• Dabbulevariki Voorike Ravu 1
  • Ebook Hide Help
    ₹ 60
    90
    33.33% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • డబ్బులెవరికీ ఊరికే రావు - 1

    Dabbulevariki Voorike Ravu 1

    Publisher: Model Publications

    Pages: 215
    Language: Telugu
    Rating
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    '4.33/5' From 3 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 2 premium votes.
Description

గ్రాండ్ ఇండియన్ కుజిన్...

ఇది పూందమల్లి హైరోడ్‌లో ఉంది.

నిషాంత్ వైఫ్ సుమిత్ర కిడ్నాపయినట్టు చెప్పబడింది ఇక్కడే. తాము రెండుసార్లు వెళ్ళి అక్కడ ఎంక్వయిరీలు కూడ జరిపారు. సో... ఆ రెస్టారెంట్ పూందమల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో వుంది. రూల్స్ ప్రకారం సంఘటన ఎక్కడ జరిగిందో ఆ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లోనే రిపోర్టివ్వాలి. అందుకే కశ్యప్ గ్యారేజ్ నుంచి బయలుదేరిన స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్లు ఇద్దరూ నేరుగా పూందమల్లి పోలీస్‌స్టేషన్ కొచ్చి కారు దిగారు.

ఇద్దరూ ఎస్సై ఎదురుగా కూచున్నారు.

“చెప్పండి మేడమ్! ఏదో పనిమీదే వచ్చుంటారు” అడిగాడు ఎస్సై ఆర్ముగం.

“అవును ఆర్ముగం. పనిమీదే రావలిసొచ్చింది. సెల్వం బ్యాంకు ఓనర్ నిషాంత్ భార్య సుమిత్ర ఇక్కడ గ్రాండ్ రెస్టారెంట్ వద్ద కిడ్నాపయింది. ఓసారి నిషాంత్ ఇచ్చిన కంప్లయింట్, మీరు ఫైల్ చేసిన ఎఫ్.ఐ. ఆర్. చూడాలి. అందుకే వచ్చాం” సూటిగా అడిగింది కామ్య.

“సారీ మేడమ్! ఈ కేసుకు సంబంధించిన వివరాలు టి.వి.లోను న్యూస్ పేపర్లలోను చూసాం. బట్... మీరనుకుంటున్నట్టు మా స్టేషన్‌కు ఎలాంటి కంప్లయింటు రాలేదు” అన్నాడు.

కామ్య విస్తుపోయింది.

విశ్వాస్ కూడ ఆశ్చర్యంగా చూస్తున్నాడు.

“కంప్లయింట్ చేయలేదా?” నమ్మలేనట్టడిగాడు.

“అలాంటిదేం లేదు సర్” అన్నాడు ఆర్ముగం.

“గ్రాండ్ రెస్టారెంట్ మీ స్టేషన్ పరిధిలోనేగా వుంది?” కామ్య అడిగింది.

“అవును మేడం”

“మరి మీకు కంప్లయింట్ యివ్వకుండా ఏం చేస్తున్నారు! అసలు యివ్వలేదా?”

“నో..నో.. యివ్వకుండా ఉండరు కామ్యా. ఇది చాలా ఇంపార్టెంట్ గదా. కేసు ఫైల్ గాకుండా మనవరకు రాదు”

“అది కరెక్టే. కాని ఇక్కడ వదిలి వేరే చోట ఇస్తే తీసుకోరుగా. రూల్స్ ప్రకారం కంప్లయింట్ యివ్వాల్సింది ఇక్కడే”

“అప్పుడప్పుడూ రూల్స్ బ్రేక్ అవుతూంటాయి. పెద్ద వాళ్ళ విషయం మీకు తెలీందేముంది. వేరే స్టేషన్లో ఇచ్చారేమో చూడండి” అన్నాడు ఎస్సై ఆర్ముగం. అతన్ని సమర్థించాడు విశ్వాస్.

“అవును కామ్యా! ఆలోచించు. నిషాంత్ నివాసం మైలాపూర్. అతడి బిజినెస్ ఆఫీస్ పరశువాక్కం. నా అనుమానం కరక్టయితే ఈ రెండు స్టేషన్లలో ఎక్కడో ఒకచోట కంప్లయింట్ ఇచ్చుండాలి” అన్నాడు.

“ఓకే ఆర్ముగం! ఫోన్ చేసి కనుక్కో మేం వచ్చామని చెప్పకు. ఫోన్ చెయ్”

“ఎస్ మేడం!”

ఆర్ముగం మైలాపూర్ పోలీస్‌స్టేషన్‌కి ఫోన్ చేసాడు. అక్కడ కంప్లయింట్ ఏదీ అందలేదని తెలిసింది. తర్వాత పరశువాక్కం పోలీస్‌స్టేషన్‌కి ఫోన్ చేసాడు. రిసీవర్ క్రెడిల్ చేసి ఇద్దర్నీ చూసాడు.

“మీ డౌటు కరక్ట్. పరుశవాక్కం పోలీస్‌స్టేషన్‌లో కంప్లయింట్ వుంది. ఎఫ్.ఐ. ఆర్. కూడ నమోదయింది”

Preview download free pdf of this Telugu book is available at Dabbulevariki Voorike Ravu 1
Comment(s) ...

The best novel and the best end.. part2 was awesome..👌👍

The author maintained the suspense well. look forward to Part2

Please upload the 2nd part also