• Kotta Calendar
  • Ebook Hide Help
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కొత్త క్యాలండర్

    Kotta Calendar

    Author:

    Pages: 140
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కవిత్వం సరళంగా ఉంటూనే ఆలోచించగలిగేవారికి అనంత భావాలందించే కవిత్వం, "వావిలాల గోపాలకృష్ణయ్యలాంటిది నా కవిత్వం" అని చెప్పుకున్న జన రంజక కవి డా. రావి రంగారావు తాజా వచన కవితల సంపుటి, "కవులంటే నాయకులు భయపడాలి" అన్న గొప్ప చైతన్యంతో రాస్తున్న కవి రంగారావు.

***

ఒక్క క్షణం చాలు


ఒక్క క్షణం చాలు- కళ్ళు మూతపడితే
వెలుతురు కుంటిది కావచ్చు,
చీకటి కుర్చీ ఎక్కొచ్చు...


ఒక్క క్షణం చాలు- అజాగ్రత్తగా ఉంటే
దేశం వివస్త్ర కావచ్చు,
ద్వేషం తెల్ల చొక్కా లేసుకొని తీర్పు లివ్వొచ్చు...


ఒక్క క్షణం చాలు- రంగుల భ్రమలకు లోనైతే
చంద్రుడిని చీకటి తొక్కేయొచ్చు,
ఒక చుక్క భూతద్దం అడ్డుపెట్టుకొని చంద్రుడిగా కనిపించొచ్చు...


ఒక్క క్షణం చాలు- కళ్ళు చెదిరితే
మేనక వల వేయొచ్చు,
వ్రతం పూర్తిగా చెడొచ్చు.


జీవిత మంతా ప్రతిక్షణం
అప్రమత్తంగా ఉండాలి,
భూగోళ మంత బంతి నీదే కావచ్చు కాని
సూది మొనంత కన్నమైనా పడకుండా చూసుకోవాలి.

Preview download free pdf of this Telugu book is available at Kotta Calendar