All Books showing latest- Kinige eBooks for rent/sale on Kinige Digital Technologiestag:kinige.com,2010:http://kinige.com/kfeed.php?entity=books&filter=all&order=latest2012-05-17T23:49:55-07:00 Kinige Admin noreply@kinige.com ఫ్లయింగ్ హార్స్ by Madhu babutag:kinige.com,2010:http://kinige.com/kbook.php?id=8232012-05-17T23:23:07-07:00Madhu babu noreply@kinige.com ఎదురు తిరిగిన ఒక వ్యక్తిని నిర్ధాక్షిణ్యంగా ఖతం చేసి వచ్చాడు షాడో అంతకు ముందే!
పరిచయం కూడా లేని చిన్న పిల్లలతో దాగుడుమూతలు ఆడుతున్నాడు - తనుకూడా ఒక చిన్న పిల్లవాడై!!
చుట్టూ చేరి గుంపు కట్టి వున్న చిన్నపిల్లల నవ్వులకు, అతని పెదవుల మీద కనబడీ కనబడనట్లున్న చిరునవ్వుకు పెద్ద తేడా కనిపించటం లేదు.
అనుక్షణం ప్రమాదాలతో తలపట్లు పట్టి పట్టి కరుకుగా తయారయిన అతని గుండెల్లో - అటువంటి చిలిపితనం, అంతటి అమాయకత్వం దాగున్నాయని అంటే నమ్ముతారా ఎవరైనా??
బంజాయ్ by Madhu babutag:kinige.com,2010:http://kinige.com/kbook.php?id=8222012-05-17T01:14:11-07:00Madhu babu noreply@kinige.com “మైగాడ్! ఇది కుంగ్‌ఫూ విద్యా పీఠానికి చెందిన జేబుగుడ్డ!!” దాన్ని చూడగానే ఆశ్చర్యంగా అన్నది సుమీ ఇవాటో.
“కరెక్ట్ మైడియర్ సుమీ.... కుంగ్‌ఫూ విద్యాపీఠంలో భారతదేశం నుంచి వచ్చిన షాడో అనే గజదొంగ విద్య నేర్చుకుంటున్నాడు. అరివీర భయంకరులైన నింజా గురువుల్నే మూడు చెరువుల నీళ్ళు తాగించిన మనిషి అతనని నాకు ఆలస్యంగా తెలిసింది.... లిన్‌ఫాంగ్ మరణించిన ప్రదేశంలో దొరికిన ఈ జేబుగుడ్డను ఈ రోజునే నాకు అంద చేశారు మనవాళ్ళు....” అంటూ చేతుల్ని వెనక్కి కట్టుకొని పచార్లు మొదలెట్టాడు ముసుగు మనిషి.
“అయితే వాళ్ళని ఆపటం మనకు చేతకాదా? ఎదురు పడినప్పుడల్లా ఏదో ఒక అఘాయిత్యం చేసి పోతున్న ఆ దుర్మార్గుల్ని అలా గాలికి వదిలేయవలసిందేనా?” ఆవేశంగా అడిగింది సుమీ ఇవాటో.
ḍainamēṭ ḍōrā by Madhu babutag:kinige.com,2010:http://kinige.com/kbook.php?id=8212012-05-16T09:57:02-07:00Madhu babu noreply@kinige.com ఈ పుస్తకం తెలుగు అర్థం అయ్యి, తెలుగు లిపి చదవడం రాని వారికోసం. మీకు తెలుగు లిపి చదవడం వస్తే, మీ కోసం తెలుగు లిపిలో ఇదే పుస్తకం సిద్ధంగా ఉంది.
* * *
"rājū, mīrjāku atani sekraṭarīki saṃbaṃdhaṃ vunnaṭuṃdi.”
ṭehrān gōlḍen mains prayivēṭ limiṭeḍ muṃdu nilabaḍi ṭāksī kōsaṃ veyiṭ cēstunnāru. misṭar ḍik aṃḍ mises ḍōrā.
"elā kanipeṭṭāv ḍiyar?” aḍigāḍu shāḍō.
"ījī yū pūl! āme yūj cēstunna lip^sṭikkē atani pedimala mīda akkaḍakkaḍā vuṃdi. adīgāka manaṃ veḷḷēmuṃdē ēdō goḍava paḍinaṭlunnāru. cālā mūḍīgā vunnadāme.”
shāḍō maunaṃgā nilabaḍi vuṃḍaṭaṃ cūsi kōpaṃ vacciṃdi biṃduku. “ēṃ misṭar ḍeḍ shāṭ ḍik? nā ḍiṭekshan bāgōlēdā” niladīsi aḍigiṃdi.
పెద్దపులి ఆత్మకథ by Dr. M.V. Ramana Reddytag:kinige.com,2010:http://kinige.com/kbook.php?id=8202012-05-16T08:20:35-07:00Dr. M.V. Ramana Reddy noreply@kinige.com సుప్రసిద్ధ రచయిత ఆర్.కె.నారాయణ్ రచించిన " ఎ టైగర్ ఫర్ మాల్గుడి" అనే నవలకు ఇది అనువాదం.
* * *
సున్నితమైన హాస్యం, వ్యంగ్యం, శ్లేష మేళవించి గంభీరమైన విషయాలను కూడా వినోదాత్మకంగా రాసిన రచయిత నారయణ్. తన తొలి ఆత్మకథాత్మక నవల స్వామి అండ్ ఫ్రెండ్స్ (1935) తోనే గ్రాహంగ్రీన్ వంటి ప్రముఖుల ప్రశంసలను అందుకున్నాడు. ఈయనను తెలుగులో పట్టుకోవటమే ఒక సాహసం. పెద్దపులి ఆత్మకథ, మాటకారి చదువుతున్నంత సేపూ నారాయణ్ తెలుగులో రాస్తే ఇలాగే ఉంటుందనిపించేటంత సహజ సుందరంగా ఉంది శైలి. మాల్గుడిలోకి దక్షిణ భారత వాతవారణాన్ని చిత్రించటానికి మాండలికం సహాయం చేసిందనడంలో సందేహం లేదు.
- ముక్తవరం పార్థసారథి
* * *
డా. ఎం. వి. రమణారెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన వైద్యవిద్యను అభ్యసించిన తర్వాత 'లా' చదివి కొంత కాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసారు. కార్మికనేతగా, క్రియాశీల రాజకీయవేత్తగా సుప్రసిద్ధులు. రచయితగా, సృజనశీలిగా విలువైన రచనలను తెలుగు పాఠకులకు అందించిన ఆయన రాయలసీమ వెనుకబాటుతనాన్ని మొట్టమొదటగా గణాంకాలతో సహా ప్రజల ముందుంచారు. పరిష్కారం కథల సంపుటి, రాయలసీమ కన్నీటిగాథ, తెలుగు సినిమా - స్వర్ణయుగం వీరి రచనలు. పాపియాన్‍కు వీరి తెలుగు అనువాదం రెక్కలు చాచిన పంజరం, పురోగమనం పేరెన్నికగన్నవి.
ఆయుధం పట్టని యోధుడు by Dr. M.V. Ramana Reddytag:kinige.com,2010:http://kinige.com/kbook.php?id=8192012-05-16T05:12:18-07:00Dr. M.V. Ramana Reddy noreply@kinige.com అమెరికన్ నల్లజాతి పోరాటంలో అహింసా విధానానికి ఊపిరిపోసి, 'నోబెల్ శాంతి పురస్కారం'తో సత్కరించబడిన డా. మార్టిన్ లూథర్ కింగ్ జీవితచరిత్ర ఇది.
* * *
"మార్టిన్ లూథర్ కింగ్ జీవితచరిత్ర మాత్రమే కాదు, ఇది అమెరికా సాంస్కృతిక చరిత్ర కూడా!!.
ఒక సిటీ బస్సులో ప్రయాణం చేస్తున్న ఒక నల్లజాతి స్త్రీ, ఒక తెల్లజాతీయునికి సీటు ఖాళీ చేసి ఇవ్వని కారణంగా అరెస్టుకి గురయ్యింది. ఆ సంఘటనతో ప్రారంభమైన జాతి వివక్ష ఉద్యమం లూథర్ కింగ్ నాయకత్వంలో ఎలాంటి ప్రకంపనలు కలిగించింది, ఎలాంటి అవరోధాలు ఎదుర్కున్నది, ఎలాంటి అణచివేతలకు గురిఅయినది, ఎలాంటి దశలను అధిగమించింది, ఈ పుస్తకం ద్వారా పాఠకుడు గ్రహించడమే కాకుండా తాను గూడా ఆ ఉద్యమంలో మానసికంగా ఉన్ములీకరణం చెందే విధంగా సాగిన రచనానిర్మాణం ఈ పుస్తకం యొక్క విశిష్టత."
- సింగమనేని నారాయణ
కెరటం నా కిరీటం by Dr. C. Bhavani Devitag:kinige.com,2010:http://kinige.com/kbook.php?id=8182012-05-16T04:22:08-07:00Dr. C. Bhavani Devi noreply@kinige.com ఇది డా. సి. భవానీదేవి గారి ఏడవ కవితా సంకలనం.
నేను
సముద్రానికి పుట్టిన
పిల్లసముద్రాన్ని కాదు
ఉరకలెత్తే నదిని
కన్నీటి పవనూ నేనే
నడిపే సరంగునూ నేనే
నావైపు పరిగెత్తుకొచ్చే తీరాన్ని నేనే
అందుకే కెరటం నా కిరీటం!
* * *
నా కవిత్వం బహిర్ అంతశ్చేతనల సమ్మిళితం. మూడున్నర దశాబ్దాలుగా ఇదే నా సంవేదన. పుట్టింది సముద్రతీరం. అదే నా జీవితానికీ కవిత్వానికీ బ్యాక్‌డ్రాప్. సముద్రంలో ఉన్నవన్నీ నాలోనూ ఉన్నాయి. మనుషుల్ని ప్రేమించటం నేర్పినందుకు సముద్రానికి నా కృతజ్ఞతలు.
- డా. సి. భవానీదేవి తెలుగు సినిమా - స్వర్ణయుగం by Dr. M.V. Ramana Reddytag:kinige.com,2010:http://kinige.com/kbook.php?id=8172012-05-16T03:09:40-07:00Dr. M.V. Ramana Reddy noreply@kinige.com తెలుగు సినిమాలలో ఆణిముత్యాలు అనదగ్గ ఎనిమిది సినిమాలపై డాక్టర్ ఎం. వి. రమణారెడ్డి రాసిన సమీక్షా వ్యాసాలివి.
ఈ పుస్తకం - సినిమాగదా అని తేలికభావంతో సరదాగా రాసినది కాదని శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ అభిప్రాయపడ్డారు. ప్రేమతో, గౌరవంతో, ఎందరో మహా కళాకారుల గొప్పతనాన్ని, మంచిని సత్కరించాలన్న సహృదయంతో, మంచిని పంచాలన్న మంచి మనసుతో ఈ పుస్తకం రాసారాని ఆయన అన్నారు.
సినిమా పట్ల చాలామందిలో కనిపించే తేలికభావాన్ని పోగొట్టాడానికి, ఒక ప్రేక్షకుడిగా రచయిత చేసిన చిన్న ప్రయత్నమే ఈ పుస్తకం. చివరకు మిగిలింది? by Dr. M.V. Ramana Reddytag:kinige.com,2010:http://kinige.com/kbook.php?id=8162012-05-16T02:06:24-07:00Dr. M.V. Ramana Reddy noreply@kinige.com సుప్రసిద్ధ ఆంగ్ల నవల "గాన్ విత్ ద విండ్"కు ఇది అనువాదం.
ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల కాపీలు అమ్ముడుబోయి చరిత్ర సృష్టించిన నవల.
సినిమాగా విడుదలై పది అకేడమీ అవార్డులు సొంతం చేసుకున్న నవల.
ప్రేమ, పెళ్ళి, కుటుంబ జీవితాలతో పాటు అమెరికాలో భూస్వామ్య విధానం జరిపిన చిట్టచివరి పోరాటాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించే నవల.
* * *
1861లో మొదలైన అమెరికా సంయుక్తరాష్ట్రాల అంతర్యుద్ధం నేపథ్యంగా ఈ నవల ఒక స్త్రీ జీవితాన్నీ, అంతరంగాన్నీ భూమికగా చిత్రించింది. అమెరికన్ అధ్యక్షుడు అబ్రహం లింకన్ పట్టుదల కారణంగా, అప్పటికే చివరిమెట్టుకు చేరిన బానిస విధానం, భూస్వామ్య విధానం ఎంత అవలీలగా కూలిపోయాయో ఇందులో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ప్రేమ, యుద్ధం, సంస్కృతి అనే మూడు వేరు వేరు పాయలను జడగా అల్లి, సాహితీ సౌందర్యానికి కానుకగా అర్పించిన శ్రీమతి మార్గరెట్ మిచ్చెల్ ఒకే ఒక నవలతో పాఠకుల మనసులో శాశ్వతంగా నిలిచిపోయింది.
ఇంత గొప్ప నవల, అక్కడక్కడ సమీక్షగా తప్ప, ఈ 70 సంవత్సరాల్లో తెలుగు పాఠకులకు అందలేదు. ఆ కొరత ఇప్పుడు తీరబోతూంది.
- నవ్య వారపత్రిక 19 నవంబర్, 2009
స్వాతంత్ర్యానంతర తెలుగు, హింది కవిత తులనాత్మక పరిశీలన (1947-1970) by Dr. C. Bhavani Devitag:kinige.com,2010:http://kinige.com/kbook.php?id=8152012-05-16T01:09:08-07:00Dr. C. Bhavani Devi noreply@kinige.com A Comparative Study of Post Independence Telugu Hindi Poetry (1947-1970)
* * *
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2002 సంవత్సరంలో పి.హెచ్.డి డిగ్రీ పొందిన సిద్ధాంత వ్యాసం ఇది.
1947 నుంచి 1970 దాకా అంటే ఈ 23 సంవత్సరాల కాలవ్యవధిలో తెలుగు హింది భాషలలో వెలువడిన ఆధునిక కవితారీతుల తులనాత్మక అధ్యయనమే ఈ పొత్తంలోని విషయం. రచయిత్రి డా. సి. భవానీదేవి ఈ కార్యాన్ని చాలా సమర్ధవంతంగా నిర్వహించారు.
ఈ పుస్తకాన్ని ఆరు అధ్యాయాలుగా విభజించి, విశ్లేషించారు. ఇందులో మొదటిది కవిత్వం`సమాజం'. అందులో కవితాస్వరూపం, దాని ఆవిర్భావ నిర్వచనాలను విశదీకరించారు. రెండవది స్వాతంత్య్రోద్యమం తొలినాటి సమాజ సాహిత్యాలు. దీనిలో ఇరుభాషలలోని సమకాలీన పరిస్థితులు, సంఘసంస్కరణ, దేశభక్తి, భావ ఛాయవాద కవిత్వధోరణులను తులనాత్మకంగా వివరించారు. మూడవ అధ్యాయమైన అభ్యుదయ, ప్రగతివాద కవితలో ఆ ప్రక్రియల ఆవిర్భావ వికాసాలు, అభ్యుదయ, ప్రగతిశీల కవితాధోరణులు మొదలైన అంశాలను తులనాత్మకంగా వివరించారు. నాల్గవ అధ్యాయమైన ఉభయభాషల్లో ప్రయోగవాద కవితలో తెలుగు హింది భాషలలో ఆ సమయంలో వెలువడిన ప్రయోగాత్మక కవితారీతులను, వాటి లక్షణాలను తులనాత్మకంగా వివరించారు. వచనకవిత `నయీకవిత’ అనే ఐదవ అధ్యాయంలో, తెలుగులో వచ్చిన వచనకవిత, హిందిలో నయీకవిత పేరుతో వెలువడిన కవితారీతుల యొక్క ఆవిర్భావ వికాసాలను, వాటి లక్షణాలను విశదీకరించారు. ఆరవ అధ్యాయంలో, ఇరుభాషలలో ఆ కాలంలో వెలువడిన సంప్రదాయ కవిత వికాసాన్ని, ఆ కవితాలక్షణాలను తులనాత్మకంగా వివరించారు.
రచయిత్రి మొత్తంమీద పైన వివరించిన వివిధ విభాగాలలోని వివిధ ప్రక్రియలలోను, ధోరణులలోను వెలువడిన కవితారీతులను, వాటి లక్షణాలను క్షుణ్ణంగా పరిశీలించి, విశ్లేషించి, సోదాహరణంగా వివరించి సామ్య భేదాలను చూపిస్తూ తులనాత్మక చర్చ చేసి పుస్తకాన్ని ఒక ప్రామాణిక గ్రంథంగా తీర్చిదిద్దారు.
- ఆచార్య కస్తూరి విశ్వనాథం
tilak kathalu 1 by Devarakonda Balagangadhara Thilaktag:kinige.com,2010:http://kinige.com/kbook.php?id=8142012-05-15T09:25:17-07:00Devarakonda Balagangadhara Thilak noreply@kinige.com ఈ పుస్తకం తెలుగు అర్థం అయ్యి, తెలుగు లిపి చదవడం రాని వారికోసం. మీకు తెలుగు లిపి చదవడం వస్తే, మీ కోసం తెలుగు లిపిలో ఇదే పుస్తకం సిద్ధంగా ఉంది.
* * *
dēvarakoṃḍa bāla gaṃgādhara tilak raciṃcina kathalani nālugu bhāgāla ī-buks^gā samarpistōṃdi kinige. idi modaṭi bhāgaṃ. iṃdulōni kathalu
"libiyā yeḍārilō"
kadalē nīḍalu
addaṃlō jinnā
hōṭellō
āśākiraṇaṃ
bābu
yavvanaṃ
* * *
nalabhai ēḷḷu paibaḍina tānu, tana sabhyatakī, svabhāvānikī viruddhamaina panulannī batakaḍaṃkōsaṃ cēśāḍu. kāni dāni falitaṃgā mariṃta avamānānni, duḥkhānni koniteccukunnāḍu. iṃkā tanilāga ennēḷḷu ākalitō batakagalaḍu? tana kuṭuṃbāniki ēṃ dāri cūpiṃcagalaḍu? bhayaṃkaramaina nissahāyata atanni cuṭṭukuṃdi. ataniki cīkaṭlōki jāripōtunnaṭlu cīkaṭi nīḷḷalō pīkalōtu munigipōtūnnaṭṭu uṃdi. nīrasaṃvalla atani kāḷḷū cētulū lāgutunnāyi. atanikalāga gōḍa nānukuni ālōciṃcē vōpika kūḍā lēkapōyiṃdi.
alā magatagā nistrāṇagā vunna ataniki 'nānnā' anna piluputō melakuva vacciṃdi. kaḷḷuteraci cūśāḍu. atani peddakoḍuku padēḷḷavāḍu 'ammarammaṃṭōṃdi' annāḍu.
"ēṃ?"
"tiṃṭāniki."
* * *
cakkani, ālōjiṃpajēsē kathalanu āsvādiṃcaṃḍi!!