• Atadu
  • Ebook Hide Help
    ₹ 400
    400
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అతడు

    Atadu

    Author:

    Publisher: Perspectives

    Pages: 557
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

2008 జనవరిలో ప్రారంభమైన అల్లం రాజయ్య సాహిత్య సర్వస్వం సంపుటాలను జూన్ 2019లో వెలువరిస్తోన్న ఆఖరి ఆరవ సంపుటంతో ముగిస్తున్నాం. రాజయ్యగారి రచనలకు వరవరరావుగారి సంపాదకత్వం సమగ్రతను సమకూర్చింది. రాజయ్యగారి రచనలకున్న రాజకీయ సామాజిక సాంస్కృతిక నేపథ్యాలని బహుశా వరవరరావుగారి కన్నా విస్తృతంగా లోతుగా పరిశీలించటం మరొకరికి సాధ్యం కాదు. రాజయ్య, వరవరరావులు ఇద్దరూ కూడా నడుస్తోన్న ఈ కల్లోల నక్సల్బరీ దశాబ్దాలకు రాజకీయ, సాంస్కృతిక వ్యాఖ్యాతలు.

తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో అతిపురాతనమైన మధ్య యుగాలనాటి భూస్వామిక ఉత్పత్తి సంబంధాలను నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగంగా మార్చే క్రమంలో కీలక విప్లవ శక్తులుగా మారిన రైతాంగ, కార్మిక, ఆదివాసీ ప్రజా పోరాటాలు రాజయ్య సాహిత్యానికి భూమికగా నిలిచాయి. ఈ పోరాటాల నిర్మాణం, పరివ్యాప్తి విస్తృతి, కొనసాగింపు రాజయ్య మొదటి దశ సాహిత్యంలో కనిపిస్తుంది. రెండో దశ భారతదేశంలో ఉండేటటువంటి సంక్లిష్ట సమాజం, వైరుధ్యాలు, వాటి చుట్టూ ఆవహించి ఉన్న అశాస్త్రీయ హేతువిరుద్ధమైన భావజాలంతో తలపడి, ఎదిరించి ముందుకు తీసుకపోయే క్రమానికి సంబంధించిన నిర్మాణ సమస్యలే ఇతివృత్తంగా రాజయ్య రచనలు వచ్చాయి.

అల్లం రాజయ్య రచనల విశిష్టత, చారిత్రకత, సామాజికతల గురించి నిర్దిష్టంగా చెప్పడమంటే, అది గత 1970ల నుంచి 2000 దాకా నడిచిన కల్లోల దశాబ్దాల తెలంగాణ విప్లవోద్యమ చరిత్ర చెప్పడమే. ఆ విధంగా ఒక నిర్దిష్ట సామాజిక పునాది మీద నిలబడి సామాజిక పరిణామాల వాస్తవాలను, చారిత్రక సత్యాలను... ఆ సత్యాల్లో అంతర్లీనంగా, అస్పష్టంగా నెలకొన్న సంక్లిష్ట సామాజిక సంబంధాలను విశ్లేషించినవే రాజయ్య రచనలు. మనిషిలోని విధ్వంసాన్ని, గ్రామీణ ఆర్థిక సామాజిక సంక్షోభాలను వివరిస్తూ - అందుకు తగ్గ ఎత్తుగడలని రూపొందించుకోవాల్సిన అవసరాన్ని ఈ రచనలు గుర్తు చేస్తాయి.

- ఆర్ కె

గమనిక: " అతడు " ఈబుక్ సైజు 13.5mb
Preview download free pdf of this Telugu book is available at Atadu