• Telugu Chalana Chitralalo Hasyam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగు చలన చిత్రాలలో హాస్యం

    Telugu Chalana Chitralalo Hasyam

    Pages: 90
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శృంగార రసం తరువాత హాస్యరసమే ప్రధానమైనది అని పండితులు ఏనాటి నుంచో చెప్తూ వచ్చినా నాకెందుకో అది సరి అయినది కాదు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ప్రక్రియ తీసుకున్నా శృంగారం సులభం. హాస్యం కష్టసాధ్యం. శృంగారం వ్రాసిన కవులు, కథకులు కోకొల్లలుగా ఉంటే హాస్యం వ్రాసిన వారు అతి తక్కువ సంఖ్యలోనే ఉంటారు. అలాగే సినిమాలే తీసుకుంటే మనకి శృంగారం సునాయాసంగా అభినయించి హీరోలు అయిపోయిన వాళ్ళతో పోల్చి చూస్తే హాస్యాన్ని అభినయించి పండించిన వాళ్ళు తక్కువే. అలా తెలుగు సినిమాలలో ఆనాటి నుంచీ ఈనాటి వరకూ హాస్యాన్ని పండించి మనం మనసులకి హత్తుకుపోయిన నటీనటులు, ఆయా హాస్య సంఘటనలూ, సరదా పాటలూ, సంభాషణలూ ... ఒకటేమిటి తెలుగు చలనచిత్రాలలో హాస్యం గురించి ఇంత సమగ్రమైన పుస్తకం నేను ఇప్పటి దాకా చూడలేదు. అసలు ఇటువంటి పుస్తకం వ్రాద్దాం అనే ఆలోచనే చాలా మెచ్చుకోదగ్గది. అలా అని ఏదో ఆషామాషీగా అందరికీ తెలిసిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్పేసి భుజాలు ఎగరేసుకునే స్థాయికి ఈ పుస్తకం ఎంతో పై ఎత్తులో ఉంది.

ఈ అపురూపమైన, ఆసక్తికరమైన పుస్తకంలో నేను గమనించిన అంశాలు చాలానే ఉన్నాయి. ఈ పుస్తకంలో చరిత్ర ఉంది. ప్రముఖుల గురించి వివరాలతో పాటు వర్ధమాన హాస్య నటీనటుల కృషి కూడా మేళవించడం రచయిత చిత్తశుద్దికి నిదర్శనం. కేవలం ఆయా నటీనటుల గురించే కాక వారి వెనకాల హాస్య కారకులైన రచయితలు, దర్శకులు, నిర్మాతల గురించి సోదాహరణంగా చేసిన వివరణలు ఆకట్టుకున్నాయి. పుస్తకంలో అధ్యాయాల విభజన వరసగా చదవడానికి ఆసక్తికరంగా భలే బావుంది. ఫోటోలు సరి అయిన సంఖ్యలో సరి అయిన చోట నిక్షేపించడం పుస్తకం రూపకల్పన చేసిన వారి నిపుణతను తెలియజేస్తుంది. బహుశా అన్నింటికన్నా కష్టమైనదీ, చారిత్రక ప్రాధాన్యత కలదీ పుస్తకం ఆఖర్న ఇచ్చిన రెండు అనుబంధాలు.

మొత్తానికి “చలన చిత్రాలలో హాస్యం” అనే పుస్తకాన్ని ఎక్కడా ఆగకుండా ఒకే బిగిలో చదివి నేను నా చిన్నతనానికి వెళ్ళిపోయాను. అప్పటి నవ్వులు నన్ను ఇప్పుటికీ వెంటాడుతూనే ఉంటాయి. అందుకే హాస్యం అంటే చెవి కోసుకునే ప్రపంచవ్యాప్త తెలుగు చలన చిత్రాలలో హాస్యం అనే ఈ పరిశీలనాత్మక గ్రంథాన్ని వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి 75వ ప్రచురణగా అందిస్తున్నాం.

- వంగూరి చిట్టెన్ రాజు

Preview download free pdf of this Telugu book is available at Telugu Chalana Chitralalo Hasyam