాహకుడుగా, హిందీ భాష అమలుకు కంకణం కట్టుకుని హిందీ ప్రాంతీయులకు అబ్బురపాటు కలిగించిన జాతీయవాది. ★ తెలుగుకు ప్రాచీన భాష హోదా కోసం కృషి చేసేందుకు ప్రభుత్వం నియమించిన టాస్క్ఫోర్స్ సభ్యుడుగా, ప్రథమ, ద్వితీయ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వాహక సంఘ అధ్యక్షుడుగా, పలువురు ప్రసిద్ధుల రచనలు తెలుగులో అనువదించిన రచయితగా తెలుగు భాషను ప్రేమించే తెలుగు బిడ్డ. బ్లడీ బోర్డర్ (షాడో స్పై థ్రిల్లర్) by Madhu babutag:kinige.com,2010:http://kinige.com/kbook.php?id=1132011-02-11T09:33:15-08:00Madhu babu noreply@kinige.com తీవ్రవాదులు బోర్డర్ దాటకుండా నిరంతరం కావలా కాస్తుండే సైనికులపై కత్తుల్లాంటి పిడిబాకుల్ని ప్రయోగించి వారి రహస్యాలను తెలివిగా తెలుసుకోని దేశ రక్షణను ప్రమాదంలో పడేసిన శతృవులపైకి భారత సైన్యం షాడో అస్త్రాన్ని ప్రయోగిస్తే, కిల్ మాస్టర్ ఎలా దేశ రక్షణ బాధ్యత వహించాడో ఈ రోమాంఛితమైన థ్రిల్లర్‌నందు చదివి ఆనందించండి. మధుబాబు కలం నుండి జాలువారిన ఈ అద్భుత షాడో స్పై థ్రిల్లర్‌ను సగర్వంగా మీకు సమర్పిస్తున్న వారు కినిగె డిజిటల్ టెక్నాలజీస్. కళ్యాణ తిలకం by Madhu babutag:kinige.com,2010:http://kinige.com/kbook.php?id=1572011-04-24T21:02:59-07:00Madhu babu noreply@kinige.com మధుబాబు కలం నుండి జాలువారిన అద్భుత జానపద నవల కాళికాలయం - ఈ కళ్యాణ తిలకం ఆ నవల యెక్క మూడో భాగం. వసంతుడు, బలదేవుడు పూటకూళ్లమ్మ ఇంట్లో ఉండి, ఆ రాజ్యపు అంతఃపుర రహస్యం ఎలా ఛేదించారు ? కొండలపై నిద్రపోతున్న యక్షిణి రహస్యాన్ని ఎలా చేదించారు ? దుష్టమాత్రికుడు ఆముఖుడి ఆట ఎలా ముగిసింది ? ఆహ్లాదకరమైన పరిసరాలలో, అందమైన మనుషుల మధ్య జరుగుతూ అడుగడుగునా ఊహించని మలుపులు తిరుగుతూ సాగే కాళికాలయం చివరి భాగం, మేటి జానపద గాథ, చదివించేది, తప్పనిసరిగా చదవాల్సింది.