Comment(s) ...

షర్మిలా ...నువ్వు అగ్నిహోత్ర అనుకుని మేన్ రోబో ను హగ్ చేసుకున్నప్పుడు మేన్ రోబో సైతం స్పందించిన ఆర్థ్రత ,చూపించిన ఎమోషన్ అక్షరకు అందనిది...మనసును పట్టి కుదిపేసే థ్రిల్లర్ ..సులోచన పాత్ర ఒక కొత్త డైమెన్షన్ ...ఆమె ఎత్తు ఆమె జీవితాన్నే ప్రశ్నించడం రచయితా సృజనాత్మకత ..నభూతో నభవిష్యతి..ప్రతీపాత్రకో ఐడెంటిటీ ..ప్రతీపధంలో బ్యూటీ .హేట్సాఫ్ మేన్ రోబో .

దాంపత్యజీవితంలో వ్యక్జ్తిగత ప్రపంచంలో పడగ్గదిలో నిస్సారమై నిర్వీర్యమైపోతోన్న రోమాంచితానుభవాలను అక్షరాల్లోకి అనువదించిన కథలు ఇవి.ముఖ్యంగా ఆపిల్ కథలోని సిద్దార్థబసు కనిపెట్టిన ఆపిల్ ను కనిపెట్టే సైంటిస్ట్ ఉంటే ఎంత బావుంటుంది ? భార్యల మనసుల్ని అర్థం చేసుకునే భర్తలు ఎక్కడ?
ప్రతీకథలో భావోద్వేగం..ఎమోషనల్ టచ్...
ఇందులో ప్రతీ కథానాయకుడు కలల రాకుమారుడు..
శుభరాత్రి క్యాండిల్ లైట్ శోభనం ..ప్రతీ కథ భార్యాభర్తలు మిస్సవుతున్న పర్సనల్ రొమాంటిక్ లైఫ్ ను గుర్తు చేస్తున్నాయి.
ఈ పుస్తకంలోని కథలు మనసును హత్తుకున్నాయి.

నా చిన్నప్పుడు వసంతబాల పిల్లల నవలలు చదివాను.కాశీమజిలీ కథలు ఇష్టంగా చదివేదానిని.చాలాకాలం తరువాత ,
" మాయాశిల్పం.మంత్రఖడ్గం " జానపద నవల చదివాను.నేను చిన్నపిల్లనై పోయాను.ఎంతబావుందో నవల.మా పిల్లలకు నవల చదివి వినిపించాను.
" మాయాశిల్పం మణిమేఘనగా మారింది. చుట్టూ చూసింది. తనకు తానెవరో జ్ఞప్తికి రావడం లేదు.
*నేనెవరిని? మీరెవరు? అని ప్రశ్నించింది. మణిమేఘనగా మారిన మాయాశిల్పం " ఇలాంటి వాక్యాలు చదువుతుంటే కళ్ళు అక్షరాలా వెంట మనసు జానపద కాలం వెంట పరుగెత్తింది
*”మా గంధర్వ యువరాణీవారు ఉద్యానవనంలో వుంది. .వెనక్కి వెళ్ళండి" అని భటులు చెప్పగానే మేఘాలు పక్కకు తప్పుకున్నాయి. చంద్రుడూ తప్పుకున్నాడు కొలనునీటిలో తన ప్రతిబింబం కనిపించకుండా..
అద్భుతమైన కథనం.
థాంక్యూ కినిగె.

రచయిత రాసిన ఈ వాక్యాలు చదువరుల గుండెల్లో నిలిచిపోతాయి.ప్రతీఒక్కరిని చదివింపజేస్తాయి.

అద్భుతమైన విశ్లేషణ.దంపతులు తప్పకుండా చదువవలిసిన కథలు
పడగ్గది కేవలం మీరు నిద్రించే స్థలం మాత్రమే కాదు.
ఈ సృష్టిలో...
ప్రకృతి,
స్త్రీ,
పెదవులపై స్వచ్ఛంగా మెరిసే నిష్కల్మషమైన చురునవ్వు.
ఈ మూడింటినీ నిరంతరం ప్రేమిస్తాను.ప్రేమిస్తూనే వుంటాను.
అయితే ప్రకృతి ప్రళయాన్ని సృష్టించి బీభత్సంగా మారినా.
స్త్రీ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయినా
చిరునవ్వులో కల్మషం కనిపించినా ..
అందమైన కల కరిగిపోతుంది.
ప్రకృతిని,అందంగా స్వచ్ఛమైన చిరునవ్వును తన పెదవులపై నిలుపుకునే పరిపూర్ణ వ్యక్తిత్వం వున్న స్త్రీని మించిన గొప్ప సౌందర్యం బ్రహ్మదేవుడు కూడా సృష్టించలేదన్నది నా స్ట్రాంగ్ ఫీలింగ్.
అలాంటి స్త్రీ ...నా కథలకు స్ఫూర్తి.

సర్ ,
రియల్లీ వండర్ ఫుల్ బుక్.బిజీ జీవితంలో మేమేం కోల్పోతున్నామో ఈ పుస్తకంలో ప్రతీ అక్షరం చెబుతుంది.ముఖ్యంగా ఇరవైనాలుగు గంటల్లో చనిపోతానని తెలిసినప్పుడు ఆ మనిషి తపనే జీవితానికి నిర్వచనం చెబుతుంది.మీరు రైల్వే స్టేషన్ లో గడిపిన అనుభవం కంటతటది పెట్టించింది.ఈ పుస్తకం ఎవర్ గ్రీన్.ధన్యవాదాలు సర్

చతురలో విజేత నవల జులై 1997 లో చదివాను.
ఒక అందమైన మనసున్న, బావను తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే అమ్మాయి... "బావా.. నిన్ను సినిమా హీరోగా చూడాలని వుంది. నీ బొమ్మ మన టూరింగ్ టాకీస్ లో వస్తే ఈలలు వేయాలని వుంది" అని అమాయకంగా అడిగితే...
"అంతేనా... సరే అయితే.. నీకోసం హీరోని అవుతాను..." అని సినిమా రాజధానికి వెళ్లి, అంచెలంచెలుగా హీరో స్థాయికి ఎదిగి... హీరోగా తన సినిమా అంతా చూస్తుంటే, తను మాత్రం... ఒక నిర్ణయం తీసుకున్నాడు...
ఈ నవల ఇన్నాళ్లకు మళ్ళీ ఇప్పుడు చదువుతున్నా అదే ఫ్రెష్ ఫీలింగ్..అదే ఎమోషన్
పల్లెటూరు నేపథ్యంలో అందమైన బావమరదళ్ళ స్వచ్ఛమైన ప్రేమకథ.
" గెలిచేవాడు కాదు గెలిపించేవాడే నిజమైన విజేత" అని చెప్పిన నవల

పెళ్ళైన దంపతులు తప్పక చదవవలిసిన నవల,
ఒకరినొకరు అపార్థాలు లేకుండా అన్యోన్యంగా ఎలా ఉండవచ్చో చెప్పే మంచి నవల,
అపార్థాలతో కుళ్లూకుతంత్రాలతో సాగే టీవీ సీరియల్స్ కన్నా ఇలాంటి ఆహ్లాదంగా వున్నా నవల మిన్న .

క్యాన్సర్ తో పోరాడి గెలిచి,తన గెలుపును ఇతరులకు స్ఫూర్తిని ధైర్యాన్ని కలిగించేలా " నేను క్యాన్సర్ ని జయించాను " పుస్తకాన్ని రాసిన తేజారాణి తిరునగరి గారు అభినందనీయులు.
ఈ పుస్తకం ఎందరికో ధైర్యాన్ని ఇస్తుంది .

తేజారాణి గారి " కొన్ని కథలు...మరికొన్ని కవితలు "చదివాను." జీవితానికి అర్థం చెప్పే కథలు..మనసును హత్తుకునే కథలు,మీ అమ్మగారి గురించి రాసింది చదువుతుంటే కన్నీళ్లు వచ్చాయి.మీరు ఇలాంటి మరెన్నో కథలు ,కవితలు రాయాలి.

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

దశరద్ గారు ! మీ e-books ఎంతో అద్భుతంగా ఉన్నాయి.ఎంతో విలువైన శిల్పసమాచారాన్ని ఉచితంగా అందించారు.తెలుగులో శిల్పకళలపై ఉన్న పుస్తకాలు చాలా తక్కువ.ఆ లోటుని మీరు తీర్చినట్లయింది.అరుదైన శిల్పసంపదపై యింత విలువైన పుస్తకాలు ఉచితంగా పాఠకలోకానికి అందించడం మీ పెద్ద మనసుకు నాజోహార్లు- రామమోహనరావు,9391685603

I want this book at home address

Sir ,I want padmavyuham

I want dashanam montly magazine sir plz help me..

షర్మిలా ...నువ్వు అగ్నిహోత్ర అనుకుని మేన్ రోబో ను హగ్ చేసుకున్నప్పుడు మేన్ రోబో సైతం స్పందించిన ఆర్థ్రత ,చూపించిన ఎమోషన్ అక్షరకు అందనిది...మనసును పట్టి కుదిపేసే థ్రిల్లర్ ..సులోచన పాత్ర ఒక కొత్త డైమెన్షన్ ...ఆమె ఎత్తు ఆమె జీవితాన్నే ప్రశ్నించడం రచయితా సృజనాత్మకత ..నభూతో నభవిష్యతి..ప్రతీపాత్రకో ఐడెంటిటీ ..ప్రతీపధంలో బ్యూటీ .హేట్సాఫ్ మేన్ రోబో .

Subscribe
Browse