Comment(s) ...

రామ్@శృతి.com

'జన్మ ధన్యం అయ్యింది' అంటారు కదా అలా ఉంది ఈ పుస్తకం చదువుతూంటే...

ప్రతి పేజి తిప్పగానే హఠాత్తుగా చక్కిలిగింతలు పెట్టినట్లు హాయిగా నవ్వడమే...

త్రివిక్రమ్ కి ఏమాత్రం తగ్గని చమత్కారాలు

ఈ సాఫ్టువేరు ప్రణయగాధ అలా అలా తెలియకుండా చదివించేస్తుంది.

రచయిత స్వంత బ్లాగులో కూడా చదువ చక్కని చమత్కారాలు చాలా ఉన్నాయి.
http://ramaddanki.blogspot.sg

అయ్యా అద్దంకి అనంతరామయ్యా ఇంత చక్కని ప్రణయగాధని చక్కిలిగింతలతో నింపిన మీ చమత్కారాలకు ఫిదా అయ్యాము. 'శ్రీ శ్రీ' తరహాలో 'అ అ' కలం పేరుతో మీరు వర్థిల్లాలని తెలుగు తల్లి సేవలో తరించాలని కోరుకుంటున్నాను. మీకు మా హృదయపూర్వక అభినందనలు.

ఈ పుస్తకం మన 'కినిగే' లో కొని చదివేయండి. ఆలస్యం అమృతం కోకాకోలా

అయిదు నక్షత్రాల హోటల్ ఆర్కిడ్ అధిపతి అయిన విఠల్ వెంకటేష్ కామత్ యొక్క ఆత్మకథ కు యండమూరి వీరేంద్రనాథ్ గారి తెలుగు అనువాదం 'ఇడ్లి - ఆర్కిడ్ - ఆకాశం'. కినిగే వారి ముందే చెప్పినట్లు ప్రతి పుటలో ఒక జీవిత పాఠం. పసుపు రంగు తొడగవలసిన పంక్తులెన్నో. గుండెకు హత్తుకొనేలా, మనసులో నిలిచిపోయేలా ఉన్న ఆయన ప్రయాణం పాతాళం నుంచి ఆకాశం వరకు ఆసక్తికరం మరెంతో స్పూర్తిదాయకం. అద్భుతంగా ఉంది. మీరు తప్పక చదవవలసినదిగా కోరుతున్నాను

కొండూరు తులసీదాసు గారి స్వీయ అనుభవంతో వ్రాసిన "మేము పర్యటించిన సింగపూరు - మలేషియా" అనే పుస్తకం కినిగేలో కంటబడగానే కొని చదివాను. తన ప్రయాణాన్ని రచయిత ఆసక్తికరంగా క్లుప్తంగా వివరించారు. సింగపూరు మరియు మలేషియా యాత్ర రావాలనుకున్న వారికి ఈ పుస్తకం ఉపయోగపడగలదు

సౌర శక్తి పై అవగాహన కోసం ఈ అరవింద్ గుప్తా వ్రాసిన 'సౌర శక్తి కథ' చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఉపయోగపడుతుంది. పుస్తకం మొత్తం బొమ్మల రూపంలో ఆసక్తికరంగా ఉంది. ప్రాచీనులు సౌరశక్తి వాడకం నుంచి నేటి వరకు, వాటికి గల అడ్డంకులన్నీ సులభంగా వివరించారు.

'ఓడ్కా విత్ వర్మ' ఒక మంచి కాఫీ లాంటి పుస్తకం. వర్మ విలక్షణ వ్యక్తిత్వమో లేక సిరాశ్రీ రచనా విధానమో ఈ పుస్తకాన్ని చక చకా చదివించేసింది. పుస్తకం చదువుతున్నంత సేపు ఒక్క క్షణం కూడా బోర్ కొట్టదు. నాకు విపరీతంగా నచ్చింది, జ్వరం కూడా వచ్చింది.

మూలా రవి కుమార్ గారు వ్రాసిన 'చింతల వలస కథలు' అనే పుస్తకం చదివాను. ఉత్తరాంధ్ర ప్రాంతం లోని చింతల వలస గ్రామం లోని అమాయక ప్రజల జీవితాల తో ముడిపడిన కథల సంకలనం ఆద్యంతం రక్తి కట్టిస్తాయి. ఈ కథల్లో దొర్లిన ఉత్తరాంధ్ర మాండలిక పదాలు చదువ ముచ్చటగా ఉన్నాయి. ప్రతి ఒక కథా మంచి అభిప్రాయాన్ని కలుగజేస్తుంది. కాకపోతే అప్పుడే కథ అయిపోయిందే అనిపించేలా ఉన్నాయి ఈ చింతల వలస కథలు. అంత త్వరగా కథ నుంచి బయటకు రావడానికి మనసోప్పుకోదు. నాకు బాగా నచ్చాయి ఈ కథలు. థాంక్స్ రవి కుమార్ గారు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి 'చిన్న చిన్న అద్భుతాలు' అనే పుస్తకం చదివాను. ఇందులో అమెరికా లో కాకతాళీయంగా జరిగిన అద్భుత సంఘటనలను చిన్న చిన్న కథలుగా అమర్చారు. మనం గుర్తించని ఇటువంటి కాకతాళీయాలు మన జీవితం లో అనేకం జరిగి ఉంటాయి. అవన్నీ భగవంతుడు గోప్యంగా ఉండి చేసే పనులు. ఎప్పుడైనా మనసులో నిరాశ అలుముకుంటే ఇందులోని కొన్ని కథలు చదవగనే మనసంతా భగవంతుని పై నమ్మకం తో నిండిపోయి, నిరాశ ఆమడ దూరం పారిపోతుంది. ఈ పుస్తకం నా దగ్గర ఉండగా ఏ నిరాశ నా దరికి రాలేదు అంటే అతిశయోక్తి కాదు.

డేగ రెక్కల చప్పుడు

ఒక సారి చదవటం ప్రారంభిస్తే విరామం తీసుకోడానికి మనసోప్పని పుస్తకం. తాలిబాన్ ఉగ్రవాదం నేపధ్యం తో నిండిన మంచి థ్రిల్లర్. ఏక బిగిన మూడు వందల పుటలను త్వరగా చదివించగల శిల్పం. అంతా యండమూరి వారి సాహిత్య శైలి. కుదిరితే మీరు చదవండి.

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

NAAKU NACHALEDHU. ASALU BOOK A OPEN AVVADAMLEDHU. OKK PDF LEDHU............... NAAKU PDF FORMET KAAVALI ASALU OPEN AVVADAM LEDHU. MALLI ADOBE ID ANI EDHO ADUGUTHUNDHI, NENU 60 RUPES PAY CHESA BUT NOT SATISFIED

Purchased ebook but it very hard to download to my pc and my iphone. Total waste of money

Sir, we looking for this book to buy. Please provide phone no and address for availability. My no 9290825840

I'm unable to download file. Only url is downloading.what to do?

Subscribe
Browse