• Manishilo Manishi 1
  • Ebook Hide Help
    ₹ 60
    100
    40% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మనిషిలో మనిషి - 1

    Manishilo Manishi 1

    Publisher: Model Publications

    Pages: 259
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 2 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 2 premium votes.
Description

బొబ్బిలి రాజవంశానికి బంధువైన యువకుడొకడు కార్తికేయకు మిత్రుడు. కొంతకాలం కలిసి చదువుకున్నారు. అతని పేరు వికాస్‌చంద్ర. మూడు రోజులక్రితం జరిగిన అతడి వివాహానికి హాజరు కావటం కార్తికేయకు వీలుకాలేదు. ఈరోజు రిసెప్షన్. ఇప్పుడయినా రాకపోతే వూరుకోనంటూ ఫోన్ చేసి గొడవ చేసాడు. దాంతో బొబ్బిలి ప్రయాణంగాక తప్పలేదు కార్తికేయకు. అందుకే సంజనాను తీసుకుని బయలుదేరాడు.

ప్యాలెస్‌వంటి కళ్యాణ మండపంలో అద్భుతంగా రిసెప్షన్ ఏర్పాటు చేసారు. ఆహూతులు, ఫ్రెండ్స్‌తో సందడిగా వుంది అంతటా. తనతో చదివిన కొందరు మిత్రులుకూడ అక్కడ కన్పించటంతో కార్తికేయ ఆనందించాడు. అందరి దృష్టి చిలకాగోరువంకల్లావున్న కార్తికేయ, సంజనా జంటమీదే వుంది. ఇక వికాస్‌చంద్ర సంతోషానికి అవధిలేకుండా పోయింది.

“ఒకే కార్తీ! ఎవరు వచ్చినా రాకపోయినా నీ రాకతో ఈ రిసెప్షన్‌కే కళ వచ్చిందిరా” అంటూ కార్తికేయను కౌగిలించుకుని ఆనందాన్ని వ్యక్తం చేసాడు.

“ఇంతకీ నీ వెంటవచ్చిన కళ ఎవర్రా? కొంపదీసి ఎవరికీ చెప్పకుండానే పెళ్ళి చేసేసుకున్నావా?” అంటూ చెవిలో గుసగుసలాడి ఫక్కున నవ్వేసాడు.

“ఛఛ! ఎవరికీ చెప్పకుండా పెళ్ళా... అదేంలేదు. మా పెళ్ళికి కొంత టైంపడుతుంది. షీ ఈజ్ సంజనా.. నా లవర్. వుడ్‌బీ కూడా” అన్నాడు నవ్వుతూ కార్తికేయ. వికాస్‌చంద్ర తన భార్యకు ఇద్దరినీ పరిచయం చేసాడు.

అభినందించి గిఫ్ట్ అందించి వెంటనే తిరుగుప్రయాణం కావాలనుకున్నాడు కార్తికేయ. కాని వికాస్‌చంద్ర వదల్లేదు. రిసెప్షన్ ముగిసి పార్టీలో భోంచేసాకగాని కదలడానికి వీల్లేదంటూ పట్టుబట్టాడు. పార్టీలో రెండు పెగ్గులు స్కాచ్ తీసుకున్నాడు కార్తికేయ. ఆవిధంగా సంజనా, కార్తికేయలు భోంచేసి తిరుగుప్రయాణం అయ్యేసరికి రాత్రి ఎనిమిది గంటలయింది సమయం.

“ఒరే కార్తీ! నీకో విషయం తెలుసా?” సాగనంపటానికి జీప్ వరకు వచ్చిన వికాస్‌చంద్ర అడిగాడు.

“ఏ విషయంరా?” అడిగాడు కార్తికేయ.

“ఇప్పుడు నువ్వు ఏం జాబ్ చేస్తున్నావో నాకు తెలీదుగాని నీ పేరుమీద సైంటిస్ట్ ఒకడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైపోయాడు నీకు తెలుసా?”

“ఆ విన్నాను. పంచభూతాల్ని శుద్ధి చేస్తానంటూ ఏవో ప్రయోగాలు చేస్తున్నాట్ట. జర్నల్స్‌లోకూడ చదివాను. మిస్టర్ కార్తికేయ గురించేగా?”

“అవున్రా బాబూ! అసలు మనం చదువుకునే రోజుల్లోనే ఖచ్చితంగా నువ్వో సైంటిస్ట్ అవుతావనుకునేవాళ్ళం. ఇంతకీ ఇప్పుడేం చేస్తున్నావ్‌రా?”

“జీవితంలో ఎన్నో అనుకుంటాం. ఏదో చేయాలనుకుంటాం. అన్నీ జరుగుతాయా ఏమిట్రా! రాసిపెట్టుండాలి. ప్రస్తుతం పర్లాకిమిడి సంస్థానంలో ఏదో చిన్న ఉద్యోగం సంపాదించుకుని కాలక్షేపం చేస్తున్నాను. నువ్వయితే గోల్డెన్‌స్పూన్‌తో పుట్టావ్. నా పరిస్థితి వేరుగదా. ఏదో ఒక ఉద్యోగం బతకటానికి చేయాలిగదా”

“మరి సంజనా ఎవరు? చిన్న ఉద్యోగం చేస్తూ ఏంజిల్ వంటి అమ్మాయిని పట్టేసావ్! ఆ కిటుకేమిటో మాకూ చెప్పరా బాబూ. ఫాలో అయిపోతాం”

“ఇప్పుడా కిటుకులు నీకు అవసరమా? సంసారివి. కొత్త పెళ్ళికూతురు నీ మాటలు వింటే వెంటనే డైవర్స్ అంటుంది”

అంతా నవ్వుకున్నారు.

Preview download free pdf of this Telugu book is available at Manishilo Manishi 1
Comment(s) ...

The usual stuff of Suryadevara.
Begun well but too much deviation from the main plot