• Maya Kankanam Mantrala Mani
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 99
    110
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మాయా కంకణం - మంత్రాల మణి

    Maya Kankanam Mantrala Mani

    Author:

    Pages: 190
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 5 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 3 premium votes.
Description

చెన్న కేశవస్వామికి సాయం సమయంలో దీపాలు వెలిగించి, సాయంకాల నైవేద్యాన్ని సమర్పించి, భక్తులు ఎవరూ లేకపోవటంతో గుడి మంటపంలో స్థంభానికి ఆనుకుని కళ్ళు మూసుకొని విశ్రాంతిగా కూర్చున్నాడు కేశవాచార్యులు.

మధ్యాహ్నం భోజనం చేయాలనిపించలేదు. అందుకే ఇంటికి వెళ్లకుండా దేవాలయంలోనే కూర్చుని ధ్యానముద్రలో మునిగిపోయాడు. ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు వినిపించి మెల్లగా కళ్ళు తెరిచాడు.

"మన ముకుందుడు గురించి తెలుసుకోవాలని ఆతృతగా ఉంది....." రాగానే సూటిగా విషయంలోకి వచ్చాడు నరసింహ.

"వాడిని దూరంగా పంపించాలని ఆలోచన తమరికి ఎందుకు వచ్చిందో తెలుసుకోవచ్చా?" తలవంచుకుని తిరిగి తనే ప్రశ్నించాడు.

"ముకుందుడికి మొన్ననే పదునెనిమిది వయస్సు వచ్చింది కదా నరసింహా..." ప్రసాదాన్ని విస్తరాకులో పెట్టి నరసింహుడికి అందచేస్తూ అడిగాడు కేశవాచార్యులు.

ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని నోట్లో వేసుకుని అవును అన్నట్లుగా తలపంకించాడు నరసింహ.

"ఇకనుండి వాడి జాతకం మారబోతుంది. కారణజన్ముడయ్యా వాడు..." నింపాదిగా అన్నాడు కేశవయ్య.

"అయినంత మాత్రాన ఇక్కడ నుండి పంపించాల్సిన అవసరం ఏముందో నాకు అర్ధం కావడంలేదు స్వామీ... ఆకలి వేసినా అడగడం చేతకానంత అమాయకుడు వాడు ... " మాటలని ఆపాడు నరసింహుడు.

"తప్పదు... నీకు అన్ని విషయాలు సమయం వచ్చినప్పుడు వివరంగా చెపుతాను. మనం మళ్ళీ ఈ విషయం గురించి చర్చించడం ముకుందుడికి క్షేమకరం కాదు." చెప్పాల్సింది ఏమిలేదన్నట్టు అంగవస్త్రాన్ని క్రింద పరిచి నడుంవాల్చి విశ్రాంతిగా కళ్ళు మూస్తూ అన్నాడు.

ఏమైనా మాట్లాడతాడేమోనని రెండు నిముషాలు ఎదురుచూశాడు నరసింహుడు. కేశవయ్యకి ఆ ఉద్దేశ్యం లేకపోవటంతో నిరాశగా వెనుతిరిగాడు.

"ఒక్క విషయం, వాడు ఏమైనా కష్టాలు పడుతున్నాడేమోనని దిగులుగా ఉంటే వెంటనే ఆ దిగులును దూరం చేసుకో... నువ్వు సంతోషపడే విధంగానే వాడి జీవితం సాగుతుంది. వెళ్ళిరా..." ఎవరో భక్తులు రావడంతో మెల్లగా లేస్తూ శుభవార్తవంటిది చెప్పాడు కేశవాచార్యులు.

అన్యమనస్కుడిగా ఉన్న నరసింహుడు తేలికపడిన మనస్సుతో అక్కడినుండి కదిలాడు.

Preview download free pdf of this Telugu book is available at Maya Kankanam Mantrala Mani
Comment(s) ...

కథ చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో నేను చదివిన నవలల్లో ఇది చాలా మంచి జానపద నవల. రచయిత పాత్రలను చాలా బాగా డిజైన్ చేసారు. Excellent Novel !!!! :-)

చక్కని జానపద నవల. మంచి కధనంతో, బలమైన కథతో ఆసాంతం ఆసక్తి రేకిత్తించింది. రచయిత శైలి కూడా చాల బాగుంది.

కధ కధనం రెండూ బాగున్నాయి. కొత్త రచయిత అయినా బాగా వ్రాసారు. మంచి రచన.

కామెంట్స్ చేసిన అందరికి కృతజ్ఞతలు. Good encouragement for me... 😊