• Sirikona Sahiti
  • Ebook Hide Help
    ₹ 100
    100
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సిరికోన సాహితి

    Sirikona Sahiti

    Pages: 174
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సాహిత్య ప్రతులకే కాక, ఎంతో మంది యువ పరిశోధకులకూ, పోటీ పరీక్షల అభ్యర్థులకూ, బహుళోపయోగకారి అయిన ఈ చర్చల ప్రచురణకు ప్రథమ ప్రాధాన్య మిద్దామనుకొన్నాం. దీనికి సహసంపాదకులుగా వ్యవహరించడానికి, ఈ చర్చలకెక్కువ భాగం ప్రాణం పోసిన డా. ఏల్చూరి గారు, డా. చుక్కా శ్రీనివాస్ గారు అంగీకరించారు. ఇది మా ముగ్గురిదే కాదు, ఇందులో అగుపించే ఎంతోమంది సమైక్య కృషి ఫలం.... సమయం తక్కువ కావడం వల్ల, గత అక్టోబరు నుంచి డిసెంబరు దాకా జరిగిన కృషిలో ఒక భాగం మాత్రమే ఇప్పుడు ప్రచురిస్తున్నాం. మరో భాగం త్వరలోనే!

ఇవి ఒక్కరి అభిప్రాయాలు కావు. ఒక్కరి వ్యాసాలు కావు. ఒక్కరి వ్యాసాల్లో ఆ ఒక్కరి perspective మాత్రమే ఉంటుంది. కానీ ఇందులో, భాషా, సాహిత్య, సంస్కృతులకు సంబంధించిన అంశాల మీద, విభిన్న పార్శ్వాల నుంచి చూసిన దాదాపు పాతిక మంది విభిన్న ఆలోచనలున్నాయి. విభిన్న వాదోపవాదాలున్నాయి... అదీ ఒక్కరోజు జరిగినవి కావు, ఒక వరసలో జరిగినవి కాదు. ఎప్పటికప్పుడు పునరాలోచనలతో, పునః పరిశీలనలతో సాగిన చర్చాకదంబాలు. వీటిని ఒక 'కదంబం' రూపంలోకి తేవడానికి, నేను నా నలభై అయిదేళ్ల అకడమిక్ జీవితంలో ఎప్పుడూ పొందనంత ప్రయాస పొంది ఉండవచ్చు.... అయితేనేం, ఒక్క పుస్తకరూపంలో ఓ పాతిక పుస్తకాల సారాంశాన్ని, మస్తిష్కాల సారాన్ని అందిస్తున్నానన్న తృప్తి మిగిలింది. ఒక కొత్తతరం మాధ్యమంలో ఒక కొత్త ప్రక్రియకు నాంది పలికామన్న సంతోషం మా అందరికీ దక్కింది. అభినవ మాధ్యమాలను అధ్యయనాలకు అనుగుణంగా ఎలా మార్చుకోవచ్చో దారి చూపిన ఆనందం కలిగింది.

- గంగిశెట్టి లక్ష్మీనారాయణ

Preview download free pdf of this Telugu book is available at Sirikona Sahiti