• Failure Design - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ఫైల్యూర్ డిజైన్ (free)

    Failure Design - free

    Pages: 63
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఫైల్యూర్ డిజైన్... ఈ మాట ఏదో వింతగా లేదూ! కమల్ హాసన్ దశావతారం సినిమాలో దేవుడు లోకాన్ని చాలా కరెక్ట్‌గా డిజైన్ చేసేడు అని చూపెట్టబడింది. దేవుడు సునామీ అనే విధ్వంసాన్ని ఎందుకు సృష్టించాడంటే ప్రాణాంతకమైన బయోజీవులను నాశనం చేయటం కోసమే! మానవాళిని రక్షించుటకు, సునామీ ద్వారా కొందరిని బలిపెట్టడం తప్పులేదు.

ఇంతకీ మన విషయానికొస్తే, మనందరం ఫైల్యూర్‌ని ఎలా డిజైన్ చేసుకుంటామో అని వివరించడం నా ఉద్దేశం. మన యొక్క ఫైల్యూర్ డిజైన్ తెలుసుకొని మనం పొందే లాభం ఏమిటి? ఎవరైనా ఫైల్యూర్ అవడానికి ప్లాన్ చేసుకుంటారా? చాలా ఆశ్చర్యంగా లేదూ! లేదు. గజిబిజిగా ఉంది.

ఈ పుస్తకంలో ఇచ్చే అయిదారు ఉదాహరణలను చదివి అర్ధం చేసుకుని, దాని బట్టి ఎవరికి వారు తమ ప్రవర్తనను అంచనా వేసుకోవాలి. తమ జీవితాల్లో జరిగే అపజయాలు తమకి తాము డిజైన్ చేసుకున్నవా లేక వాస్తవంగా జరిగాయా అన్నది అంచనా వేసుకోవాలి. ఎవరైతే తమ జీవితాల్లోని అపజయాలను నూరు శాతం నిజాయితీతో అర్ధం చేసుకుంటారో వారి జీవితం సాఫీగా, ఆనందహేలగా, అనారోగ్యాలు లేకుండా ఉంటుంది. చుట్టూ ఉన్న వారికి, వీరి జీవితాలు చూడముచ్చటగా, అసూయగా ఉంటాయి. లేకపోతే బి.పి., షుగర్‌లు శంఖు, చక్రాల్లాగ మోస్తూ బ్రతకాలి.

ఫైల్యూర్ లేదా అపజయానికి వ్యతిరేకమే విజయం లేదా సక్సెస్. సాధారనంగా మనం ఏదైనా సాధిస్తే విజయంగా ప్రకటించుకుంటాం. అది ఎవరికి విజయం? నువ్వు ఏదైనా సాధిస్తే నీకు మాత్రమే విజయం. నాకు ఎలా విజయం అవుతుంది? కాబట్టి దాన్ని వ్యక్తిగత ఎదుగుదల (Individual Development) అని అంటారు. మరి సంపూర్ణ విజయం లేదా? ఉంది. ప్లేగు వ్యాధికి మందు కనుకున్న సైంటిస్టు యొక్క విజయం మొత్తం మానవాళిది. ఇంటర్నెట్ కనుకున్న వ్యక్తి యొక్క విజయం మానవాళిది. ఇటువంటి విజయాలని సంపూర్ణ విజయం లేదా విజయం అని అందాం. 99 శాతం ప్రజల జీవనం సాదా, సీదా జీవనం. వారి వ్యక్తిగత గమ్యాలు, వాటిని సాధించడానికి సల్పిన కృషి - విజయాలుగా ఎలా పేర్కొంటాం. వారి జీవితాలు మార్పు చెందడానికి, ఉన్నతం కావడానికి చేసిన ప్రయత్నాల యొక్క సత్పలితాలు. అంతేగాని అవి విజయాలుగా పేర్కొనలేం.

నేను డబ్బు సంపాదించడం, నేను ఇల్లు కట్టుకోవడం, నేను కారు కొనుక్కోవడం, నేను ప్రమోషన్ సంపాదించడం, నాకు మాత్రమే విజయాలు. ఇవి కూడా నేల బారు గమ్యాలే! జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలంటే, నిత్య నూతనంగా ఉండాలంటే కాలాన్ని అధిగమిస్తూ గడపాలి. అంటే కాలాన్ని తెలియకుండా గడపాలి. అంటే కాలక్షేపం అని కొందరు వక్రం చెబుతారు. కానీ అది నిజం కాదు. ఓ వారం రోజులు కాలక్షేపంగా ఏ పని చేయకుండా టీవీ చూస్తూ గడపండి.

చూద్దాం! చాలా టెన్షన్, నిస్సహాయత, చిరాకు వచ్చేస్తాయి. ఎనిమిదో రోజున పనిలో పడితే ముందు కాలక్షేపం చేసిన వారం రోజులూ చాలా బాగున్నాయని అనిపిస్తాయి. అంత మాత్రానా కాలక్షేపం హాయి కాదు. ఇంతకీ మనం చెప్పేదేమిటంటే కాలాన్ని అధికమిస్తూ గడపాలి. అంటే కాలాన్ని తెలియకుండా గడపాలి.

- రవికిషోర్ మల్లాప్రగడ