
ముందుగా రంగనాయకి గారికి నమస్కారములు! నేను ప్రివ్యూ చూశాను కానీ కొనలేదు. ఎందుకంటే కోనాల్సినంత విషయం లేదని అర్దమైంది గనుక. కానీ కొన్ని విషయాలు చెప్పదలిచాను. 1. పండితులు రామాయణం పూర్తిగా ప్రజలకి చెప్పలేదు అని రాశారు, సరే నిజమే అనుకుందాం కానీ రామాయణం వాల్మీకి కన్నా ముందే ఉండి ఉంటుంది అని రాశారు. ఆ విషయం మీకు ఎలా తెలుసు? వాల్మీకి మీకు కలలోకి వచ్చి చెప్పారా? లేక మీ సొంత ఇంటర్ప్రిటేషన్ అనుకోవాలా? 2. రాముడికి భరతుడికి రాజ్యం మీద హక్కు ఉందని ముందే తెలుసని కానీ తండ్రి రాజ్యాధికారం చేపట్టమని అడిగినప్పుడు ఆ విషయం బయటపెట్టలేదని రాశారు. రామాయణం మొత్తం చదివి కూడా రాముడు పితృవాక్యకి ఎంత విలువ ఇస్తాడో అర్దం కాలేదా? తప్పైనా ఒప్పైనా తండ్రి మాటకు అడ్డు చెప్పని రాముడి తత్వం గమనించలేదా? అది రాముడి ప్రిన్సిపల్! అదే తండ్రి తరువాత రోజు నువ్వు అడవులకు వెళ్ళు అని చెప్పినప్పుడు అలాగే అని తలూపిన రాముడి స్థితప్రజ్ఞత తెలుసుకోలేకపోయారా? భగత్ సింగ్ ని కాపాడలేదని గాంధీని కూడా విమర్శించేవారున్నారు. కానీ అది గాంధీ ప్రిన్సిపల్. ఆలాని గాంధీని తప్పుబడతామా? విలువలకి కట్టుబడే అలాంటి వారి వ్యక్తిత్వం అందరికీ అర్దమయ్యేది కాదు. పైగా అడవిలో రాముడు భరతుడి హక్కు గురించి బయటపెట్టాడని చెప్పారు. రాజ్యం మీద యావ ఉంటే అప్పుడు కూడా బయటపెట్టేవాడు కాదు రాముడు. అప్పుడు బయటపెట్టిన రాముడి నిజాయితిని ఎందుకు హర్షించలేకపోతున్నారు? 3. వాల్మీకి ఋషుల గురించి తప్ప మామూలు వ్యక్తుల గురించి చెప్పలేదన్నారు, చెప్పకపోతే వచ్చిన నష్టం ఏంటి? ఇక్కడ వాల్మీకి ఉద్దేశం మంచిని బొదించడమే! అంతేకానీ అన్నీ విషయాలు చర్చించడం కాదు. ధన్యవాదాలు. నా వాక్యలకి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించాలి. కానీ నిజం ఎప్పటికైనా నిజమే....