• Adhyatmikam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ఆధ్యాత్మికం (free)

    Adhyatmikam - free

    Pages: 306
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భారతదేశం, భక్తి అనేవి అవిభక్త కవలలు. భక్తి ఒక పవిత్రమైన భావన. ఆధ్యాత్మికత అంతులేని విశ్వాసాన్నిస్తుంది. హిందుత్వ అనేది ఒక జీవన విధానం. మన హైందవజాతికి ఆధ్యాత్మిక పురాణాలే పట్టుకొమ్మలు. మన పూర్వీకులు రచించిన ఎన్నో భక్తి గ్రంథాలు నేటి మనజీవనానికి ఆలంబనయ్యాయి. మనలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ప్రశాంతత, ఏకాగ్రతను పెంపొందిస్తున్నాయి. ఆధ్యాత్మికవేత్తలు ఆ భక్తితత్వాన్ని విశ్లేషించి సరళరీతిలో నేడు మనకు ఆధ్యాత్మిక బోధన చేస్తున్నారు. సాంకేతిక అభివృద్ధి వీటన్నంటిని వేగవంతంగా ప్రజలకు అందుబాటులోకి తెస్తోంది. భక్తి మన మనసుకు స్వాంతన చేకూరుస్తుందనుటలో ఎటువంటి సందేహం లేదు. ఎంతటి విచారంలోనైనా భగవతారాధన ఉపశమనం కలిగిస్తుంది. మనదేశం నిత్యం పండుగ వాతావరణం తలపించడానికి ముఖ్య కారణం దైవారాధన, ఆలయాల సందర్శన, సత్సంగ సమావేశాలు మొదలైనవి. అనునిత్యం ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మానవాళి ఆధ్యాత్మిక అనుచింతనలో సేదతీరుతున్నారు.

మన అదృష్టం కొద్దీ నేడు ఎన్నో సామాజిక మాధ్యమాలు అవతరించాయి. వాట్సప్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇలా ఎన్నో సాంకేతిక ఉపకరణాలు ప్రజలను దగ్గరకు చేర్చాయి. ఈ మాధ్యమాల ద్వారా ఎన్నో భక్తివిశేషాలు ప్రజలు తెలుసుకుంటున్నారు. ఇలా వివిధ మార్గాల ద్వారా అందుబాటులోకి వస్తున్న అనేక ఆధ్యాత్మిక భావాల్ని ఈ పుస్తకం ద్వారా మీ ముందుకు తెస్తున్నాను. ఒకే అంశంపై అనేక రచనలు వున్నప్పటికీ విశ్లేషణ వేరుగా వుండటంవలన అన్నీ పొందుపరుస్తున్నాను. ఆసక్తికరమైన ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు ఈ పుస్తకంలో మీకు లభ్యమవుతాయి.

- డా. యస్.వి.యస్. కిషోర్ కుమార్

గమనిక: " ఆధ్యాత్మికం " ఈబుక్ సైజు 7.2mb
Comment(s) ...

నేటి ప్రపంచం సాంకేతికత గుప్పిట్లో వుంది. సామాజిక మాధ్యమాలు (Social media) విరివిగా అందుబాటులో వున్నాయి. నిత్యం ఎన్నో విషయాలు వీటి ద్వారా ప్రజానీకానికి తెలుస్తున్నాయి. అందులో ముఖ్యంగా హిందూ ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో విశ్లేషిస్తున్నారు. ఇది ఒక శుభపరిణామం. ఈ పుస్తకంలో రచయిత ఓపికగా అన్నివిషయాలని సేకరించి మన ముందుంచాడు. ఇది నిజంగా మెచ్చుకోతగ్గ విషయం. భక్తి అనేది జీవితానికి చుక్కాణి లాంటిది. ఈ పుస్తకం ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకున్న తృప్తి కలిగింది. ఉచిత ప్రసరణ ద్వారా పుస్తకాన్ని అందజే స్తున్న రచయితకు ధన్యవాదాలు.