• Kalala Railu
  • Ebook Hide Help
    ₹ 225
    250
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కలల రైలు

    Kalala Railu

    Pages: 290
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇదో అసాధారణ రచన! ప్రపంచంలో అత్యుత్తమ సాహిత్యానికి ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాల్లో దాదాపు అన్నింటినీ దక్కించుకున్న మేలిమి రచన ఇది. అలాగే బరాక్ ఒబామా నుంచి ఓప్రా విన్‌ఫ్రే వరకూ ఎంతో మందిని ఆకట్టుకొని, వారి మనసులపై బలమైన ముద్రవేసిన అరుదైన నవల ఇదని అట్టమీది వ్యాఖ్యలను చూస్తే తేలికగానే అర్థమవుతుంది. మరి అందర్నీ ఇంతగా కదిలించి, ఆధునిక సాహితీ జగత్తులో దీన్ని ఉత్తమ సృజనగా నిలబెట్టిన అంశాలు ఇందులో ఏమున్నాయి?

'అండర్ గ్రౌండ్' లోకి వెళ్లటమంటే ఏమిటో మనకిప్పుడు ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదు. అజ్ఞాతంలోకి వెళ్లి తమ లక్ష్య సాధన కోసం కృషి చేసే ఉద్యమకారులకు 'అండర్‌గ్రౌండ్' జీవితమన్నది ప్రత్యక్ష అనుభవం. 'అండర్‌ గ్రౌండ్' అన్నది ఓ బలమైన ప్రతీక. 19వ శతాబ్దం మధ్యకాలంలో దక్షిణ అమెరికాలో అమానుషమైన బానిస వ్యవస్థకు బలై, ఎన్నో జీవితాలు దారుణమైన పరిస్థితులమధ్యే తెల్లారిపోతున్న రోజుల్లో... వారిని ఈ బానిస బంధనాల నుంచి తప్పించి... రహస్యంగా దేశం దాటించేందుకు ఎంతో మంది ప్రజలు ఓ నెట్‌వర్క్‌లా పనిచేసే వాళ్ళు. వీరిలో తెల్లజాతి వారూ, నల్లజాతి అమెరికన్లు కూడా ఉండేవారు. వీళ్ళంతా రహస్యంగా పనిచేస్తూ బానిసలను ఉత్తర అమెరికా, కెనడా తీరాలకు తరలించేవాళ్లు. ఈ అజ్ఞాత నెట్‌వర్క్‌లనే 'అండర్‌గ్రౌండ్ రైల్‌రోడ్' అని పిలిచే వాళ్లు. ఇలా బానిసలు ఆ కర్కశ బంధనాల నుంచి తప్పించుకోటానికి సహాయం చేసినవాళ్ళలో అసమానమైన నల్లజాతి మహిళ సొజర్నర్ ట్రూత్ కూడా ఒకరు. వాస్తవానికి 'అండర్‌గ్రౌండ్ రైల్‌ రోడ్' అనేది ఓ ప్రతీకే అయినా రచయిత కాల్సన్ వైట్‌హెడ్ దీన్ని ఈ పుస్తకంలో అమోఘమైన రీతిలో వాడుకున్నాడు.

ఆ ప్రతీకనే వాస్తవంగా... ఇంకా చెప్పాలంటే ప్రత్యామ్నాయ వాస్తవంగా రూపు కట్టిస్తూ... పాఠకులను నిజంగానే ఆ ప్రతికాత్మక ప్రపంచంలోకి తీసుకువెళతాడు. పుస్తకంలోంచే మనం ఆ లోకంలోకి వెళ్లిపోతాం. మన కళ్లముందు రైలు మార్గాలు, పట్టాలు, స్టేషన్ మాస్టర్లు, కండక్టర్లు.. వీళ్లమధ్యే తప్పించుకు పారిపోతున్న బానిసలు... అంతా ప్రత్యక్ష మవుతారు.

- పబ్లిషర్స్

Preview download free pdf of this Telugu book is available at Kalala Railu