• Zaqmi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ౙఖ్మి

    Zaqmi

    Author:

    Publisher: NK Publications

    Pages: 138
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలంగాణా మట్టిని తొలుచుకుని వచ్చిన మరో స్వప్న ఫలకం నస్రీన్. ఒక జర్నలిస్టుగా తాను చూసిన జీవితంలోంచి, ఒక ‘పరీ’ కన్న కలలే ఆమె కవిత్వం. స్త్రీని చైతన్య పరిచే దిశగానే ఈమె కవిత్వమున్నప్పటికీ, వాస్తవ దృశ్యాల వ్యక్తీకరణ బాగా చేస్తుంది. నస్రీన్ ఖాన్ విలక్షణమైన కవయిత్రి. జర్నలిస్ట్ కవి కావడం వల్ల ఈమెను కదిలించినప్పుడు, కరిగించినప్పుడు, కన్నీళ్ళొలికించి నప్పుడు కవితై మనముందుకొచ్చింది. భారతీయ ముస్లిమ్‌ల పట్ల సమాజ వివక్షను చాలా సూటిగా స్పష్టంగా ప్రకటించింది. ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అందరినీ తనలో కలుపుకొని, అందరూ తానై, ఏక స్వరమై, తమ బతుకు చిత్రాల అతుకుల బొంతల్ని స్పష్టంగా చిత్రిస్తూ పోయింది. ఒక స్థిరమైన, నిశ్చలమైన స్వరం నస్రీన్‌ది. 'జఖ్మీ' కవితా సంకలనంతో సాహితీలోకంలోకి అడుగిడుతున్న నస్రీన్, కవిత్వాన్ని కూడా భిన్నభిన్న రూపాల్లో వ్యక్తీకరిస్తూ పోయింది.

- డా. శిలాలోలిత

ముస్లింవాద కవులు పరదాల చాటున గుహల్లాంటి ఇళ్లల్లో అంధకారంలో అవిద్యలో దారిద్ర్యంలో ఒక రకమైన అంటరానితనానికి వివక్షకు గురైన బాధామయగాధలను అక్షరీకరించారు. ఎంతమంది రాస్తే, ఎలా రాస్తే పోతుంది ఈ దైన్యం.. ఈ పరిస్థితి?

నస్రీన్ కవితలు చదివాక నాకు చాలా సంతోషమేసింది. ఎక్కడలేని ధైర్యం నమ్మకం కలిగింది. ముస్లిం వాదానికి, ముస్లిం స్త్రీల తరుపున మాట్లాడే మరో గట్టి కంఠస్వరం తోడయ్యింది. నస్రీన్ ఖాన్‌కి మనస్ఫూర్తిగా స్వాగతం! నస్రీన్ రాసిన ఏ కవిత చదివినా ఆశ్చర్యమే, అద్భుతమే. భావోద్వేగాలకు గురవుతాం. ఆ కవితలన్నీ మన అనుభూతులు కూడా. మనవి అనిపించడమే మంచి కవిత్వానికి గీటురాయి! సార్వజనీనత, పారదర్శకత పూవులకు పరిమళంలా కవితలనిండా నిండి తేనియలా జాలువారుతూ మనం ఆఘ్రాణిస్తాం. స్వచ్ఛంగా నిజాయితీతో నిర్భయంగా నస్రీన్ రాసిన కవిత్వం ముస్లిం వాదానికి చేర్పుగా నిలుస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

- డా.షాజహానా

Preview download free pdf of this Telugu book is available at Zaqmi