• Indialo Manavavada Udyama Charitra
  • Ebook Hide Help
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇండియాలో మానవవాద ఉద్యమ చరిత్ర

    Indialo Manavavada Udyama Charitra

    Pages: 145
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భారతదేశంలో మానవవాద ఉద్యమం - పార్టీ భిన్నంగా వున్నది. కేవలం మానవేంద్రనాథ్ రాయ్ అనే ఒక వ్యక్తి కీలకస్థానంలో వుండగా, ఒక పార్టీగా ఉత్తరోత్తరా వుద్యమంగా పరిణమించిన పరిస్థితి వింతగా వుంటుంది.

మానవేంద్రనాథ్ రాయ్ తొలుత బెంగాల్‌లో నరేంద్రనాథ్‌గా స్వాతంత్ర్య తీవ్రవాద పోరాటంలో పాల్గొని దీనికోసం ప్రపంచం చుట్టి వచ్చాడు. అలా 15 సంవత్సరాలు ప్రవాస జీవితం గడిపి, అంతర్జాతీయ రంగంలో కీలకపాత్ర వహించి స్వాతంత్ర్య పోరాటం సాగించాడు. ఆ పోరాటానికి ఇండియాలో గుర్తింపురాలేదు. సుభాస్ చంద్రబోసుకూ ఎం.ఎన్.రాయ్‌కు అదే తేడా.

నరేంద్రనాథ్‌గా ఆరంభించి మానవేంద్రగా మారిన వ్యక్తి రాజకీయంగా తాత్వికంగా చాలా మార్పు చెందాడు.

తిరిగి భారతదేశం వచ్చిన తరువాత, కాంగ్రెస్‌లో యిమడలేక, సంతరించిన విప్లవ తాత్విక వైజ్ఞానిక భావాలతో రాడికల్ డెమోక్రటిక్ పార్టీ పెట్టాడు. అదీ కొనసాగక, వైజ్ఞానిక ఉద్యమంగా పరిణమించడానికి ప్రయత్నం చేశాడు. దీనికి కొందరు సహకరించడంతో ఉద్యమం నడిచింది. కానీ రాయ్ దంపతులు చనిపోవడంతో వుద్యమం క్రమేణా క్షీణించింది.

భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో ఉద్యమం చురుకుగా సాగగా మరికొన్ని చోట్ల నామమాత్రం అయింది. మొత్తం మీద రాడికల్ హ్యూమనిస్ట్ ఉద్యమం రాయ్ ఆధ్వర్యాన చరిత్రలో నిలుస్తుంది. సమాజంలో నిలదొక్కుకోలేకపోయింది.

ఈ విచిత్ర పార్టీ, వుద్యమ చరిత్ర సాధ్యమైనంతమేరకు వివరాలతో అందిస్తున్నాం.

- నరిసెట్టి ఇన్నయ్య

గమనిక: " ఇండియాలో మానవవాద ఉద్యమ చరిత్ర " ఈబుక్ సైజు 5.7mb
Preview download free pdf of this Telugu book is available at Indialo Manavavada Udyama Charitra