• God Father
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గాడ్ ఫాదర్

    God Father

    Author:

    Pages: 266
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ అనుసృజనలో అడుగడుగునా మూర్తిగారి కంఠస్వరం వినిపిస్తుంది. ఆయన వ్యాఖ్యానం కనిపిస్తుంది. అయినా మూల రచనలోని పరిమళం మనకు అనుభవమవుతూనే వుంటుంది. ఇదేదో యధాలాపంగా లభించిన ఫలితం కాదు గాని, దీని వెనుక మూర్తిగారి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. పని తీరు ఉంది....

ప్రపంచ సాహిత్యాన్ని చదవాలని ఉండి కూడా అందుకు అవసరమైన సమయమో, ఓపికో, భాషా ప్రవేశమో లేనివారికి - ఇదిగో ఇలాంటి సృజనలు అపురూప అవకాశాలు.

- దాసరి అమరేంద్ర

మేరియో ఫ్యూజోని ఆధునిక ఆంగ్ల ఫిక్షన్ ప్రపంచంలో ఊహించని ఎత్తుకి చేర్చిన నవల The God Father, గత కొన్ని ఏళ్ళుగా ఈ నవలని అనేకమార్లు చదివాను. ఫ్యూజో పాత్రల్ని మలిచే తీరు, సన్నివేశాల్ని గొప్ప ఆకర్షణతో తీర్చిదిద్దే తీరు ఒక్కసారి చదివితే తనివితీరదు. ఎలాంటి వారూ ఆ భావ ప్రపంచంలోకి అలా వెళ్ళిపోవలసిందే.

గాడ్ ఫాదర్ నవలని తెలుగులోకి తీసుకురావడం వెనుక కొన్ని కారణాలున్నాయి. మన చుట్టూతా ఉన్న చాలామంది డాన్ అనే మాటని కేవలం ఒక కరుడు గట్టిన దొంగల నాయకునికి పర్యాయపదంగా వాడుతుంటారు. అలాగే గాడ్ ఫాదర్ అనే మాట కూడా..! Thoroughly misunderstood. ఈ నవల చదివిన తరవాతే నాకూ అర్థమైంది ఎట్టువంటి పరిణితి, ముందు చూపు, చాకచక్యం గల ఒక విజేతని ఉద్దేశించి అలాంటి పదాలు ఆ సంస్కృతి లో ఉద్భవించినవో..!

హాలీవుడ్‌లో గాడ్ ఫాదర్ నవల ఆధారంగా వచ్చిన సినిమా కనకవర్షం కురిపించడంతో దానికి కొన్ని సీక్వెల్స్ తీశారు. అయితే మొదటి సినిమా మొత్తం ఇంకా రెండవ సినిమాలో సగ భాగం మాత్రమే ఒరిజినల్ గాడ్ ఫాదర్ నవల ఆధారంగా తీసింది మిగతాదంతా ఆ పాత్రల్ని ఉపయోగించుకొని వేరే కధల్ని అల్లారు. సరే..ఆ సన్నివేశాలు కూడా బాగానే వచ్చినవి. నిజానికి మేరియో ఫ్యూజో ‘గాడ్ ఫాదర్’ నవలని తొమ్మిది బుక్స్‌గా, ముప్ఫై రెండు చాప్టర్లుగా ఇంకా అనేక సబ్ చాప్టర్లుగా విభజించి రాశారు. నేను మన తెలుగు పాఠకుల్ని దృష్టిలో పెట్టుకొని ఎనభై భాగాలుగా చేసుకొని అనువదించాను.

- మూర్తి కె.వి.వి.ఎస్

Preview download free pdf of this Telugu book is available at God Father