Comment(s) ...

కాలక్షేపం కోసం ఎన్నో పుస్తకాలు చదువుతాం." అసంతృప్తిని జయించండి " పుస్తకంలో జీవితం కనిపించింది.
అసంతృప్తులలో కూడా నిరర్థకమైన నిర్మాణాత్మక అసంతృప్తులు వుంటాయని ఈ పుస్తకజం చదివాక అర్థమైంది.సినిమా టికెట్ దొరక్కపోతే కలిగే అసంతృత్తికి ,సివిల్స్ లో ఓటమి ఎదురైతే కలిగే అసంతృత్తికి తేడా తెలిసింది.
నిర్మాణాత్మకమైన అసంతృప్తిని గుర్తించేలా చేసిన ఈ పుస్తకాన్ని ,రచయితకు కృతఙ్ఞతలు.
అసంతృత్తిని జయించాలని ( నిర్మాణాత్మక అసంతృప్తిని ) ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని నా నమ్మకం.

ఇంట్రెస్టింగ్
కారు సరాసరి కుబేరుడి లోకంలో ల్యాండ్ అయ్యింది సేఫ్ గా.
హాస్యం
కుబేరుడు చిద్విలాసంగా చూసి "వాట్ అబౌట్ మై వడ్డీ అండ్ అసలు" అని నిలదీసాడు.
సెటైర్
* *వెంటనె కృత్తిక "మీ టూ" అంది తనను కూడా ఆశీర్వదించమన్నట్టు కిందికి వంగి
"మీ టూ"అంటే కుబేరుడు అపార్థం చేసుకుని భయపడిపోతారు అన్నాడు లోగొంతుకతో కృత్తికతో
వావ్
* "మీలోకం కరెన్సీ కాదు..మా ఇండియా కరెన్సీ ...అదీ రద్దైన నోట్లు కాదు.. మోదీ గవర్నమెంట్ కొత్తగా అచ్చుగుద్దిన నోట్లు" చెప్పాడు వైభవ్
హహహ
* "ఇలా అడుగుతున్నందుకు క్షమించాలి. మీకు బిపి షుగర్ గట్రా ఉన్నాయా? అడిగాడు వైభవ్
" అనగా ..?” అడిగాడు కుబేరుడు
"మా లోకమునందు వుండు మాయరోగములు...జన్యుపరంగా, స్ట్రెస్ పరంగా వచ్చును" అన్నాడు వైభవ్
"మాకు శాపములు తప్ప రోగములు వుండవు.." చెప్పాడు కుబేరుడు
చదువుతున్నంతసేపూ నవ్వుకున్నాను ..ఆ తర్వాత నిజమే కదా అనుకున్నాను..ఇలా జరిగితే ఎంత బావుండు కదా..అని శ్రీనివాసుడ్ని కోరుకున్నాను...
జయహో కుబేరాయనమః
పైసా వసూల్ జిందాబాద్

క్యూ నవల చదవడం గొప్ప అనుభూతి.ఏలియన్ తో ప్రేమ,ఎమోషన్స్ ఆసక్తి కలిగించే సన్నివేశాలు....అన్నింటినీ సమపాళ్లలో అందించిన ఎంటర్టైనెర్...మనల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లే టైం మిషన్ .

ఎప్పుడెప్పుడు " ఎప్పుడెప్పుడు చదవాలా...? " అన్నంత బావుంది. మీ నార్త్ అవెన్యూ కూడా చదివా...రెండు నవలలు ఒకదానికి ఒకటి పోలిక లేకుండా విభిన్నంగా వున్నాయి.

రంగస్థలం మీద నటించే హీరో జీవితంలో నటిస్తే...అమ్మాయిలు అబ్బాయిలు అమ్మలు బామ్మలు నాన్నలు అందరూ చదవవలిసిన నవల.చాలా ఆలస్యంగా చదివాను.అద్భుతమైన నవల...కొన్ని పాత్రలు మనల్ని వెన్నాడుతూనే ఉంటాయి.నా మనసును హత్తుకున్న నవల

నవల చదువుతూ కళ్ళలో నీళ్లు ఆపుకోలేకపోయాను.ఈ నవల నేను కన్నడంలో చదివాను...నాకు కన్నడం కొద్దిగా వచ్చు..తెలుగులో నాకు తెలిసి స్వాతి మంత్లీ లో వచ్చింది. తలిదండ్రులను చిన్నప్పుడు గుండెల మీద ఆడుంచుకున్నప్పుడు బిడ్డలు కళ్ళతో తంతారు..అదే పెద్దయ్యాక కూడా అదేపని చేస్తే..తల్లిదండ్రులు ఏం చేయాలో అద్భుతంగా చెప్పిన నవల...
ముఖ్యంగా నవలలో డిస్క్రిప్షన్ లో వున్నా కొన్ని వాక్యాలు మనల్ని వెన్నాడుతాయి.
''దేవుడు విషాదాన్ని సృష్టించి, కంటి తుడుపుగా 'ఓదార్పు' ను సృష్టించాడు.
* కాఫీ వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయిట ...కాఫీ తగ్గించకూడదా?''
''గుండెపోటు కాఫీ తాగడం వల్ల రాదు. కొడుకు ప్రేమగా చూసుకోకపోతే వస్తుంది. కోడలు బిడ్డలా ఆలోచించలేకపోతే వస్తుంది''
*ఇద్దరు కసాయివాళ్ళు ఈ మేక నాకు కావాలంటే నాక్కావాలని గొడవ పడుతుంటే ఆ మేకపిల్ల ఎలా విలవిల్లాడిపోతుందో, ఆ తల్లి కూడా అలానే విలవిలలాడిపోయింది.
*ఓ దేవుడా నీకు శత సహస్ర కోటి కృతజ్ఞతలు. కృతఘ్నులైన కొడుకులనిచ్చి, కొండంత దేవుడైన భర్తను తీసుకెళ్లి, నా బాధను చూడలేక, నాకు అండగా ఓ తండ్రిని ఇచ్చినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ప్రభూ.
*మళ్ళీ జన్మంటూ వుంటే గొడ్రాలుగా పుట్టించు దేవుడా! అని దేవుడ్ని మనస్ఫూర్తిగా వేడుకుంది.
*అక్కడున్న సమాధులను కదిలిస్తే ఎన్ని కథలు వెతలుగా చెబుతాయో, అక్కడ తగలబడుతున్న చితులను అడిగితే ఎన్ని కన్నీళ్ళను అక్షరాలుగా అనువదిస్తాయో...?
**అదో స్మశానం ..దాన్ని అనుకుని శరణాలయం..స్మశానమే వారికి దేవాలయం...
చితికి నిప్పంటించి చేతులు దులుపుకుని అయినవాళ్లు వెళ్ళిపోతే,ఏమీకాని అతను ఆ చితిలో దేహం బూడిదగా మారేవరకు అక్కడే ఉంటాడు బసవప్ప...
మనసును తాకే మంచి నవల నిర్ణయం.

మనకు ఎందరో దేవుళ్లున్నారు..మరి నవ్వు దేవుడు కూడా ఉంటే..ఈ ఆలోచన నవ్వు తెప్పిస్తుంది..అందుకే కాబోలు స్వాతిలో 10 ,000 / పదివేల రూపాయల బహుమతి గెలుచుకుంది. విజయార్కె గారి కథలు ముఖ్యంగా కామెడీ కథలు విభిన్నంగా ఉంటాయి.నవ్వు కనబడుటలేదు కథలో నవ్వు కనబడుట లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు..భార్య బదులు యంత్రమైతే చెప్పినట్టు ఉంటుందని జపాన్ నుంచి తెప్పించుకున్న యంత్రసుందరి కథ..ఇళ్న్తి కథలు దూరప్రాంతంలో పని ఒత్తిడిలో వుంది నవ్వడం మర్చిపోయిన మాలాంటివారికి నవ్వును ఎనర్జీగా ఇస్తుంది.అరవై రూపాయలతో వందేళ్ల జీవితంలో నవ్వులు కురిపించే పుస్తకం " నవ్వు దేవుడొచ్చాడోచ్ "

అచ్చతెనుగు వాతావరణంలో అద్భుతమైన ప్రేమకథ.బావమరదళ్ళ ప్రేమకు అర్థం చెప్పినకథ...విజేతకు నిర్వచనం చెప్పిన నవల.." విజేత " " గెలిచేవాడు కాదు గెలిపించేవాడు.".అన్న మాటల్లో ఎంతో అర్థం వుంది.సినెమనటుల జీవితాల్లోని మరోకోణాన్ని చూపించింది.వ్యక్తిత్వవికాసాన్ని నవలలో ఆవిష్కరించిన తీరు ప్రశంసనీయం.వెరసి విజేత నవల భావోద్వేగాలకు పెద్దపీట వేసింది.ఇరవైఏళ్ళ క్రితం చదివినా ఇప్పుడు మళ్ళీ మరోసారి చదివించిన నవల,,,కళ్ళముందు పాత్రలు వున్న ఫీలింగ్..ఇలాంటి నవలలను అందిస్తున్న కినిగెకు,విజయార్కె గారికి అభినందనలు..కృతఙ్ఞతలు.

జైలుగోడల మధ్య హీరో సుమన్ సీరియల్ ఆంధ్రభూమిలో వస్తున్నప్పుడు ఒక సంచలనం.ప్రతీవారం ఎదురుచూసేదానిని...అప్పుడు క్యూరియాసిటీ తో చదివేదానిని.ఆ సీరియల్ గురించి చర్చించుకునేవాళ్ళం.సుమన్ తో గెస్ట్ గా ఒకరోజు షూటింగ్ లో గడిపే అవకాశం కోసం ( ఆరోజు షూటింగ్ మొత్తం చూసి సుమన్ గారితో కలిసి లంచ్ చేయడం ఆంధ్రభూమి పాఠకులకు మరుపురానిరోజు..అప్పట్లో అది ఒక కొత్త ప్రయోగం...) జైలులో సుమన్ గడిపిన రోజులను సంఘటనలను తలుచుకుని కంటతడి పెట్టుకునేవాళ్ళం..ఆ పుస్తకం అప్పట్లో మాకు దొరకలేదు.ఇన్నాళ్ల తరువాత e బుక్ రూపంలో మాకు దొరికింది.ఒక వ్యక్తిత్వవికాస పుస్తకంలో వున్న ఎన్నో విషయాలు సుమన్ గారి జైలు అనుభవాల ద్వారా తెలుసుకోవచ్చు.థాంక్యూ విజయార్కె గారు...థాంక్యూ సుమన్ గారూ థాంక్యూ కినిగె ..
విజయార్కె గారు తెలుగు పత్రికల్లో మీ రచనలకు అభిమానిని..మీ గుడ్ ఫాదర్ మరణశాసనం...మేన్ రోబో, క్యూ .నాకు చాలా ఇష్టమైన నవలలు...షర్మిల ప్రహేళిక ఆముక్తమాల్యద ,సాకేత్,అగ్నిహోత్ర,సిద్దార్థ పాత్రలు అంటే మరీ ఇష్టం .
కన్నడంలో అనువదించబడిన మీ పుస్తకాలకు కూడా ఫ్యాన్ ని...ఎందుకంటే నాకు కొద్దిగా కన్నడం చదవడం వచ్చు..నా ఫ్రెండ్ చదివి మరీ వినిపించేది.

థాంక్యూ కినిగె ..రెండు మంచి నవలలను ( మేన్ రోబో, అండర్ వరల్డ్ ) ఒకేరోజు చదివే అవకాశం వచ్చింది.డిటెక్టివ్ నవలలు థ్రిల్లర్ నవళ్లు రాసేవాళ్ళు చదివేవాళ్ళు తక్కువయ్యారు అన్నది నిజం కాదు..ఎందుకంటే ముఖ్యంగా " బాగా రాస్తే " చదివే నాలాంటి వాళ్ళు చాలా మనది వుంటారు.నేను కాలేజీ చదివేరోజుల్లో చదివిన గాడ్ ఫాదర్ నవల ఇప్పుడు " అండర్ వరల్డ్ " పేరుతో చదవడం థ్రిల్లింగ్ గా ఉంది.
మాఫియాను తరిమేసేందుకు అండర్ వరల్డ్ గాడ్ ఫాదర్ ను యాంటీ మాఫియా స్క్వాడ్ కు చీఫ్ గా నియమించడం థ్రిల్లింగ్ పాయింట్.." యే బహుత్ అన్యాయ్ " విభ్రమ క్షణం క్షణంలో శ్రీదేవి చెప్పిన డైలాగ్ ను చెప్పడం చాలా బీవండి.ముఖ్యంగా ఒక సంఘటన ..గ్రమ్ జరుగుతున్నప్పుడు టీవీ మీడియా చేసే హడావుడిని కొత్తకోణంలో చూపించి గోళీసోడా సీసాలతో ఎదురుదాడి చేసే ఆలోచన విభ్రమకు రావడం సూపర్బ్.అమితాబ్ లాంటి వాళ్ళతో వర్మ ఇలాంటి సినిమా చేయాలి.

చాలా ఆలస్యంగా ఈ నవలని చదువుతున్నాను. నవల చదువుతుంటే సినిమా చూస్తోన్న ఫీలింగ్.కళ్ళముందు దృశ్యాలు కదలాడుతున్నాయి.యాక్షన్ థ్రిల్లర్ ..ఎమోషన్స్,నాటకీయత అన్నీ సమపాళ్లలో వుండి చదువరులను ఆకట్టుకునే శైలి.ఎప్పుడూ మూస సినిమాలతో విసుగెత్తించే దర్శకనిర్మాతలు హీరోలు ఇలాంటి విభిన్నమైన థ్రిల్లర్ ను ప్రేక్షకులకు అందిస్తే బావుంటుంది.
విజయార్కె గారు ఎందుకు రోబో నవల మీద క్లారిఫికేషన్ అడిగారో ఈ నవల చదివాక అర్థమైంది.
https://www.youtube.com/watch?v=M88JkxxsGU0

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

i am looking for this book since long time. can i get this by post

మాయావి నవల టైటిల్ చాలా బావుంది.description చదివాక ఈ నవల తప్పకుండా చదవాలనిపించింది. ఈ నవల ను సండే డౌన్ లోడ్ చేసుకుని చదవాలనుకుంటున్నాను.చదివాక ఈ నవల ఎలా వుందో చెబుతాను. అడపా చిరంజీవి గారి నవలలు చాలా బావుంటాయి.ఇదికూడా బాగా ఉంటుందని ఊహిస్తున్నాను.వీరి పులి మీద పుట్ర నవల కూడా చదివాను. చాలా బావుంది.

A very intelligent novel on Indian economy... thrill readers, good storyline and dialogue, lots of action and drama. The author has a great imagination In the world of crime and detective fiction...

ఈ పుస్తకం ద్వారా నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను...నేర్చుకున్నాను.చిన్నచిన్న నిరర్థకమైన అసంతృప్తులను వదిలేసాను.నిర్మాణాత్మకమైన అసంతృప్తిని తెలుసుకోవాలని అనుకునేవారు,జయించాలనుకునేవారు ఈ పుస్తకం చదువవచ్చు.

Subscribe
Browse