Comment(s) ...

1997 లో విజయార్కె గారు రాసిన నిర్ణయం నవల ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది.
వృద్దాప్యం గురించి ..వృద్దుల సమస్యలను వాటికి పరిష్కారాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరించింది.
"గుండెపోటు కాఫీ తాగడం వల్ల రాదు. కొడుకు ప్రేమగా చూసుకోకపోతే వస్తుంది. కోడలు బిడ్డలా ఆలోచించకపోతే వస్తుంది." అత్యద్భుతమైన ఈ ఒక్కవాక్యంలోనే వృద్దుల జీవితం మన కళ్లకు కట్టినట్టు అనిపించింది.
డబ్బు మాత్రమే లోకమై బ్రతికే మనుషులు ఈ నవల చదివి తమ తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నారో ఎవరికి వారు విశ్లేషించుకోగలిగితే వృద్దాశ్రమాలు కనీసం తక్కువ అవుతాయేమో!!

ఇది పరీక్షా సమయం.పరీక్షలంటే పిల్లలకు భయం పెద్దలకు ఆందోళన.ఇలాంటి సమయంలో ఈ పుస్తకం కొంతవరకైనా మీకు ఒక గైడ్ లా ఉపయోగపడుతుంది.
ఈ పుస్తకంలో చెప్పినట్టు ..
" భయంతోనే ఓటమి మొదలవుతుంది
భయాన్ని వదిలేస్తే పరీక్షల్లో గెలుపు మీ స్వంతం అవుతుంది."
" ప్రతీ పాఠాన్ని ఒక కథలా చదవాలి." అన్నది అక్షరసత్యం
పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ పుస్తకం ఉపయోగపడుతుందన్నది నా నమ్మకం.

మాయాశిల్పం మంత్రఖడ్గం అద్భుతమైన జానపదనవల. మనసును కట్టిపడేసే పదప్రయోగజాలంతో మంత్రముగ్దులను చేస్తూ ఆమూలాగ్రం ఆసాంతం విడవకుండా ఏకబిగిన చదివించే నవల. కనుమరుగైన జానపద నవలలకు పూర్వప్రాభవం కలిగించడంలో తొలిస్థానం ఆక్రమించుకుంది మాయాశిల్పం మంత్రఖడ్గం.
ఇలాంటి అపూర్వమైన జానపద నవలలు మరెన్నో విజయార్కె గారి కలం నుండి జాలువారి పాఠకులను జానపదనవలలలో విహరింపచేయాలని కోరుకుంటున్నాను.

Sreevaniprasad గారికి నా తొలి సీరియల్ గుప్పెడంత ఆకాశం చదివి మీ అమూల్యమైన అభిప్రాయం వ్యక్తపరిచినందుకు నా కృతజ్ఞతలు.
నేను రాసిన మొట్టమొదటి నవల ఎంతో ఇష్టపడి మరెంతో కష్టపడి రాసినది!!
రాయడమే ఇష్టమైనదైతే మీరు ఈ నవలను చదివి గుర్తించి మీ విలువైన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం నాకు మరింత ఇష్టంగా ఆనందంగా ఉంది!!
ఈ నవలలోని కథాంశం నా ఆశయం..
నా మనసులో ఉద్భవించి అక్షరాల రూపంలో జాలువారి మీ ముందుకు వచ్చింది!!

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలని అనిపించే నవల.పిల్లలేకాదు పెద్దలచేత కూడా చదివించే నవల.ప్రతీఒక్కరినీ బాల్యంలోకి మణిమేఘన దగ్గరికీ తీసుకువెళ్లే నవల.

నా చిన్నప్పుడు వసంతబాల పిల్లల నవలలు చదివాను.కాశీమజిలీ కథలు ఇష్టంగా చదివేదానిని.చాలాకాలం తరువాత ,
" మాయాశిల్పం.మంత్రఖడ్గం " జానపద నవల చదివాను.నేను చిన్నపిల్లనై పోయాను.ఎంతబావుందో నవల.మా పిల్లలకు నవల చదివి వినిపించాను.
" మాయాశిల్పం మణిమేఘనగా మారింది. చుట్టూ చూసింది. తనకు తానెవరో జ్ఞప్తికి రావడం లేదు.
*నేనెవరిని? మీరెవరు? అని ప్రశ్నించింది. మణిమేఘనగా మారిన మాయాశిల్పం " ఇలాంటి వ

ఈ పుస్తకం నాలోని అసంతృప్తిని నేను గుర్తించేలా చేసింది.నిరర్థకమైన,నిర్మాణాత్మక అసంతృప్తులు అంటే ఏమిటో అర్థమయ్యేలా చేసింది.
" బిన్‌లాడెన్‌లోని అసంతృప్తి అతన్ని పతనావస్థకు చేర్చి విషాదమైన మరణాన్ని అందించింది....
మహాత్ముడిలోని అసంతృప్తి దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టింది.. మహాత్ముడిని చేసింది.
మదర్ థెరీసాలోని అసంతృప్తి లక్షలాది దీనజనులకు దేవతగా మార్చింది.
రై

How downlode this novels pls help me

I want to buy this book, how can I get it.

Subscribe
Browse