• A Journey To Hell
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎ జర్నీ టు హెల్

    A Journey To Hell

    Author:

    Pages: 102
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రసూన కలుసుకోవాలని వాంఛించిన మౌమౌ తండా మనిషి అతడే అని మొదటిచూపులోనే గ్రహించాడు షాడో.

అడుగులో అడుగువేస్తూ పోయి అతని శరీరాన్ని పరిశీలించి చూశాడు. వళ్ళు పూర్తిగా చల్లబడలేదు...గాయంలోనుంచి కారిన రక్తం ఇంకా గడ్డకట్టలేదు. హత్య జరిగి ఎంతోసేపు కాలేదు. హంతకులు ఆ పరిసరాలలోనే వుండి వుండవచ్చు.

ఆ మాట అనుకోగానే ఝల్లుమంది షాడో శరీరం. అప్రయత్నంగా పాంటుజేబులో చేయిపెట్టి రివాల్వర్‌ని బయటికి లాగాడు.

ఒకటి...రెండు...ఐదు...పదినిముషాలు గడిచిపోయాయి. ఎటువంటి ప్రమాదచిహ్నమూ అతని కంటికి కనిపించలేదు. అలా అని హెచ్చరికలు చేయటం మానుకోలేదతని అంతరంగం. ఏదో ప్రమాదం వచ్చి పడుతున్నదనే ఆక్రోశించడం ప్రారంభించింది.

అంతరంగపు హెచ్చరికల్ని పెడచెవినపెట్టి మరో గదిలోకి అడుగు పెట్టాడు షాడో. అడుగుపెట్టిన మరుక్షణం అర్థం అయిందతనికి ప్రమాదం ఎటువంటిదో! ఎగిరి వెనక్కు దూకటానికి ప్రయత్నించాడు.

కాని అప్పటికే ఆలస్యం అయిపోయింది. శిథిలభవనపు సీలింగ్‌కి వ్రేలాడుతున్నది ఒక పెద్ద ఇసుకమూట. సూటిగా వచ్చి అతని తల మీద పడిందది.

పెద్ద యినుప సమ్మెటతో తలమీద కొట్టినట్లు—బాధపడుతూ ముందుకు తూలాడు. మరుక్షణం గోడల చాటునుంచి యివతలకు వచ్చారు ముగ్గురు వ్యక్తులు. పొడుగాటి ఐరన్ రాడ్ పట్టుకొని వున్నారు వారిలో యిద్దరు. వాటిని గాలిలోకి ఎత్తి బలంగా మోదాడు షాడో తలమీద.

కనులముందు మరికొన్ని నక్షత్రాలు ప్రత్యక్షం అవుతుండగా స్పృహతప్పి బోర్లాపడిపోయాడు షాడో.

Preview download free pdf of this Telugu book is available at A Journey To Hell