• Casting Couch
  • Ebook Hide Help
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • క్యాస్టింగ్ కౌచ్

    Casting Couch

    Pages: 171
    Language: Telugu
    Rating
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    '4.67/5' From 3 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description

అన్ని దేశాలను 'ఆర్థిక దారిద్ర్యం' పట్టి పీడిస్తుంటే మన దేశాన్ని ‘సెక్స్ దారిద్ర్యం' పట్టి పీడిస్తోంది. కూడూ, గుడూ, పేదరిక దారిద్ర్యం కంటే ‘సెక్స్ దారిద్ర్యం' చాలా భయానకమైనది. చెప్పుకోడానికే సిగ్గేస్తోంది. కాని చెప్పక తప్పదు.

వరిపంట కంటే ఎక్కువగా పాపం పండుతోంది. చీకట్లో దాగిన నిజాలను బయటికి ఈడ్చుకురావాలి.

గైనకాలజిస్ట్ సిగ్గు పడితే రోగాలు పోవుగా? నేను మొదలు పెట్టిన 'అతివాస్తవ కథల' పక్రియ ‘నీతిమాలిన వాళ్ల నీతి కథలు’ కథా సంకలనంలో విజయవంతమైంది. కాబట్టి అదే పథాలో ఈ కథలు కూడా రాశాను.

నేడు అందరి నోట వినిపించేది ఒక్కటే మాటా - క్యాస్టింగ్ కౌచ్. స్త్రీ లైంగిక దోపిడి - ఆమెకు ఇష్టంలేకున్నా మగాడు ఆమెను నయానో, భయాన్నో, తేనెపూసిన కత్తితోనో లోబరుచుకునే ఆటవిక సంస్కతి. దీనికి కారణం ‘సెక్స్ దారిద్ర్యం'. సినిమా రచయితగా నాకున్న అనుభవంతో, నేను చూసిని నిజాలను కథలరూపంలో అందిస్తున్నాను. కేవలం సినిమా రంగంలో జరుగుతున్న లెంగిక దోపిడి విధానం గురించేకాకుండా, సమాజంలోని అన్ని రంగాలలో జరుగుతున్న దగాకోరు విధానాలను కథలుగా మీకు అందిస్తున్నాను.

- మోహనరావు దురికి

Preview download free pdf of this Telugu book is available at Casting Couch
Comment(s) ...

'' కాస్టింగ్ కౌచ్ ''
( స్త్రీ లైంగిక దోపిడీ)
కథలు
ఈనాడు అందరి నోటా వినిపించే మాట ఒక్కటే - కాస్టింగ్ కౌచ్. అంటే స్త్రీ లైంగిక దోపిడీ. ఆమెకు ఇష్టం లేకున్నా మగాడు ఆమెను నయాన్నో - భయాన్నో, బ్లాక్ మెయిల్ చేసో, తేనెపూసిన కత్తితోనో లోబరుచుకునే నీచమైన సంస్కృతి. ఇది అన్ని రంగాలల్లోనూ ఉంది. సినిమా రంగానికి ప్రత్యేక మీడియా ఉంది కాబట్టి ముందుగా బయటపడింది. మన దేశాన్ని కూడు, గూడు, గుడ్డ దారిద్ర్యము కంటే ‘ సెక్స్’ దారిద్ర్యమే పట్టి పీడిస్తోంది.
కాస్టింగ్ కౌచ్ - స్త్రీ లైంగిక దోపిడీకి కారణం ఒక్కటి కాదు, ఏ ఒక్కరూ కాదు. కర్ణుడి పుట్టుకకు కారణం ఒక్కటే. కాని చావుకు కారణాలు వంద. అలాగే ఆడవాళ్ళు సినిమా రంగానికి రావడానికి కారణం ఒక్కటే - గ్లామర్ ఫీల్డ్. వాళ్ళు లైంగిక దోపిడీకి గురికావడానికి కారణాలు వంద. మహాభారతం చెపితేకాని కర్ణుడు చావుకు గల కారణాలు అర్థం కావు. అలాగే సినిమా రంగం గురించి చెపితే కానీ స్త్రీ లైంగిక దోపిడీకి గల కారకులు, కారణాలు అర్థం కావు.
సినిమా రంగాన్ని దూరం నుంచి చూసి రాయడం వేరు - సినిమా రంగంలో పని చేసు, చూసిన విషయాలు రాయడం వేరు. 1995లో విడుదలైన 'టాప్ లేచి పోద్ది' సినిమాకు కథ, మాటలు రాశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు రవితేజా, మంచు విష్ణు, శివాజీ, సుమన్, సురేష్, అలీ లాంటి ప్రముఖ హీరోలు మొదలుకొని 12 సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాశాను. అలాగే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్, అల్లు అర్జున్, శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, ఉపేంద్ర లాంటి సుప్రసిద్ధ హీరోల సినిమాలు కలుపుకుని 62 సినిమాలకు 'గోస్ట్ రైటర్' గా పని చేశాను (ఆ సినిమాల మెయిన్ రైటర్లు బాధ పడతారని ఆ సినిమా పేర్లు చెప్పలేక పోతున్నాను. క్షమించండి) నాకున్న ఈ అనుభవంతో, నేను కళ్లారా చుసిన కొని పచ్చి నిజాలను కథల రూపంలో మీకు అందిస్తున్నాను.
కేవలం సినిమారంగం గురించే కాకుండా అన్ని రంగాల గురించి దారా వాహిక కథలు మీకు అందిస్తున్నాను. ఎవరినో కించపరచాలనీ, ఎవరినో బాధ పెట్టాలని కాదు. ఎవరినైనా నొప్పిస్తే ముందుగానే క్షమాపణలు చెపుతున్నాను.
మన www.kinige.comలో e-book కొని చదవండి. J.P. PUBLISHERS, Vijayawada నుంచి బుక్ తెప్పిచ్చుకోండి. లేదా
www.kahaniya.com లో రోజుకో కథను చావండి. https://www.kahaniya.com/profile… లో రోజుకో కథను చావండి. మొదటి కథ 'ఉలి చెక్కని శిల్పం' చదవడానికి ఇక్కడ క్లిక్క్ చేయండి..
https://www.kahaniya.com/s/casting-cou…/uli-chekkani-shilpam

కృతజ్ఞలతో .....
మీ
భవదీయడు
మోహన రావు దురికి
(అంతర్జాతీయ రచయిత)

Mr. Duriki mohanrao is well known writer in Telugu chitra seems. He is one of the assistant writer of e.v.v.satyanarayana. the book 'casting couch' tell the truths about cinema world. No doubt; mohanrao will success in his venture.
Mohanrao... Best of luck.
_Adapa chiranjeevi