Comment(s) ...

Dear Sir
i want to buy this book so send message how much cost this book and how to get it and where to get .my mobile .9959137773

Thank u soo much Sridhar garu for your valuable time n expressing cute views about Madhulika..😊

Thank u soo much Raj Reddy garu for taking your precious time n reading my book. N thanx for d wonderful response 😊

“ ఇదిగో నిన్నే అంటూ ప్రేమే ఎదురై వస్తే ఏ పూలు తేవాలి పూజకి “ ఒక సినిమా పాట లో నాగార్జున సిమ్రాన్ ని ఈ ప్రశ్న అడుగుతాడు
అందమైన అమ్మాయి కనబడితే ఎంతో కొంత ప్రేమ భావనలు కలగడం సహజం .కానీ మొత్తం ప్రేమభావనలే అమ్మాయి రూపాన్ని సంతరించుకొని ఎదురుబడితే అప్పుడు కలిగే అద్భుతమైన ఆనందాన్ని ఇంతకన్నా బాగా ఎవరు చెప్పగలరు

వేల కవిత్వాలని హృది లో రగిలించగల ఓ యువతి తనే ఒక ప్రణయకావ్యంగా మారితే ,పరిమళాలు వెదజల్లే ఒక తెల్ల గులాబీ తనే కావ్య సుమ మాలికని అల్లితే ,చిరుకవితల చందనాలు జల్లితే ,చూడాలో చదవాలో తెలియని ఒక పరవశం మనకి కలిగితే ,
ప్రతి అక్షరం పది లక్షల అనుభూతులైతే ,ప్రతి మాటా తీయని మధురోహల వెల్లువై తాకితే ఆకాశాన్ని అంటే ఆనందం మన గుప్పెడు గుండెల్లో ఎలా సర్దుకుంటుంది ?ఇంత ఆనందాన్ని కలిగించిన వ్యక్తికి మాటల్లో అభినందనలు ఎలా చెప్పుకుంటుంది
“ నిన్నూ నన్నూ కలపమని నేల జారే నక్షత్రమేదో కోరుకొని ఉంటుంది “
ఇది త్రివిక్రమ్ రాసింది కాదు .సిరివెన్నెల హృదయంలో చిగురించిన మాటల తొలకరి అంతకన్నా కాదు
ఎద లోతుల్ని స్పృశిస్తూ సాగే ఇలాంటి వాక్యాలు వ్రాయాలంటే కళ్ళకి కలిగే తడిని అర్ధం చేసుకోగల ఒక ప్రేమ మయ హృదయం ఉండాలి ..ఇలాంటి అక్షరాద్భుతాలు ఎన్నో ఒక చోటే వెతుక్కోవాలి
సుమధుర కవితల సమాహారం “మధూలిక” రచయిత్రి శ్రీమతి లక్ష్మీ రాధిక గారికి భాష తెలుసు , శృతి తెలుసు, స్మృతి తెలుసు ,కవిత్వపు అందచందాలు తెలుసు ..మాటలని పొందిక గా అమర్చి మనసులని ఎలా దోచుకోవాలో తెలుసు
వీణాపాణి ,పలుకుల రాణి ఆ సరస్వతిని వశపరచుకొని సుమధుర అక్షర సంగీతాలను పలికించడమూ తెలుసు

“ సరుగుడు చెట్ల సవ్వళ్ళ లా ఆ చూపుల చిలిపిదనాలు “
“కనురెప్పల గమకం ఏ తమకం దగ్గర ముగుస్తుందో “
పైన రెండూ రాధిక గారి కవితల్లో నాకు బాగా నచ్చిన కొన్ని ఆణిముత్యాలు
మెడలో వేసుకున్న ముచ్చటైన నగ ఎంత ఆనందాన్ని ఇస్తుందో ,మదిని దోచుకునే మాటలు కూడా అంతే ఆనందాన్ని ఇస్తాయి .ప్రేమ తెలియని వాళ్ళని ప్రేమ లో పడేయడం ,విరహం ఎరుగని వాళ్ళని తాపం తో రగిలించడం రాధిక గారికి వెన్న తో పెటిన విద్య
ఒక కవితలో తను “ మనసుకి చలేస్తుందని తెలిసే వీలుందా నీకిప్పటికైనా” అని అడుగుతారు
రాధిక గారూ ఈ అనన్య సామాన్య కవితారూపకల్పనకీ ,ఈ అక్షర శిల్పానికీ , ఈ సృజనాత్మక ప్రేమ భావనలకీ ఈ అందమైన ఊహలకీ నమస్సుమాంజలి
ఘనీభవించే చలినీ , తాపంతో రగిలించే వేడినీ మూడక్షరాలతో సృష్టించగలరు
మీరు నిస్సందేహంగా ప్రణయ కవితా శారద ,సువిమల విద్యా విశారద

ఈ కావ్య కళా నైపుణ్యానికి ఏ కోహినూర్ వజ్రాన్ని బహుమతిగా ఇస్తే బాగుంటుందో నాకు తెలియదు .మీ గురించి వ్రాయడానికి ఎంత సమయమూ చాలదు
ముఖ పుస్తకపు ప్రపంచం లో మాలిన్యం తెలియని అక్షర సౌందర్యం మీరు ,విరహ వేదం మీరు ,ప్రణయ నాదం మీరు

ఇంకొక కవితలో మీరు “ విరహమవుతున్నా వానొచ్చిన ప్రతి సారీ “ అంటారు .మీ సంగతి తెలియదు కానీ మీ కవిత చదివిన ప్రతి సారీ నేను ప్రేమనై పోతుంటాను

" కొత్తగా రెక్కలోచ్చెనా" అని స్వర్ణ కమలం సినిమా లో వెంకటేష్ భానుప్రియని అడుగుతాడు

కళ ని ఆస్వాదించడం మొదలు పెట్టినప్పుడు కలిగే ఆనందానుభూతి అది

మీ కవితలు చదువుతున్నప్పుడుమనసుకి రెక్కలు వచ్చిన అనుభూతి .ప్రేమ భావాలను మోసుకుంటూ వినీల ప్రేమాకాశం లో అది విహరిస్తుంది

గుప్పెడు గుండె మీ ప్రేమ కవితలని మోసుకొని ఒక గువ్వై మీ చుట్టూతే తిరుగుతుంటుంది . దాన్ని తడితే అది పలికేది మీ కవితే

ఈ తమకం మీరు మాకు "మధూలిక" రూపం లో ఇచ్చిన అందమైన కానుక

అభినందనలతో

శ్రీధర్

Baavundi andi.mee Katha chaduvutunte Naaku chinnappudu chaduvukunna chandamama pustakam lo Katha la ga mee Parthian jnaapakam oka drusyam la na kalla Mundu medilinattundi

సృష్టిలోని ప్రాణికోటికి, ఆరు ఋతువులూ ఎంతో అపురూపం.!
మరి ఆ ఋతువులకేది అపురూపం.?

ఒక్కో ఋతువు, ఒక్కో రకపు అపూర్వమైన అనుభూతిని మన కోసం మోసుకొచ్చి.. పరిమితుల్లేని ప్రేమతో.. ప్రకృతిలో చుట్టి అందిస్తుంటే పరవశంతో మన మనసులు రాజితమవడం.. ఋతువులకు అపురూపం.!

ప్రాణులకూ, ప్రకృతికీ మధ్య.. ఇదో పరస్పరాధారిత ఉద్దీపనం.!

అలా.. ఓ ఋతువులా.. తన మనసులోని భావాల్ని తానే అనుభవించినంత స్వభావసిద్ధంగానూ, స్వచ్ఛంగానూ.. అనుభూతి పరిమళాన్ని ఏ మాత్రం జారిపోనివ్వకుండా అందమైన పదాల్లోకి పట్టి.. మన మనసుల్లోకి నేరుగా, ధారగా ఒంపాలంటే.. ఒట్టి పదవిన్యాసమొక్కటే తెలిస్తే చాలదు.. అందుకు.. ఓ అనునిత్య.. చలితచలన, జ్వలితజ్వలన కవి హృదయం కావాలి.! పాఠకులకూ, కవులకూ మధ్యన.. అలాంటి ఓ పరస్పరాధారిత ఉద్దీపన కలిగించగలిగి తీరాలి.!

కవిత్వానికో రూపమున్నంత అపురూపంగా ఉండే, ఆ ఏడో ఋతువు పేరు - లక్ష్మీ రాధిక.. ఆ ఉద్దీపన పేరు.. వారు రాసిన - "మధూలిక".!

"మధూలిక" చదువుతున్నంత సేపు, చుట్టూ ఉన్న ప్రకృతిని కూడా మరచిపోయి ఓ అలౌకిక ప్రపంచంలో మన మనసు.. డోలాయమాన స్థితిలో ఓలలాడినప్పుడు.. ఆ ఏడో ఋతువు, మనో చక్షువులకు అతి సమీపంగా.. అత్యద్భుతంగా.. గోచరిస్తుంది.!

కాల విభజన కోసం పుట్టిన ఋతువు కాదది.!

నిజానికి.. సమయాన్ని మనకు తెలిపేవన్నీ కృతకాలో, ప్రాకృతికాలో అవుతాయి.! మనలను, క్షణాల ఎరుకనుండి అలవోకగా దాటించి, అలౌకికానికి ఆవలివైపునున్న అద్భుతాలను.. మన పంచేంద్రియాలకే కాక, హృదయంలో మరిన్ని ప్రత్యేకమైన స్పందన స్థానాలను పుట్టించి మరీ పరిచయం చేసే క్రతువు.. ఆమె కవిత్వం.!

చదువుతుంటే అక్షరాలు ఎవరికైనా అర్థమవుతాయి; అలా అర్థమైంది, కొందరికి అనుభూతిగా మారే అవకాశమూ ఉంది; కానీ ఆ అనుభూతులు మనసు పొరల్లో నిక్షిప్తమైపోయి.. జీవితకాలపు సుగంధంలా ఇక లోలోనే అట్టే అంటిపెట్టుకుని ఉండిపోయి.. నిత్యం హృద్యంగా, రమ్యంగా స్పృశిస్తూ ఉంటే మాత్రం.. అవి ఒట్టి అక్షరాలు కావు; రాసిన వారికి, చదివినవారికి.. అవి అనుభవైకవేద్యాలు.. అంతర్లోక ప్రయాణాలు.!

అతి సున్నితమైన, భావోద్వేగపూరితమైన.. తన మనసు కేంద్రంగా.. అనుభూతి ప్రధానంగా.. తాను అక్షరబద్ధం చేసుకున్న భావ సంచలనాలను క్రమం తప్పకుండా ఫేస్ బుక్ లోనూ, తన బ్లాగు లోనూ రాస్తూ పదుగురితో పంచుకోవడమే కాకుండా.. ఓ చక్కనైన కవితా సంకలనంగా చేసి.. ఇలా సరికొత్త ఋతువు (పుస్తక) రూపంలో పరిచయం చేయాలనే సంకల్పం రాధిక గారిదే అయినా, ఈ ప్రయత్నంలో వారికి సహకరించిన సకల శక్తులకు, వ్యక్తులకు కూడా ప్రణామాలు, అభినందనలు.

ఆసాంతం సాహిత్య విలువలతో, మనసుకు హత్తుకునే వర్ణనలతో, అపురూపమైన విషయ వ్యక్తీకరణలో అడుగడుగునా అరుదైన ప్రకృతిని పరిచయం చేస్తూ, మనసు పలికే భావరాగతాళ సమ్మేళనాలను అనుభూతి పరంగా అర్థమయ్యేలా మాటల్లో తెలపడానికి భాష ఒక్కటే చాలదని తెలిపే భాషలో రచించబడిన "మధూలిక".. నిజంగా సార్థక నామధేయ.! రాసిన లక్ష్మీ రాధిక గారు, సరస్వతీ తనయ.! 🙏

"మధూలిక" - నిజంగా పుస్తక రూపంలో ఉన్న ఏడో ఋతువు.!

వీలు చూసుకుని, మీరూ చదవండి!

రాజ్

Hi khadeer Garu.... please add your poleramma banda kathalu....

The description is from own experiences and is well articulated.

Hai sir ,
Na dhaggara oka story undhi please okkasari vintara
Eppudu adavalla paina jarugutunna arachakalanu oka story ga cheshanu ...
Adi punishment cheyyali yem cheste agutundhi anedhi na katha sir

Yevariki cheppalo yekkada kalavalo teliyadhu andhuke ela try cheshanu

My details

Srikanth Akena
8485023503
aken.srikanth@gmail.com
Languages: Telugu Hindi

Ramani Veni garu..Many thanx for the Lovely Review on my book. Thanx for downloading it n reading every poem and I'm feeling the joy of your expression in every poem your explained. Thanx a Ton for such a Wonderful response.

Regards
Laxmi Radhika

congratulations!! Very happy to see this here!!

కినిగెలో ప్రచురితమైన 'మధూలిక' చదువుతుంటే నాలుగు మాటలు రాయాలనిపించింది. మధూలిక' గురుంచి మాట్లాడేముందు కవిత్వంపై జగమెరిగిన కొన్ని యదార్ధాలు ..కొన్ని సేకరించినవి కొన్ని అనుభవాన్ని రంగరించి రాసినవి ...

సాధారణ వాక్యానికి భిన్నంగా మనసు రంజింప జేస్తూ ఆలోచన రేకెత్తించే సృజనాత్మక సాహితీ ప్రక్రియ "కవిత్వం". రసభావాలు కవి ఆలోచనాలోకం నుండి ప్రవహించేవి. ఇవి అలవోకగా ఒక ప్రవాహంలా కవిలో పొంగి పొర్లుతాయి. భావావేశం ఉప్పొంగిన వేళ పదాల పొందిక ఎంతో అవసరం, భాష మీద పట్టు అంశం మీద అవగాహన లేకుండా ఇది సాద్య పడదు మరియు ఆలోచన విధానాన్ని సరళీకృతం చేసి పాఠకులకు చేరేలా శ్రమించేలా చేస్తుంది. ఎందుకంటే భావకులే తొలి పాఠకులు self - satisfaction ముఖ్యం.

“ Poetry is the spontaneous overflow of powerful feelings”… కవియిత్రి లక్ష్మీ రాధిక గారి భావుకతలో, అలోచనలో నిత్యనూతనత్వమైన ప్రతిభ ఉంది, ఇది నవనవోన్మేషము.. అనగా నిత్య నూతన వికాసము మదిలో మెదలాడే ప్రకాశం .. Spontaneity , సృజనాత్మకత , అక్షర తాండవం, పదాల పొందిక, మరియు లాలిత్యం ఆమె కవిత్వంలో కనిపిస్తుంది.

***ఇక మధూలిక గురుంచి
పక్కింటి అమ్మాయి పేరులా సాంప్రదాయకంగా ఉంది 'మధూలిక' శీర్షిక, ఆకాశంలో చందమామ, వెన్నల తాగి స్వచ్ఛమైన తెలుపులో మెరిసిపోతున్న పుష్పంతో భూమి ఆకాశాలు ఏకమైనట్లుగా ఆకర్షణీయంగా ఉంది ముఖచిత్రం. ఇక మధూలిక అనగా పుప్పొడి ఇది ఓ.. 'ప్రకృతి పరాగం' అనగా ఇట్ ఐస్ స్ట్రీమ్ అఫ్ హనీ. పేరుకు తగ్గట్లుగా ఆస్వాదనలో తియ్యగా, అక్కట్టుకునేలా సుమ'మధురంగా ఉందనేకంటే.. ఇదోక ఉద్యానవనంలా ఉంది అనటం సమంజసం.

సంవత్సరము అనేది ఒక కాలమానము. భూమి సూర్యుని చుట్టూ తిరిగే భ్రమణ క్రమంలో ఒక స్థానానికి భూమి తిరిగి రావడానికి పట్టే 12 నెలల కాలాన్ని (సమయాన్ని) సంవత్సరం అంటారు. అలానే మధూలిక పన్నెండు చాఫ్టర్లులతో వెలుగుల విరాజిల్లే కాంతి సుమం. ఉదయమో సాయత్రమో మనం ఉద్యానవనంలో వెళుతూ ఉంటె సంత్సర పొడుగునా ఎదో సుమం కొత్తగా పలకరిస్తూ ఉంటుంది అలానే ఇందులోని ఒక్కక విభాగం విభిన్నాన్ని కుసుమిస్తూ పాఠకుల ఎమోషన్'ని టచ్ చేస్తుంది, ఈ మధూలిక సుమవనం 'నేను' అంటూ మొదలై ప్రేమలో మునిగేలా చేస్తుంది.

***

1. నేను -- ఇదో పరిచయ వాక్యం

// నేను
నన్నో సుస్వరముగా ఆలకించడం ఎవరికి తెలుసు..
నన్నో ప్రబంధం చేసి చదవొచ్చని ఎందరికి తెలుసు..

రసాత్మకమైన ఈ రెండు వాక్యాలు చాలు ఇదో ప్రబంధమని ... తొలిపలుకులోని మాధుర్యాన్ని తెలపటానికి ..
**
2. వర్షం - ఇదో పులకింత, అక్షరాలా పలకరింత, భావాల జడివాన, తడిస్తే తమకం అనిపిస్తుంది.

// అందరూ వాన కురిసిందని ఎందుకంటున్నారో
నాకైతే అమృతం కురిసిన రేయిగా అనిపిస్తుంటే ...

// అవును..నీవల్లే..
వర్షమంటే గుబులై మండిపడే నాకు
ప్రేమతుంపర్ల ప్రియమైన సౌరభాలీనాడు..
రసఝరి మడుగులో మునిగినట్లుందీ అనుభవం .
మళ్ళీ మళ్ళీ వానొస్తే మొలకెత్తాలనే మరో జీవితం..

వానోస్తే మళ్ళీ మళ్ళీ మొలకెత్తాలనే మరో జీవితం ..ఎంత అద్భుతమైన భావన .. నిజంగానే అమృతం కురిసిన రేయి అనిస్తుంది కదూ...!

3 మౌనం -- ఇదో అచేతన స్థితి, ఎన్నో ఆలోచనలు సమరం చేస్తాయి ..అందుకే ఇష్టమైన వారి మౌనాన్ని చదివాగైలితే వారి జీవితంలో ఇబ్బందలంటూ ఉండవు ...

// మౌన పల్లవి..
ఒక మౌనం చినుకై రాలింది
నీ నిశ్శబ్దాన్ని తడమాలని..
ఒక చమరింపు నీకందించాలని
నీ స్మృతులలో నా రూపం అస్పష్టమైనా
తిరిగి స్వచ్ఛమయ్యేందుకు సహకరించాలని

ఒక మౌనం నవ్వింది
నీ హృదయానికి సౌరభమివ్వాలని
అపుడైనా అనుభూతి పారిజాతాన్ని గుర్తిస్తావని
నీ జ్ఞాపకాలలో నేను జీవించే ఉన్నానని చెప్పాలని

ఈ వాక్యాలు ఎన్ని ఆలోచనలు రేకెత్తిస్తాయో ...మౌనాన్ని తర్జుమా చేసే ప్రతి అక్షరం ..ప్రేమని విస్ఫోటించాలి ఆ నిశబ్దాన్ని బద్దలు చేయాలి అని చాటి చెపుతుంది ..
***
4 సంగీతం ... మమేకమైతే ఎలాంటి బాధనైనా మరిపించేది సంగీతం

// ప్రతి ఉదయం..సాయంత్రం అదే ప్రకృతి..నీలా.. నాలా..
నీ ఊసులో నాలా..
నా ఊహలో నీలా..
నీ సమక్షంలో గడపడమేగా నాకిష్టం

సంగీతాన్ని వెలువరించే సంధ్యారాగం
సుధా మధువులెన్నో ఒంపేవేళ
నా తోడుగా నీవుంటేనే నాకిష్టం

ఈ విభాగంలో కవితలలో ఆరాధన కనిపిస్తుంది ..ప్రకృతిలో ప్రతి కదిలిక సందడి చేస్తుంది ప్రియ స్వరమై వినిపిస్తుంది

***
5 కవిత్వం
// నీ తలపును లొంగదీసుకున్న క్షణాల కేరింత
ఎన్ని వర్షపు చినుకులు రాల్చుకుందో మేనంతా
దూరమవుతావని దిగులులేని పొదరింట
మనసంతా కవిత్వం చేసుకొని నిద్రించాలనుందీ వేళ..

// ఇప్పుడీ నొప్పికో మందు కావాలి
ముసురేసిన తలపులో కవిత్వమన్నా కురవాలి.. పెయిన్ కిల్లర్ గా బాధని మరిపిస్తుంది, కల్పనగా నిశబ్దాన్ని పూరిస్తుంది, క్షణాలే సాక్షిగా మనమేకమయ్యామని, అభిసారికనై ఎదురు చూశానని అందులోని ఉత్కంఠను కవితాక్షరాల ద్వారా కళ్ళకు కట్టినట్లు అనుభూతించేలా చేసింది

***
6 కాలం ... గతానికి భవిష్యత్ కి మధ్య సాగుతున్న వర్తమానానికి అందంగా అభివర్ణిస్తుంది ..
కాలం రెక్కలు విప్పుకొని తానే ఓ కూజితమై కూసినప్పుడు
గ్రీష్మంలో వసంతగీతాన్ని ఆలపిస్తానంటూ..
అమరగీతమైన నాలో ఆనందమొకటి..
గగనమెగిసింది అనురాగ సల్లాపమై..!
గత స్మృతుల దాటి వచ్చిన వర్తమానంలో ...శీతలోదయంలో అనుభవానికొచ్చిన ఆ గోరువెచ్చనిదనం మాహా సుఖం అంటూ కవ్విస్తూ, మనో ఉల్లాసంలో మునిగేలా చేస్తుంది ...

***
7 నయనం ... 'మాటే రాణి చిన్న దాని కళ్ళు పలికే ఊసులు' ఎంత మధురమైన పాట ..కొన్ని మాటలతో చెప్పలేని ఎక్స్ప్రెషన్ ద్వారా బాగా తెలియ చేయొచ్చు ... చూపులు ఎన్ని వేల భావాలను తెలుపుతాయో ,, నయనం విభాగంలో మరింత అందంగా అభివర్ణిస్తుంది.

//ఎందుకలా నీ కళ్ళు..
కౌగిలి చాచి రమ్మన్నట్టు ఆ రెప్పలు
పూర్తిగా చూడకుండానే
తొలిచూపుల కలవరం రేగి గుండెల్లో చిత్రమైన నిశ్శబ్దం

// నా హృదయం చూసేది నీ చూపు..
వేలపున్నముల వెలుగు సమానమది నాకు
నువ్వొస్తావన్న ఆశనసలే దూరం చేయకు
కొన్ని యుగాలైనా వేచి ఉండాలనుందిలా నీకొరకు.. ఎంత అద్భుతంగా వర్ణించింది ....ప్రణయ ప్రహేళికగా పలకరించినా ..కలువ కన్నులవేనా అంటూ ప్రశ్నించుకున్నా వర్ణ శోభితంగా ..మనోహరంగా ఉందొ అంతే రమణీయంగా 7 నయనం , 8 జీవితం, 9 విషాదం, 10 జ్ఞాపకం chapters ఉన్నాయి.

****
11 విరహం ...విరహం ఎంత తియ్యనిదో ..ప్రతి అక్షరం తెలుపుతుంది ...ప్రతి పదం ఓంపుతుంది
// స్మృతుల నుండీ తేరుకోలేదింకా..
ఎడబాటు అసత్యమైతే బాగుండేమోనని..
నాలోని విరహాన్ని కాలమాగి చూస్తుంది నిజమే..
నీ ప్రతిస్పందనలోని ఆంతర్యానికని.. ఉహావేశంలో ఉరించినా, వెదికినా చూపులను తెలిపినా, కలల భావమంటూ కలవరించినా ఆమె రచనా శైలిలో మరింత మధురంగా ఉంటుంది .... అందుకే విరహంలో తడిసిన ప్రతి అక్షరం తియ్యగా అనిపిస్తుంది ...

***
12 ప్రేమమ్.. ఈ జగత్తు అంతా ప్రేమ మయం అది లేనిదీ బంధమేది లేదు ...అభిమానంతో కలిగే స్పందనే ప్రేమ...ఇంతగా కట్టిపడేసే ప్రేమ నిండు జీవితం ఉండాలని ..ఇంతే ప్రేమను కురిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు ..

// అలౌకికమైనదే ప్రేమంటే..
లోకానికి దూరంగా తీసుకుపోతూ..
నిర్వచనానికి అందని ఏకైక పదమనుకుంటా ప్రేమంటే.. ఈ నిర్వచనంలోనే ఉన్నది నిండైన ప్రేమ..

// అసంపూర్ణంగానే వదిలేసారందుకే కవులంతా దాని అంతు తేల్చలేకే..
నవరసాలు సైతం వెనుదిరిగాయి ప్రేమను తమలో కలుపుకోలేక..
వర్ణనకేమాత్రం అందనిదే ప్రేమభావమేమో..
అనుభవేద్యమైతే తప్ప రాయలేని మధురకావ్యమేనేమో ప్రేమ..
మనసంతా నిండిన చాలు విశ్వమంతా వివిధరంగులై శోభిల్లు..
పెదవులను సైతం తోసిరాజని కన్నుల్లో స్వచ్ఛమై వెలుగు..
ఏ పాత్రలో పోసినా తానై ఒదిగిపోతూ విభిన్నమైనదే ప్రేమ..
మానవాళికి దొరికిన అపురూప వరమే నిండుకుండంటి ప్రేమ..
తొలిపొద్దు సింధూరపు కిరణాలకెంత ప్రేమో..
మంచుతెరలను..కొబ్బరాకు సందులను చీల్చుకు పుడమిని తాకాలని.. ఎంత గొప్పగా ఉన్నాయి ఈ కవితా మాలలు. ప్రేమలోని విశిష్టతను అందులోని లాలిత్యాన్ని, నిగూఢతలోని ఆంతర్యాన్ని తెలుపుతుంది ... "తొలిపొద్దు సింధూరపు కిరణాలకెంత ప్రేమో..
మంచుతెరలను..కొబ్బరాకు సందులను చీల్చుకు పుడమిని తాకాలని.'' ఎంత అద్భుతమైన భావన ప్రకృతి చర్యలలో ప్రేమను ...బంధాలలో అభిమానంతో నిండిన ప్రేమకు కొలమానం అంటూ లేదు ..ఎన్ని అక్షరాలూ వెచ్చించినా పరిపూర్ణంగా తెలుపలేము అనంతమైన ఆ ప్రేమను ...

కవితా సంకలనం ఎంత అద్భుతంగా ఉందొ , పరిణితి చెందిన ఆమె శైలిలో ప్రతి ఒక్క భావం ఒక సుమహారం.. ...ఏరికోరి మాలకట్టిన ముత్యాల హారం ..గతమైనా ..వర్తమానమైనా భవిష్యత్తులో అదొక తీపి జ్ఞాపకం.. ఈ సంకలనం చదివాక ...ఒకటనిపిస్తుంది ... కవి జీవితంలో కవితా ప్రక్రియ తీరని దాహం, తీయని వేదన, అనుభవాల మేళవింపు, ఆనందాల రంగరింపు, అందమైన స్వప్నాల కూర్పు, అలరించేవేళ మోహనరవళి, ఆదమరిచేవేళ శ్రావ్యమైన సంగీత విభావరి మరియు కలత చెందినవేళ అదొక నిట్టూర్పు...

భావయుక్తమైన రసమయ రచనలు సంకలనాలుగా మరెన్నో వచ్చి అంతర్జాల మాధ్యమంలో అలరించాలని కోరుకుంటూ

- రమణి వేణి

We are unable to down load e book
please help on this

కథల్లో జీవితాన్ని,అక్షరాల్లో దాంపత్యజీవితానికి అర్థాన్ని చెప్పిన అద్భుతమైన రొమాంటిక్ స్టోరీస్..ఫరెవర్ ఇందులో చాలాకథలు స్వాతి సపరివారపత్రికల్లో చదివినవి,అయినా మళ్ళీ మళ్ళీ అప్పుడు మిస్సయిన కథలు ఇప్పుడు చదువుతుంటే ఎమోషనల్ గా వుంది.ఇలాంటి పార్టనర్ దొరికితే ఎంత బావుండు అనిపిస్తుంది.అందమైన భావుకత్వం అంతకన్నా అందమైన రోమాంచితమైన కథనం.హేట్సాప్ గుడ్ నైట్ స్టోరీస్

Thankyou Kinige.. I would like to share on whatsapp please provide that. So that my friends also know about you and read books what they want. Thankyou so much..

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

Dear Sir
i want to buy this book so send message how much cost this book and how to get it and where to get .my mobile .9959137773

Thank u soo much Sridhar garu for your valuable time n expressing cute views about Madhulika..😊

Thank u soo much Raj Reddy garu for taking your precious time n reading my book. N thanx for d wonderful response 😊

“ ఇదిగో నిన్నే అంటూ ప్రేమే ఎదురై వస్తే ఏ పూలు తేవాలి పూజకి “ ఒక సినిమా పాట లో నాగార్జున సిమ్రాన్ ని ఈ ప్రశ్న అడుగుతాడు
అందమైన అమ్మాయి కనబడితే ఎంతో కొంత ప్రేమ భావనలు కలగడం సహజం .కానీ మొత్తం ప్రేమభావనలే అమ్మాయి రూపాన్ని సంతరించుకొని ఎదురుబడితే అప్పుడు కలిగే అద్భుతమైన ఆనందాన్ని ఇంతకన్నా బాగా ఎవరు చెప్పగలరు

వేల కవిత్వాలని హృది లో రగిలించగల ఓ యువతి తనే ఒక ప్రణయకావ్యంగా మారి

Subscribe
Browse