• Madhyamavati
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మధ్యమావతి

    Madhyamavati

    Pages: 80
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

వసుంధర చీర మార్చుకుని ఇవతలికి వస్తూ అంది “ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదండీ!”

“అవును. చాలామంది వచ్చారు” అన్నాడు మోహన్‌రావు.

“అత్తయ్య చాలాసార్లు అనుకుంది మనమిద్దరం బాధ్యతగా ఏర్పాట్లన్నీ పర్యవేక్షించామని, లేకపోతే అంత బాగా జరిగేది కాదనీ.”

“ఆవిడది చాలా మంచి మనసు. మీ మామయ్య కూడా చాలా ఆత్మీయంగా, అభిమానంగా మాట్లాడతారు.”

“ఎప్పుడూ అంతే. మా రెండు కుటుంబాల మధ్య చెప్పుకోదగిన బంధుత్వం లేకపోయినా ఆయన మాతో చాలా అభిమానంగా ఉండేవాడు” వసుంధర చెబుతూ విశాలాక్షి తనకి పెట్టిన చీర పేకెట్టు విప్పింది. వెంటనే ఆమె భ్రుకుటి దగ్గరయి కళ్ళు వెడల్పయ్యాయి.

ఆమె చేతులలో నీలంరంగు చవకరకం వాయిల్ చీర వెలవెల బోతోంది. ఆమె భర్త దగ్గరకి ఆ చీర తెచ్చింది.

“ఇదేమిటి? అత్త నాకిలాంటి చీర పెట్టింది” ఆశ్చర్యం, అపనమ్మకం ధ్వనించాయామె స్వరంలో.

“ఎవరికోసమో కొన్న చీర పొరపాటున నీకు పెట్టారేమో” అన్నాడు మోహన్‌రావు.

చీర మడతలలో నుంచి తన పేరువున్న చీటీ జారి పడేసరికి ఆమె ముఖం కోపంతో ఎర్రబడిపోయింది.

“పొరపాటున కాదు. కావాలనే నాకు ఈ చీర పెట్టింది. ఈ చీర ఖరీదు వందరూపాయలు. ఇంట్లో పని చేసే వంట మనిషికి, పనిమనిషికి ఇంకా బయట వాళ్ళకెవరికైనా పెట్టవచ్చని ఇలాంటిదే పది చీరలు కొంది. బజారుకి సాయం రమ్మంటే నేనూ వెళ్లానుగా!”

“దగ్గర వాళ్ళందరికీ ఖరీదైన చీరలు పెడుతున్నారని మనం ఇచ్చే బహుమతి కూడా ఖరీదైనదే అయి ఉండాలని కదూ నాచేత ఎనిమిది వందలు ఖర్చు పెట్టించి వాళ్లిద్దరికీ బట్టలు కొనిపించావు” విసుగ్గా అన్నాడు.

“నాకేం తెల్సు? దగ్గర వాళ్ళందరికీ పెట్టాలని నాకెదురుగానే పాతిక చీరలు కొంది. 'అమ్మా వసుంధర’ అని ఆప్యాయత కురిపిస్తూ నాచేత బజారు పని దగ్గర నుంచి ఇల్లు సర్దడం వరకూ చేయిస్తే అదంతా ఆపేక్ష అనుకుని మురిసిపోయాను” వసుంధర ఉక్రోషంగా అంది.

“వంటమనిషికి, పనిమనిషికి పెట్టినట్లే ముతక చీర నా ముఖాన పడేసింది” ఆమె విసురుగా ఆ చీరని బీరువాలో పడేసి పడుకుంది.

ఆమెకి చక్రపాణి దంపతులకి ఎనిమిది వందలు ఖర్చు చేసి బట్టలు కొనడం గుర్తుకువస్తే మనసు మండిపోతోంది.

“పొరుగింటి అట్లకోసం నెయ్యి కాచుకున్నట్టయింది తన పరిస్థితి. ఈనెల ఇంకా పదిరోజులు గడిస్తేనే కానీ జీతం అందదు. ఎలా?”

ఆమె గుండె గుభేల్‌మంది.

Preview download free pdf of this Telugu book is available at Madhyamavati