Comment(s) ...

ఒకవ్యక్తి ఎదుగుదల వెనుక ఎన్నో క్రీనీడలు వెన్నంటి ఉంటాయి.అతని ఎదుగుదలను అడ్డుకోవాలని..చూసారో...యాదృశ్చికమో...పథకం ప్రకారం జరిగిందో ఇప్పటికీ మిస్టరీగానే అనిపిస్తుంది.హీరో సుమన్ ఒకప్పుడు స్టార్ డం అంచులు చూసారు.నేటిభారతం..సితార ,ఇద్దరుకిలాడీలు ,తరంగిణి లాంటి సినిమాలు ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేదు.
తరువాత బావాబావమరిది ,పెద్దింటి అల్లుడు కలెక్టర్ గారి అల్లుడు ...
ఆపై అన్నమయ్య లాంటి సినిమాలు...శివాజీ లాంటి ప్రతినాయక పాత్రలు. విజయవంతమైన చిత్రాల హీరో ,మంచి అందగాడు మంచినటుడు..జైలుగోడల మధ్య గడిపిన జీవితాన్ని ఆంధ్రభూమిలో పాతికేళ్ల క్రితమే చదివునపుడు షాకయ్యాం.ఇప్పుడు మాలీ చదువుతుంటే " ఒక వ్యక్తిత్వవికాస పుస్తకం " లో వుండవలిసిన ఎన్నో అధ్యాయాలు పాఠాలు ఆయన జీవితంలో అనుభవాలుగా మిగిలాయి.అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కున్న మీకు హేట్సాప్ సుమన్ జీ..
సుమన్ జీవితాన్ని బయో పిక్ గా తీయవచ్చు.ఈ పుస్తకాన్ని రాసిన విజయార్కె గారికి .కినిగె కు ధన్యవాదాలు .

పాఠకుల హృదయాల్లో నిలిసిఫిపోయే నవల ...అముక్త మాల్యద పాత్ర అద్భుతం..సాకేత్ పాత్ర పాఠకులను మెస్మరైజ్ చేసి మరోప్రపంచంలోకి తీసుకువెళ్తుంది.స్వామీజీ పాత్ర దొంగబాబాల గుట్టు విప్పుతుంది.
ఈ ఒక్క వాక్యం నవలలోని అంతరార్థాన్ని విప్పి చెబుతుంది.హేట్సాప్ ..
"చూడు మిత్రమా...నా మరణాన్ని చూడు,,,కొద్దీ క్షణాల్లో ఉరికొయ్యకు బిగుసుకుపోయి ప్రాణం కోల్పోయి చట్టబద్ధంగా హత్యచేయబడ్డ నా మృతదేహాన్ని చూడు..."కొద్దీ క్షణాల్లో నల్లటిగుడ్డ అతని మొహం మీద కప్పబడింది.చెక్కతలుపు మీద అతను...లివర్ కదిలింది.ఉరికొయ్యకు అతని దేహం వేలాడింది...
పదేపదే చదవాలనిపించే నవల మరణశాసనం

"ఈ వర్షంలో కరెంటు లేదు. మనం క్యాండిల్ లైట్ శోభనం జరుపుకుందాం..ఓ క్యాండిల్ ని వెలిగిద్దాం... క్యాండిల్ వెలుతురులో ..".అతను చెప్పడం మొదలుపెట్టగానే ఆమె ఒంట్లో వెచ్చని ఆవిర్లు...
ఒకరికి తెలియకుండా మరొకరు మార్చిన క్యాండిల్స్ వెనుక వున్న కహానీ .రొమాంటి "హనీ "ఏమిటి?
*అతనో గొప్ప సైంటిస్ట్ ..భార్యాభర్తల మధ్య రొమాంటిక్ ఫీలింగ్స్ ని కలిగించే ఆపిల్ చెట్టును సృషించాడు..ఆ చెట్టుకు కాసిన రెండే రెండు ఆపిల్స్ లో ఒక ఆపిల్ ఏంచేసాడు?వాట్ నెక్స్ట్?
*ప్రతీ పెళ్లిరోజుకు ఒక విలువైన బహుమతి ఇచ్చే మల్టీ మిలియనీర్ అతను.ఆ పెళ్లి రోజుకు ఆమె ఓ విచిత్రమైన బహుమతిని కోరింది.అతను ఇచ్చేసాడు.ఆ బహుమతి ఏమిటి? ఆమె కోసం అతను ఆ రాత్రంతా ఆ గదిలో ఏం చేసాడు?
ఈ కథలు ఇప్పటికే ఎన్నిసార్లు చదివానో లెక్కేలేదు...స్వాతిలో చదివాను..మళ్ళీ ఇప్పుడు...గ్రేట్...మంచి ఫీల్ వున్న కథలు.

మనసును పట్టి కుదిపేసింది విజేత నవల ..విజేత అనే పదానికి సరియన అర్థాన్ని చెప్పారు.బావమరదళ్ళ ప్రేమ ఇంత బావుంటుందా? సినిమా పరిశ్రమలో ఇన్ని భావోద్వేగాలు ఉంటాయా? ఇన్నిఉత్థాన పతనాలు ఉంటాయా? సిల్క్ స్మిత గారిని గుర్తుకు తెచ్చారు..విషాదాలను ఎమోషన్స్ ను బాలన్స్ చేసారు ...గెలిచిన తరువాత హీరో తీసుకున్న నిర్ణయం హేట్సాప్ ...అక్షరాలతో సన్నివేశాలను చూపించారు. విజయార్కె గారి మరణశాసనం ,నిర్ణయం నవలల తరువాత మరో విభిన్నమైన నవల విజేత ..

ఈ మధ్య చదివిన నవలల్లో బాగా గుర్తుండిపోయిన నవల మేన్ రోబో...ముఖ్యంగా అగ్నిహోత్ర పాత్ర...నవల చదువుతుంటే ఒక అద్భుతప్రపంచంలోకి వెళ్లినట్టు అనిపించింది.షర్మిల పాత్ర కళ్ళకు కట్టినట్టు వుంది...మేన్ రోబో తో ప్రేమలో పడ్డ సన్నివేశాల్లో కళ్ళు చెమర్చాయి .తాను ప్రేమించినవ్యక్తి ఒక మేన్ రోబో అని తెలిసాక డిస్ట్రాయ్ ఛాంబర్ లో వున్నప్పుడు అతని పెదవుల మీద ముద్దు పెట్టుకోవడం.మేన్ రోబో తన ఎమోషన్స్ చూపించడం సూపర్బ్
2002 లో వచ్చిన ఈ నవల చాలా ఆలస్యంగా చదివినందుకు ఫీల్ అవుతున్నాను.ఒక డిటెక్టివ్ నవల ఒక థ్రిల్లర్ ఒక సస్పెన్సు నవల ఇలా అన్ని ఎమోషన్స్ ను అందించిన నవల మేన్ రోబో..ముఖ్యంగా సులోచన పాత్ర.

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

ఒక హాలీవుడ్ సినిమాను చూస్తున్నంత థ్రిల్లింగ్ గా వుంది నవల.నాకు తెలిసి మొదటిసారి వైవిధ్యమైన ద్విపాత్రాభినయానికి ఈ నవలలోని రోబో పాత్ర ప్రేరణ అవుతుంది రచయితా ఊహాశక్తికి మేథాశక్తి కి హేట్సాప్ .
అగ్నిహోత్ర ,మేన్ రోబో రెండుపాత్రలు అద్భుతం.డిస్ట్రాయ్ చాంబర్ లో షర్మిల ఫీలింగ్స్, షర్మిల మేన్ రోబో ను అగ్నిహోత్రగా భావించి ముద్దు పెట్టుకున్న సన్నివేశాలు అత్యద్భుతం.రోబో కాంట్రావర్

ఒక పాపులర్ సినిమా హీరోకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందా? కంటతడి పెట్టించింది.జైలులో అమ్మ గురించి ఆలోచిస్తూ నిద్రలో ఉలిక్కిపడి లేచిన సుమన్ లో తల్లిని గొప్పగా ప్రేమించే కొడుకు కనిపించదు.చాలా విలువైన విషయాలను నుభవాలను తెలియజేసి కొత్త బ్రతుకు పాఠాలను కళ్ళముందు నిలబెట్టిన పుస్తకం.ప్రతీచిన్న విషయానికి నిరాశతో కూరుకుపోయే ప్రతీఒక్కరూ చదువవలసిన పుస్తకం.

జైలుగోడల మధ్య హీరో సుమన్ పుస్తకము చదివాకా నాలో కొంత పాజిటివ్ మార్పు వచ్చింది.." నా సమస్యే చాలా పెద్దది,..నేనే కష్టాలు పడుతున్నాను " అనే భ్రమలో నుంచి బయత్యకు వచ్చా..అంత పెద్ద స్టార్ " సుమన్ గారి నేటిభారతం,తరంగిణి సితార సినిమాలు వచ్చిన సమయంలో నేను చాలా చిన్న...అంత గొప్ప స్టార్ కూడా నిందను భరించాడు.కానీ ఆత్మవిశ్వాసంతో నిర్దోషిగా బయటకువచ్చాడు .ఒక వ్యక్తిత్వవికాస పుస్తకాన్ని ఒక థ్రిల

అద్భుతమైన జానపద నవల" .జ్వాలాముఖి మంత్రాలదీవి " వరుసలో నాకు నచ్చిన నవల మణిద్వీప రహస్యం.చిన్నప్పటి రోజులను బాలమిత్ర చందమామ కథలను ,జేబులో ఇమిడే జానపద నవలల పరిమళాలను గుర్తుకు తెచ్చిన నవల.ఇంత మంచి నవల రాసిన రచయిత్రి శ్రీసుధమయి గారికి ,ఇ బుక్ గా అందించిన కినిగెకు ధన్యవాదాలు

Chala baavundi

Subscribe
Browse