• Agraharam Kathalu Jagatpati Yerramilli
  • Ebook Hide Help
    ₹ 180
    200
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అగ్రహారం కథలు - జగత్పతి యర్రమిల్లి

    Agraharam Kathalu Jagatpati Yerramilli

    Pages: 302
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒకరోజు ఆనం కళాకేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమం ఉందంటే మిత్రుల ప్రోద్బలంతో వెళ్ళటం జరిగింది. అందులో భాగంగా సినారెగారి కవితల గానం ఏర్పాటు చేశారు నిర్వాహకులు. కవితల గీతాలాపన ఊపందుకొంది. శ్రావ్యంగా కవితాలాపన సాగిపోతోంది. ఒక గీతం -
ఉందో లేదో స్వర్గం !
నా పుణ్యం నాకిచ్చేయ్ !
నా సర్వస్వం నీకిచ్చేస్తా !
నా బాల్యం నాకిచ్చేయ్ !

సినారెగారు రచించిన పై కవిత నా మనసు దర్వాజాను బలంగానే తాకింది. గుండె తలుపులు తెరిచి చూసుకుంటే హృదయమంతా బాల్యమే. చీకూచింతాలేని బాల్యం. మధురమైన బాల్యం. దొడ్డమ్మలు, పిన్నమ్మలు మావయ్య పిల్లలతో కలిసి తాతయ్య బోడపాటి సత్యనారాయణ అమ్మమ్మ రంగనాయకమ్మలతో గడిపిన బాల్యం. ఈనాడు ఎంతమందికి దొరుకుతుంది అటువంటి బాల్యం. ఉమ్మడికుటుంబ వ్యవస్థ నేల కూలిన ఈ రోజుల్లో, నియంత్రిత కుటుంబాల్లో, యాంత్రిక జీవనంలో ఏదీ! బాల్యం. మచ్చుకైనా కన్పించడం లేదు.

కన్న పిల్లల బిడ్డలను తమతోపాటే ఉంచుకొని, పెంచి మధురమైన బాల్యాన్ని అందించిన తాత, అమ్మమ్మలని మరియు మా పల్లెటూరు ఒంటిమామిడి అగ్రహారంలోని పెద్దలు, బంధువులు పంచిన ఆత్మీయత, పురాతన శివాలయం, అగ్రహారంలో నే గడిపిన జీవితం మరువలేక అక్షర రూపం ఇచ్చేందుకు చేసిన చిన్ని ప్రయత్నమే ఈ కథల సంపుటి.

- జగత్పతి యర్రమిల్లి

Preview download free pdf of this Telugu book is available at Agraharam Kathalu Jagatpati Yerramilli