• Lenin Nedu Ledu Chudu Janamlo Unnadu
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • లెనిన్ నేడు లేడూ?... చూడు జనంలో ఉన్నాడు

    Lenin Nedu Ledu Chudu Janamlo Unnadu

    Author:

    Publisher: Pet Publications

    Pages: 36
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రఖ్యాత రష్యన్ రచయిత మయకోవస్కీ కామ్రేడ్ లెనిన్‌పై రాసిన కావ్యాన్ని విశ్లేషిస్తూ, కా||లెనిన్‌పై తనకున్న విశ్వాసాన్ని జోడించి విజయ్ ఈ రచన చేశానని ప్రకటించుకున్నారు.

రచయితకు కా||లెనిన్‌పై ఎంతటి అభిమానము, విశ్వాసము ఉందో ఈ రచన చదివితే అర్థమవుతుంది. రచయితకి మార్క్సిజం - లెనినిజంపై ప్రగాఢమైన నమ్మకం ఉన్నట్లు చదువరులకి ఇట్టే తెలిసిపోతుంది.

ప్రపంచంలోనే మొదటిసారిగా విజయవంతమైన రష్యన్ విప్లవానికి సారధ్యం వహించి, దిశానిర్దేశంచేసి, తొలి విప్లవ రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మేరుపర్వతం లాంటి కా||లెనిన్‌ను కేవలం ముప్పై పేజీల మరో చిన్న కావ్యంలో పరిచయం చేయాలనుకోవటం హిమాలయ పర్వతాన్ని చిన్న అద్దంలో చూపే ప్రయత్నం లాంటిది. ఇది రచయిత దుస్సాహసమే. అయితే రచయిత సాహసం ఆహ్వానించ దగినది మరియు అభినందించదగినది.

ప్రపంచ తొలితరం కమ్యూనిస్టు యోధులైన కార్ల్‌మార్క్స్ - ఫ్రెడరిక్ ఏంగిల్స్ మహాశయులు దోపిడీకి గురవుతూ అసంఘటితంగా ఉన్న శ్రామిక లోకాన్ని ఉద్దేశించి సకల దేశ శ్రామికులారా ఏకం కండి - పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు తప్ప అన్న పిలుపును అనుసరించి, రష్యాలో బోల్షివిక్ కమ్యూనిస్టు పార్టీని నిర్మించి, నడిపించి, తమ దేశ పరిస్థితులకు శాస్త్రీయంగా అన్వయించుకొని విప్లవోద్యమాన్ని విజయవంతం చేయడంలో కా||లెనిన్ పాత్ర అజరామరం ప్రపంచానికి మార్గనిర్దేశకం.

మయకోవస్కీ తన కావ్యంలో కాలెనిన్ గురించి ఎలా స్పందించాడో రచయిత విజయ్ కూడా అలానే స్పందించడానికి ప్రయత్నించాడు. కా||లెనిన్‌ను ఎందరో మహానుభావులు, సమాజానికి పరిచయం చేసినా, మరింత మిగిలే వుంటుంది. ఆ మిగులును మన విజయ్ లాంటి వాళ్లు పూరించడానికి ప్రయత్నించడం నిజంగా అభినందనీయం.

రచయిత విజయ్‌కి మార్క్సిజం - లెనినిజంపైన అపారమైన నమ్మకం, గురి వున్నట్లు తన రచనలో తెలుస్తుంది. మార్క్సిస్టు మహోపాధ్యాయుల్ని గురించి అధ్యయనం చేసి, నేటి యువతరానికి అందించాలన్న అతని తపనను హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే యువతరంలో స్ఫూర్తిని నింపే రచనలు మరిన్ని చేయాలని అభినందిస్తున్నాను. విజయ్ నా అభిలాషను తప్పక తీర్చగలడని విశ్వసిస్తున్నాను.

- డి. గోవిందరాజులు

Preview download free pdf of this Telugu book is available at Lenin Nedu Ledu Chudu Janamlo Unnadu