• Sarma Kalakshepam Kaburlu Naaku Nachchina Pelli
  • Ebook Hide Help
    ₹ 36
    40
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శర్మ కాలక్షేపం కబుర్లు - నాకు నచ్చిన పెళ్ళి

    Sarma Kalakshepam Kaburlu Naaku Nachchina Pelli

    Pages: 236
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒక సామాన్య మానవుడు (A simple human being) తన జీవిత విశేషాలు, అనుభవాలు, ఆలోచనలు ఇతరులతో పంచుకుంటే ఎలా ఉంటుంది? ఒక తాతగారు తన మనవలని దగ్గర కూచోబెట్టుకుని తన కథ చెప్పినట్టు ఉంటుంది. శర్మగారి కాలక్షేపం కబుర్లు అచ్చం అలాగే ఉంటాయి. మనకి అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది, మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు ఎలా జీవించారో, వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేదో? అని. దానికి కూడ సమాధానం ఈ కబుర్లు. మనలని టైం మెషిన్లో దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్ళి, అప్పటి సమాజాన్ని మన కళ్ళకి కట్టినట్టు చూపించారు. ఈ పుస్తకం నిండా ఉన్నవి కేవలం కాలక్షేపం కబుర్లు కాదు, శర్మ గారి దశాబ్దాల జీవన సారం. ప్రతి ఒక్కరి జీవితంలోను అన్ని రకాల అనుభవాలు ఉండవు. కొన్ని ఇతరుల నుంచే తెలుసుకోవాలి. అందుకే ఈ కబుర్లు చదివినప్పుడు ప్రపంచం అలా కూడ ఉండేదా? అని అనిపిస్తుంది.

ఈ భాగానికి శర్మగారు "నాకు నచ్చిన పెళ్ళి” అని శీర్షిక పెట్టి, ఆ అనుభవాన్ని ఒక కథగా వివరించారు. నిజానికి అది కథలానే ఉంది, కాని శర్మగారు వ్రాసారు కాబట్టి జరిగే ఉంటుంది. ఈ బ్లాగు పుస్తకంలో ముఖ్యంగా పెళ్ళి గురించి, పెళ్ళిలో జరిగే మొత్తం కార్యక్రమాల గురించి వివరంగా వ్రాస్తూనే మధ్య మధ్యలో శర్మగారు తన వివాహానికి సంబంధించి చాలా విశేషాలు పూసగుచ్చినట్టు వివరించారు. ఈ విషయాలన్నీ పెళ్ళీడుకొచ్చిన పిల్లల తల్లిదండ్రులకి బాగా ఉపయోగపడతాయి. అలాగే పెళ్ళయిన కొత్తలో భార్యాభర్తలు ఎలా మసలుకోవాలో తెలుసుకోవాలనుకునే యువదంపతులకి కావలసిన చిట్కాలు కూడ ఈ కబుర్లలో దొరుకుతాయి. అంతే కాకుండా ఈ భాగంలో రకరకాల వంటలు ఎలా చెయ్యాలో కూడ వ్రాసారు. వాటిలో ఈ రోజుల్లో మనం కనని, వినని కాయగూరల, పళ్ళ వివరాలు, పిండివంటలు, చిరుతిళ్ళు గురించి తెలుసుకోవచ్చు.

మనం శ్రీరమణగారి "మిథునం" కథ చదివాము, భరణిగారి సినిమా కూడ చూసాము. ఈ కబుర్లు చదివితే శ్రీ శర్మగారి జీవితం కూడ ఇంచుమించు అదే బాటలో నడిచినట్లు మనకి తెలుస్తుంది. తరచి చూస్తే మన చుట్టూ ఎన్నో మిథునాలు కనిపిస్తాయి. నోరు తెరిచి అడిగితే వాళ్ళు ఎన్నో కథలు చెప్తారు. మనం అడగకుండానే శర్మగారు తమ బ్లాగులో వందలాది కథలు టపాలుగా వ్రాసి ఇచ్చారు. ఎన్నో చిన్ని చిన్ని ప్రపంచాలని మనకు కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఒక తరహా విజ్ఞాన సర్వస్వాన్ని హాయిగా చదవండి. చదివి ఆనందించండి.

- బోనగిరి రావు

Preview download free pdf of this Telugu book is available at Sarma Kalakshepam Kaburlu Naaku Nachchina Pelli