• Vivechana Udvegavadam Viplavam Prathama Bhagam
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వివేచన, ఉద్వేగవాదం, విప్లవం - ప్రథమ భాగం

    Vivechana Udvegavadam Viplavam Prathama Bhagam

    Author:

    Pages: 239
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆధునిక నాగరికతలో సాంస్కృతిక నైతిక సంక్షోభం గమనించిన సునిశిత ఆలోచనాపరులు ప్రపంచవ్యాప్తంగా మానవతా సంప్రదాయం వైపు మరలుతున్నారు. రోజు రోజుకూ మానవతావాదం తిరగదోడాలనే ఉద్యమం బలపడుతున్నది. నేడు కలవరపెడుతున్న సమస్యలకు వివేచనాత్మక దృక్పథం కావాలని గుర్తిస్తున్నారు. ప్రజా జీవితంలో నైతిక విలువలు కాపాడాలని బాగా వత్తిడి వస్తున్నది. ప్రపంచంలో జీవితం మెరుగుపడాలని, పొందికగా కొనసాగాలనే ఆక్రందనలో చిత్తశుద్ధిని ఎవరూ సందేహించడం లేదు. అయినా యిది అరణ్యరోదనంగా వున్నట్లనిపిస్తున్నది.

ఆధునిక సంశయవాదంలో వ్యతిరేక ఫలితం వలన బాధామయమైన అనుభవం వచ్చింది. “సరైన వివేచన” ఆధారంగా పరమార్థాన్ని కనుగొన్నట్లు ప్రాచీన సంపూర్ణ తత్వం పేర్కొనడాన్ని 19 వ శతాబ్దపు విమర్శనాత్మక ఆలోచనా ధోరణి సవాల్ చేసింది. జీవిత సమస్యలన్నిటికీ నైరూప్య ప్రథమ సూత్రాల నుంచి పరిష్కారాలను రాబట్టవచ్చనే విశ్వాసబంధం నుంచి, విమోచన కలగడానికి కారణం. అనుభవానికి పూర్వమే జ్ఞానం వున్నదనే ఊహతో గూడిన తాత్విక విధానాన్ని నిరాకరించడమే. కాని యిదే సమయంలో నైతిక, సాంస్కృతిక సంక్షోబానికి బీజాలు నాటారు. స్నానజలంతో బాటుగా పసిపిల్లను కూడా పారేశారు. “సరైన వివేచన" అనే అధి భౌతిక భావనను తృణీకరించడంతో, వివేచనావాదం అర్థరహితమైంది. దీని స్థానంలో, జీవితానికి చుక్కానిగా అన్ని విధానాలైన మార్మిక ప్రేరణలు-అంతర్భుద్ధి, జీవశక్తి, జీవసృష్టి ప్రవేశించాయి. వివేచనను ఉన్నతన్యాయస్థానం నుంచి ప్రాపంచికానుభవ వాదం పడద్రోయగా, నైతిక విలువలకు ఆచరణలో వ్యావహారిక వాదం తక్కువ స్థానం ఇచ్చింది.

సంశయవాదంలోని ప్రమాదపూరిత ఫలితాలనుంచి వివేచనను నీతిశాస్త్రాన్ని కాపాడడానికి యీ గ్రంథంలో ప్రయత్నం జరిగింది. ఆధునిక విజ్ఞానం ఆధారంగా మానవుడి వివేచన జీవ సంబంధమైనదని కనుగొన్నారు. వివేచన అధి భౌతిక న్యాయం కాదు. మానవుడిలోని వివేచన వలన నైతిక విలువలకు గట్టి ప్రాతిపదిక ఏర్పడింది. దీనికి ఏ ప్రమాణం అక్కరలేదు. అంతరాత్మ మినహా, అంతరాత్మ అంటే దివ్యవాణి కాదు. వివేచన వలన యిది జనిస్తుంది. సంప్రదాయబద్ధంగా మానవతావాదాన్ని అంటిపెట్టుకొని వస్తున్న మార్మికభావన తొలగిపోయింది. వివేచనకు భౌతిక ప్రాతిపదిక, నీతికి వివేచనాత్మక మతేతర వూతం లభించడం వలన యిది సాధ్యమైంది.

- నరిశెట్టి ఇన్నయ్య

Preview download free pdf of this Telugu book is available at Vivechana Udvegavadam Viplavam Prathama Bhagam