• Rayalaseema Samajam Sahityam
  • Ebook Hide Help
    ₹ 180
    200
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రాయలసీమ సమాజం - సాహిత్యం

    Rayalaseema Samajam Sahityam

    Publisher: Perspectives

    Pages: 255
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


మమ్ము పీనుగులను చేసి
ఆడుకునే శత్రువులు ఇద్దరే ఇద్దరు
ఒకరు కరువు రక్కసి
మరొకరు రాజకీయ భూతం

- రఘుబాబు

రాయలసీమ సంక్షుభిత సమాజాన్ని సాహిత్యానికి అనువర్తింపజేస్తూ సృజనాత్మక రచయిత బండి నారాయణస్వామి రచించిన వ్యాసాల్ని పర్‌స్పెక్టివ్స్ ప్రచురించడానికి సంకల్పించినపుడు పై కవిత్వ పంక్తులే పదేపదే గుర్తుకు వచ్చాయి. అన్ని వెనకబడ్డ ప్రాంతాలలానే రాయలసీమది కూడా రక్తసిక్త చరిత్రే. అయితే కనికరం లేని ప్రకృతి చిన్నచూపుకీ, స్వార్థ రాజకీయాల క్షుద్రక్రీడకూ, భూస్వామ్య సాయుధ ముఠాకక్షలకూ బలయిన ప్రాంతం రాయలసీమ. విలీనాల్లో-విభజనల్లో ‘పెద్ద మనుషుల ఒప్పందాలు' అమలు కాకపోడానికో విఫలం కావడానికో కాలదోషం పట్టడానికో దశాబ్దాలుగా సీమనేల నిత్యానల వేదికయ్యింది. కలిసిపోవడంలోనూ విడిపోవడంలోనూ రాయలసీమ తన్ను తాను కోల్పోవడంలో ఆధిపత్య ప్రాంతీయుల పాత్ర యెంత వుందో స్వీయ విద్రోహాల ప్రమేయం కూడా అంతే వుంది. చాలా సందర్భాల్లో పెద్దమనుషుల ఒప్పందాలు ఆచరణకు నోచుకోకపోడానికి కారణం వాటిని చేసుకొన్నవాళ్లు పెద్ద మనుషులు కాకపోవడం. లేదా వారిని తర్వాతి తరం పెద్దమనుషులుగా గుర్తించి గౌరవించకపోవడం. అంతేకాదు; అసమానుల మధ్య జరిగే అసమంజసమైన వొప్పందాలపై పునరాలోచనలోంచి వాటిని తిరస్కరించే అవకాశం కూడా వుంది. బలవంతపు వొడంబడికల్లో అభివృద్ధికి ఆమడదూరంలో వుండిపోయిన సీమ ప్రత్యేకతలని అధ్యయనం చేయకుండా అక్కడి సాహిత్య సాంస్కృతిక విలక్షణతని నిర్దిష్టంగా అంచనా వేయలేం అనే అవగాహన నుంచి పుట్టిన వ్యాసాలివి.

- ఎ. కె. ప్రభాకర్

Preview download free pdf of this Telugu book is available at Rayalaseema Samajam Sahityam