"ప్రయాణానికే జీవితం" పుస్తకం గురించి నవ్య వీక్లీ జనవరి 7, 2015 సంచికలో "పుస్తక సమీక్ష" అనే శీర్షిక కింద వచ్చిన వాక్యాలు:
"జీవితమే ప్రయాణంగా భావించే యాత్రికుడు హరిసింఘాని. పూనె నుండి జమ్మూ వరకు నెలరోజుల పాటు 4300 కిలోమీటర్ల దూరం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై ఆయన చేసిన సాహసయాత్ర, మార్గమధ్యంలో మజిలీలు, మనకు తెలియని ఆయన అనుభవాలు, ఎదురైన వ్యక్తులు, శక్తులు, ఆలోచనలూ, పంచేద్రియాలకు అందని అనుభూతులను ఇందులో అనువాదకుడు సరళంగా వివరిస్తారు."
