Comment(s) ...

ఈ కథలను దంపతులు చదివి తీరవలిసిందే..ఎందుకంటే ఇవి అందమైన కిలికించితాలు,
*ఆ దంపతులకు శోభనం రాత్రి
"ఈ వర్షంలో కరెంటు లేదు. మనం క్యాండిల్ లైట్ శోభనం జరుపుకుందాం..ఓ క్యాండిల్ ని వెలిగిద్దాం...
ఒకరికి తెలియకుండా మరొకరు మార్చిన క్యాండిల్స్ వెనుక వున్న కహానీ .రొమాంటి "హనీ "
*అతనో గొప్ప సైంటిస్ట్ ..భార్యాభర్తల మధ్య రొమాంటిక్ ఫీలింగ్స్ ని కలిగించే ఆపిల్ చెట్టును సృషించాడు..ఆ చెట్టుకు కాసిన రెండే రెండు ఆపిల్స్ లో ఒక ఆపిల్ ఏంచేసాడు?వాట్ నెక్స్ట్?
*ప్రతీ పెళ్లిరోజుకు ఒక విలువైన బహుమతి ఇచ్చే మల్టీ మిలియనీర్ అతను.ఆ పెళ్లి రోజుకు ఆమె ఓ విచిత్రమైన బహుమతిని కోరింది.
*ఆమెకా పందెం విచిత్రంగా,గమ్మత్తుగా అనిపించింది.కాసింత మత్తుగా కూడా అనిపించింది.
*భార్యాభర్తలను ఒకటి చేసే ఆరూ తొమ్మిది...
భావోద్వేగాలను కలిగించే రసరమ్య సరసమైన కథలు

రెండురకాల అసంతృప్తులు వుంటాయని,నిర్మాణాత్మక నిరర్థక అసంతృప్తుల గురించి వివరించిన తీరు బావుంది,
బిన్‌లాడెన్‌లోని అసంతృప్తి అతన్ని పతనావస్థకు చేర్చి విషాదమైన మరణాన్ని అందించింది....
మహాత్ముడిలోని అసంతృప్తి దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టింది.. మహాత్ముడిని చేసింది.
మదర్ థెరీసాలోని అసంతృప్తి లక్షలాది దీనజనులకు దేవతగా మార్చింది.
రైట్ సోదరులు, గ్రాహంబెల్, ఐన్‌స్టీన్... చరిత్రలో విజయాన్ని సాధించిన ప్రతీ ఒక్కరూ నిర్మాణాత్మకమైన అసంతృప్తిని జయించినవారే.
ఓటమిని విశ్లేషించుకోవడం, నిజమైన అసంతృప్తి తెలుసుకోవడం..
నిరర్ధకమైన అసంతృప్తిని వదిలి, నిర్మాణాత్మకమైన అసంతృప్తిని జయించడమే నిజమైన గెలుపు.
విలువైన జీవిత సత్యాలు

కుబేరుడుడి అప్పు ఇవ్వడం అనే కాన్సెప్ట్ అదుర్స్...కుబేరుడు పైసా వసూల్ ఎలా చేసాడన్నది..ఎలా చేయాలో వైభవ్ చెప్పడం అన్నది..పూచీకత్తుగా శ్రీనివాసుడు సాక్షిగా నారదుడు..స్వామివారి సత్రం..కాల్ మనీ కాళీ వ్యవహారం..హాస్యం ఆర్థ్రత ఆలోచన గ్రేట్ ఫాంటసీ...డిఫరెంట్ థ్రిల్లర్ ...
కృత్తిక పాత్ర చాలా బావుంది.ముఖ్యంగా దేవుడిని నమ్మని వైభవ్ కు దేవుడే పూచీకత్తుదారుడు.ఏడుకొండలవాడ వేంకటరమణా..శ్రీనివాసా..నీ లీలలు అమోఘం .

" కడుపుబ్బా నవ్వుకున్నాం " అనే మాటలకు అర్థం తెలిసింది.చదువుతున్నంతసేపూ నవ్వుకుంటూనే వున్నాం.కొత్త కాన్సెప్ట్ ...ముఖ్యంగా బామ్మ ఇంట్లో బార్ ఓపెన్ చేసిన తీరు...అదరహో ...మైండ్ గేమ్ లో ఫన్నీ మూమెంట్స్...చికాగ్గా వున్నప్పుడు ఈ నవల చదివితే చికాకులు బాధలు హాంఫట్ ..జంధ్యాల గారి సినిమా చూస్తున్నట్టు వుంది,

superb ...రెండు గ్రహాలను కలిపే ప్రేమ కథ...కొత్తగా వున్న సైన్స్ థ్రిల్లర్...ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఎవరూ కనిపెట్టలేరన్న థాట్ గ్రేట్. ఆమె కనబడుట లేదు లో ఆసక్తి...క్యూ గ్రహం గురించి తెలుసుకోవడంలో ఇంట్రెస్ట్...అన్నింటినీ కలిపి అందించిన నవల క్యూ...

ఆలోచన రేకెత్తిస్తూ యువతలో శక్తిని నింపి వ్యవస్థను నిలదీస్తూ ప్రతీఒక్కరినీ ఆలోచింపజేసే నవల.

" జీవితం అంటే ఏమిటో .." అసలైన అర్థాన్ని చెబుతూ " మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి " పుస్తకాన్ని ఇప్పటివరకూ చదవలేకపోవడం అంటే నేను జీవితంలో ఎన్ని ఎమోషన్స్ ను మిస్ చేసుకున్నానో అర్థమైంది.ఇది నిజం...
ఈ వాక్యాలు సాక్షిగా...
"నువ్వు మరో ఇరవైనాలుగు గంటల్లోగా చనిపోతావని" దేవుడు చెప్పాడు.
ఆ క్షణం నుంచి అతనిలో అంతర్ఘర్షణ మొదలైంది.ఇప్పటివరకు తాను ఎవరిని బాధపెట్టాడో,ఎవరికీ తను అపకారం చేసాడో వారిని ఆఘమేఘాల మీద పిలిపించాడు.చాలాకాలం తర్వాత భార్యతో కలిసి మార్నింగ్ వాక్ కు వెళ్ళాడు.కలిసి టిఫిన్ చేసాడు.చాలాకాలం తర్వాత భార్యను దగ్గరికి తీసుకున్నాడు ఆ రాత్రి.అప్పుడు భార్య కళ్ళలో కనిపించిన కన్నీటి మెరుపును చూసాడు.
తన గడువుకు కొద్ది క్షణాల ముందు అతను దేవుడిని వేడుకున్నాడు...
"నా తప్పులు సరిదిద్దుకోవడానికి నన్నునేను అర్థం చేసుకోవడానికి మరికొంత ఆయుష్షును ఇవ్వమని...
కానీ అప్పటికే ....
ఇప్పటికైనా చదివాను.మీరు చదివిచూడండి...ప్రివ్యూ చదివాకా అయినా....

తల్లిదండ్రులను నిరాదరించే పిల్లలు ..పిల్లలను అమితంగా ప్రేమించే తల్లిదండ్రులు...వృద్ధాప్యాన్ని ప్రశ్నగా భావించేవాళ్లు...ప్రతీఒక్కరూ చదవవలిసిన నవల నిర్ణయం.ముఖ్యంగా జానకమ్మ వాసంతి పాత్రలు ప్రతీ ఇంట్లో ఉండాలి.

చాలా విలువైన పుస్తకం.సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకూ క్యాన్సర్ బారిన పడుతున్నారు.క్యాన్సర్ కు సంబంధిన విషయాలు మనల్ని ఆపమత్తులను చేస్తాయి.వ్యశక్తివవికాసాన్ని కూడా జోడించి క్యాన్సర్ ను ఎలా జయించాలో చెప్పడం ముదావహం.వైద్యనిపుణుడితో ( డాక్టర్ మోహనవంశీతో ) అందించిన క్యాన్సర్ సమాచారం ప్రతీఒక్కరికీ ఉపయుక్తంగా ఉంటుంది.కేన్సర్ నుంచి దూరంగా ఉండాలనుకునే ప్రతీ ఒక్కరూ ఈ పుస్తకం చదవాలి. డాక్టర్ మోహనవంశీకి,విజయార్కె గారికి అభినందనలు ..ఇలాంటి ప్రయోగాత్మక పుస్తకాన్ని హెల్త్ అవేర్ నెస్ గా అందించినందుకు ధన్యవాదాలు .

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

I want to buy this book, how can I get it.

Respected Sir,
I am interesting to read the book of Kriya Yoga to Arogyam, Atmaznanam.
I am requesting you to please send the above mentioned book to my address,. I will pay the costs whatever it is. My Residential Address is. Vemula Srinivasa Rao,. Door No. 15-1638, Gandhinagar 2nd lane, Srungavarapukota, Vizianagaram District. Andhra Pradesh.

Sir med books excellent

I am learning Kriya Yoga Dhyanam. I am very interesting about to read the above book.

Subscribe
Browse