
దెయ్యాలతో దెబ్బలాట అంటే ఇదంతా ఒక నవల అనుకున్నాను. కానీ ఇందులో కాళరాత్రి, మోహిని,కిటికీ ,మౌన సాక్షి ,అతడే హంతకుడు, పట్టించిన పతాకం , చీకటి పడితే ప్రమాదం అనే ఏడు కథలు వున్నాయి.నవలలో మొదట మంచి కథలు పెట్టి రాను రాను అంతగా బాగాలేని కథలు పెడతారన్న ఉద్దేశం తో చివర వున్న చీకటి పడితే ప్రమాదం చదివాను. చాలా బావుంది దీన్ని మొదటి కథగా ఎందుకు పెట్టలేదు అని అనుకున్నాను. చివరన పెట్టిన ఈ కథే ఇంత బావుంది కాబట్టి మిగతా కథలు ఎప్పుడెప్పుడా చదవాలనిపిస్తోంది.చీకటి పడితే ప్రమాదం కథలో విక్రం సి.ఐ.డి. గా గోపన్న పల్లెకు వచ్చిన ఇన్వెస్ట్ గేట్ చేయడం మొదలుకుని చివరివరకు చాలా ఇంట్రెస్టింగా వెళ్తుంది. ఈ కథలో ఇంతకంటే ఎక్కువ రివీల్.
చిరంజీవి గారు! మీ పుస్తకం ఏది కొన్నా ' అయ్యో ఎందుకు కొన్నామా?' అని అనిపించదు.మీ శైలి నాకు బాగా నచ్చుతుంది. కొంతమంది రచయిత లు ఇదే కథని 200 పేజీల నవలగా రాసి పాటకుల మీదికి వదిలేవారు. మీరు ఎప్పుడూ ఆ పనిచేయరు. అందుకే మీ పుస్తకం ఏది కొన్నా ఆహ్లాదంగా చదువుకోవచ్చు.
గాంధీ మనోహర్
ఫిల్మ్ డైరెక్టర్.
అడపా చిరంజీవి గారు రాసే ప్రతి నవల లో ఎత్తుగడ చాలా గొప్పగా వుంటుంది.దాంతో నవలకు మనం ఫెవికోల్ లా అతుక్కుపోయి ఏకబిగిన చదివేటట్టు చేస్తారు. ఆయన రాసే ప్రతి నవలలో తననే ఓ పాఠకుడిగా ఊహించుకుంటూ రాస్తారేమోనని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నవలలో బోరుకొట్టే వర్ణనలు గానీ అనవసరమైన డైలాగులు గానీ ఎక్కడా కనిపించవు.చిరంజీవి గారు రాసిన జానపద నవలలు పులిమీద పుట్ర , కపాల దుర్గం, వజ్రాల దీవి, రవ్వల మేడ లాంటి నవలతోపాటు హారర్ నవల గాలి బంగ్లా కూడా ఎంతో బావుంటుంది. ఇప్పుడు ఈ నిశాచరుడు నవల చదువుతున్నప్పుడు ఓ సస్పెన్స్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. దీన్ని సినిమాగా రూపొందించడానికి అన్ని విధాలా సరిపోతుంది.సినిమా డైరెక్టర్ అయిన నేను ఇలాంటి నవలను సినిమాగా తీయాలని వుంది. నేను ఓ ప్రొడ్యూసర్ కు ఈ నవల చదవమని ఇచ్చాను. ఆయన కు నచ్చి సినిమా చేద్దామంటే త్వరలోనే ఈ నవల సినిమాగా రూపుదిద్దుకుని మీ ముందు వుంటుంది. విష్ మీ ఆల్ ద బెస్ట్!.....గాంధీ మనోహర్.. ఫిల్మ్ డైరెక్టర్.
నేను సినిమా డైరెక్టర్ ని ..పేరు గాంధీ మనోహర్. అడపా చిరంజీవి గారు నవల ఏదైనా ఫిల్మ్ బుల్ గా వుంటాయి. ముఖ్యంగా ఈ దెయ్యాల దిబ్బ వజ్రాల హారం అయితే సినిమా గా నిర్మిస్తే మంచి ఎంటర్ టైన్మెంట్ గా వుంటుంది. నాకు జానపద సినిమా తీసే అవకాశం వస్తే చిరంజీవి గారి అన్ని నవలలని తీయాలని కోరికగావుంది.ఈ నవలలో వజ్రాల హారం మిస్సింగ్.. అది శశికాంతుడు దొంగలించక పోయినా అతడే దొంగలించినట్టు ఎవిడెన్స్ వుండడం అనేది రైటర్ చాలా చక్కగా రాశారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ నవలలో పరకాయ ప్రవేశం నేర్చుకోవడం గురించి ఇందులో అడపా చిరంజీవి గారు చాలా బాగా చెప్పారు. ఎలా అన్నది చదివితే మీకే అర్థమౌతుంది. ఇంతకంటే ఎక్కు చెబితే కథలోని ట్విస్ట్ లు తెల్సిపోతాయి. అందుకే ఇంతడితో ముగిస్తున్నాను. చిరంజీవిగారు మీనుండి ఇలాంటి నవలలు మరిన్ని రావాలని ఆశిస్తున్నాను.
తెలుగులో జానపద నవలలు చాలా అరుదుగా వస్తున్నాయి. అడపా చిరంజీవి గారు ఆ లోటు తీరుస్తున్నారు. ఈ మధ్యే నాలుగు జానపద నవలలు రాశారు..అనీ చక్కగా ఉంటున్నాయి. గతం లో చందమామ పుస్తకం చూడగానే అందులో ఉన్న జానపద కథల్ని ఎంతో ఇష్టంగా చదివేవాళ్ళం. ఇప్పుడు చిరంజీవి గారి జానపద నవల చూడగానే వెంటనే download చేసుకుని చదివేయాలనిపిస్తుంది.....చిరంజీవి గారు!... జిత్తులమారి కొంపదీసి రాకుమారి కాదు గదా? తినబోతూ రుచి అడగడం ఎందుకూ అంటారా?... సర్సరే ఐతే చెప్పకండి.. సస్పెన్స్ పోతుంది.
మాయావి నవల చదవడం పూర్తీ అయింది. దొంగ నోట్ల మీద రాసిన ఈ నవల మన ఆర్ధిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతోందో చాలా చక్కగా చెప్పారు.కవర్ పేజీ మీద ఆస్థి పంజరం బొమ్మ చూసి ఇదేదో దెయ్యాల నవలేమో అనుకున్నా కానీ మంచి థ్రిల్లర్ అని తర్వాత తెలిసింది.చదవడం స్టార్ట్ చేస్తే నవల పూర్తీ అయ్యేవరకు వదిలిపెట్టము. ఏవో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే అంటే సినిమాటిక్ సీన్లు..ఇది సినిమా తీయడానికి అన్ని విధాలా కరెక్ట్ నవల.
మాయావి నవల టైటిల్ చాలా బావుంది.description చదివాక ఈ నవల తప్పకుండా చదవాలనిపించింది. ఈ నవల ను సండే డౌన్ లోడ్ చేసుకుని చదవాలనుకుంటున్నాను.చదివాక ఈ నవల ఎలా వుందో చెబుతాను. అడపా చిరంజీవి గారి నవలలు చాలా బావుంటాయి.ఇదికూడా బాగా ఉంటుందని ఊహిస్తున్నాను.వీరి పులి మీద పుట్ర నవల కూడా చదివాను. చాలా బావుంది.
చిరంజీవి గారు మీరు చింతాకంత నా కార్టున్ ని తీసుకుని అరిటాకంత నవల రాసేశారు. చదివాక రాస్తున్నాను... సింప్లీ సూపర్బ్.. చదువు తున్నంత సేపూ ఓ ద్రిల్లింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. జోగారావు గ్యాంగ్ హీరో సూరిపండు కోసం వెతుకుతున్నప్పుడు జరిగే సన్నివేశాలు కడుపుబ్బా నవించాయి... సూరి పండు పది రూపాయల సమస్య నుండి బయటపడం కోసం లక్ష రూపాయల సనస్యను కొని తెచ్చుకున్నప్పుడు నవ్వొస్తుంది. ఈ నవల చదువుతున్నప్పుడు మనం ఊహించి నట్టు ఉండకుండా ఇన్నోవేటివ్ గా వుండి మనల్ని ఆశ్యర్యపోయేట్టు చేస్తుంది.
నాలాగే ఈ నవల నచ్చిన నిర్మాత దొరకగానే సినిమా రూపంలో మీ ముందుకు వస్తుంది.
ఈ రోజే పులి మీద పుట్ర నవల చదివేశాను. చాలా చాలా బావుంది. నవలలో నచ్చిన పాయింట్స్ రాయాలంటే చాలా రాయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే సింప్లీ సూపర్బ్.చదువుతున్నంత సేపు ఓ జానపద సినిమా చూస్తున్న పీలింగ్ కలిగింది.ఆయన రాసిన మిగతా నవలను కూడా చదవాలని డిసైడ్ చేసుకున్నాను. thank you chirnajivigaru and all the best.
నాకు జానపద నవలలు అన్నా సినిమాలన్నా చాలా ఇష్టం. ఈరోజే ఈ పులిమీద పుట్ర నవల కొన్నాను. ఇప్పుడు బిజీ గా ఉన్నందున రెండు రోజుల్లో చదవడం స్టార్ట్ చేస్తాను. చిరంజీవి గారి జానపద నవలలు అన్నీ చదివేశాను . ఆయన శైలీ నాకు బాగా నచ్చుతుంది. ఆయన నవలలు చదువుతుంటే జానపద సినిమాలు చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. జానపద సినిమాలంటే పెద్ద బడ్జెట్ సినిమాలు.నేను సినిమా డైరెక్టర్ ని ఏదో ఒకరోజు చిరంజీవి గారి జానపద నవలను సినిమాగా తీయాలనుకుంటున్నాను.