
నేను నా జీవితం లో చదివిన మొదటి నవల. చిన్నప్పటి నుండి తెలుగు అంటే చాలా ఇష్టం. స్కూల్ లో ఎన్ని సబ్జక్ట్స్ ఉన్నా తెలుగు ప్రత్యేకత వేరు. అది కొందరికి మాత్రమే బోధ పడుతుంది.
అలా తెలుగు మీద ఉన్న ఇష్టంతో కినిగే చూడగానే ఒక మంచి బుక్ చదవాలి అని అనిపించింది. చిన్నతనంలో యండమూరి నవలలు బాగుంటాయని ఎక్కడో విన్నా.
సరే అని వెన్నెల్లో ఆడపిల్ల కొని చదివాను. ఈ పుస్తకాన్ని కొన్నవెంటనే నాలుగు గంటలు అలానే అలానే కూర్చొని చదివి ముగించాను. మద్యలో ఆపుదాం అనిపించలేదు.
చివరలో కధని అలా ముగించడం కొంచెం బోధపడలేదు. కాని అందరు చదవ వలసిన ఒక గొప్ప నవల.