-
-
మాయాశిల్పం... మంత్రఖడ్గం
Maya Silpam Mantra Khadgam
Author: Vijayarke
Publisher: Manrobo Publications
Pages: 73Language: Telugu
1979 లో రాసిన నా తొలి జానపద నవల... అప్పుడు ప్రచురణలో నేను చూడలేకపోయిన నవల..
దాదాపు నలభయ్యేళ్ల తరువాత తిరిగి రాసిన నవల... మాయాశిల్పం... మంత్రఖడ్గం,
ఈ నలభయ్యేళ్ల కెరీర్లో ఎన్ని నవలలు రాసినా... జానపద నవల రాయలేకపోయాను...
సైన్స్ ఫిక్షన్ క్యూ.. థ్రిల్లర్ మేన్ రోబో, క్రైమ్, కామెడీ రొమాన్స్ హారర్, మానవసంబంధాలు... వ్యక్తిత్వ వికాసం, ఆటో బయో గ్రఫీ (జైలు గోడల మధ్య హీరో సుమన్) డెబ్భైకి పైగా నవలలు దాదాపు ఆరువందలపైగా కథలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, తెలుగు కన్నడ భాషల్లో వచ్చిన నా రచనలు.. మీ అభిమానానికి చిహ్నాలు.
అయితే నాకు ఇష్టమైన జానపద రచన నేను రాయలేదన్న అసంతృప్తి అలానే ఉండిపోయింది. నాలుగు దశాబ్దాలు వెనక్కి వేళ్తే ప్యాకెట్ సైజు చిన్న పిల్లల పుస్తకాలు బాలభారతి బుజ్జాయి వసంతబాల లాంటి సంస్థల నుంచి వచ్చే జానపద నవలలు ఉర్రూతలూగించిన కాలం. కత్తియుద్ధాలు, మాయలు మంత్రాలు, సాహసాలు.. రాజులూ అప్పటి ఆ వాతావరణం అద్భుతంగా
ఆ తరువాత జానపద నవలకు ఆదరణ తగ్గుతూ, ఫిక్షన్ క్రైమ్ తరువాత వ్యక్తిత్వ వికాసం ఇలా ట్రెండ్ మారుతూ వచ్చినా జానపద నవలల పరిమళం నా వెంటే వుంది.
నలభయ్యేళ్ళ క్రిందట... ఒక పబ్లిషర్ వచ్చాడు. మూడువందల రూపాయలకు నవల రాసే ఒప్పందం(ఇంకా అంతకు తక్కువే అనుకుంటా). అప్పుడు నవల వెల పావలా అర్థ రూపాయి అలా ఉంటూ వచ్చింది. నవలల అద్దె పది నయాపైసలు.
నవల నోట్ బుక్‌లో రాసిచ్చాక మళ్ళీ కనిపించని ప్రచురణకర్త.
కానీ ఆ నవల నాకు గుర్తు.. ఎందుకంటే నేను రాసిన నా తొలి జానపద నవల.
ఆ నవలపేరు "మాట్లాడే మాయాశిల్పం" అది ప్రచురిస్తానని తీసుకువెళ్ళిన పబ్లిషర్స్ నవల ప్రచురించలేదు.
ఆ నవలే ఇప్పడు కొన్ని మార్పులతో "మాయాశిల్పం... మంత్రఖడ్గం" పేరుతో మీ ముందుకు వచ్చింది.
విఠలాచార్య సినిమాలు ఎన్ఠీఆర్, కాంతారావులు జానపద కథానాయకులు.. రాజనాల, త్యాగరాజు, ముక్కామల, యస్వీఆర్ లాంటి ఉద్దండులు ప్రతినాయకులు.
బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లోనే జురాసిక్ పార్క్‌ను మించిన టెక్నాలజీ...
హైద్రాబాద్‌లో 1990 ప్రాంతంలో విద్యానగర్‌లో ఒక మాములు ఇంట్లో ఉన్న కాంతారావు గారిని సినిమా జర్నలిస్ట్‌గా కలిసాను. వ్యక్తిగతమైన ఇష్టం అభిమానంతో.
ఆ తరువాత అన్నపూర్ణ స్టూడియోలో.. రాజనాల గారిని కలిసాను. అప్పట్లో పిల్లాపెద్దాలను ఉర్రూతలూగించిన జానపద సినిమాల గురించి మాట్లాడుకున్నాము.
చిన్నపిల్లలు కాదు పెద్దలూ ఇష్టంగా చదివే జానపద నవలల ప్రాభవం మళ్ళీ మొదలైంది.
ఇందుకు ఒకరకంగా కినిగె కారణం.
రచయితలకు రాయల్టీ చెలిస్తూ ఇ-బుక్ ప్రపంచంలో ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది,
మేన్ రోబో పబ్లికేషన్స్ నుంచి వచ్చిన అయిదు జానపద నవలలు గత ఆరునెలలుగా టాప్ టెన్‌లో ఉంటూ జానపద నవలకు ఉన్న ఆదరణ చెబుతున్నాయి.
అలాగే ప్రముఖరచయిత అడపా చిరంజీవి జానపద నవల "పులిమీద పుట్ర" దాదాపు పన్నెండు వారాలు టాప్ టెన్‌లో నిలిచింది. ఎప్పటికప్పుడు నన్ను జానపద నవల రాయమని చెబుతూనే ఉండేవాడు.
మధుబాబు జానపద నవలలు ఒక రికార్డు.
జానపద నవలలు పిల్లలకే కాదు పెద్దలకూ మంచి ఆహ్లాదాన్ని, సాహసాలను అందిస్తాయి. ఆ కాలానికి తీసుకువెళ్తాయి.. అన్నది నా అభిప్రాయం .
- విజయార్కె
***
*”మా గంధర్వ యువరాణీవారు ఉద్యానవనంలో వుంది. .వెనక్కి వెళ్ళండి" అని భటులు చెప్పగానే మేఘాలు పక్కకు తప్పుకున్నాయి. చంద్రుడూ తప్పుకున్నాడు కొలనునీటిలో తన ప్రతిబింబం కనిపించకుండా..
*ఉద్యానవనంలో ఎవరో ప్రవేశించినట్టు మణిమేఘన మనసు కీడును శంకిస్తోంది.
కొలనులోకి అడుగుపెట్టడానికి మొసళ్ళు సైతం భయపడుతాయి. ...అయినా ఏమిటీ వైపరీత్యం
*అప్పుడే వెన్నెల భూమ్మీద పడుతోంది. చెట్ల మధ్యగా వచ్చిన వెన్నెల వెలుగు మాయాశిల్పం మీద ప్రసరించింది. మరుక్షణం పెద్ద వెలుగు.... మాయాశిల్పం మణిమేఘనగా మారింది. చుట్టూ చూసింది. తనకు తానెవరో జ్ఞప్తికి రావడం లేదు.
*నేనెవరిని? మీరెవరు? అని ప్రశ్నంచింది మణిమేఘనగా మారిన మాయాశిల్పం
ప్రముఖరచయిత విజయార్కె జానపద నవల
మాయాశిల్పం... మంత్రఖడ్గం
మేన్ రోబో పబ్లికేషన్స్ ప్రతిష్టాత్మక ప్రచురణ.
*”మా గంధర్వ యువరాణీవారు ఉద్యానవనంలో వుంది. .వెనక్కి వెళ్ళండి" అని భటులు చెప్పగానే మేఘాలు పక్కకు తప్పుకున్నాయి.
కళ్ళ ముందు మేఘాలు కన్పించాయి.గంధర్వలోకానికి తీసుకువెళ్లాయి.ఆహ్లాదాల వర్షాన్ని కురిపించాయి.
వావ్...చాలా చాలా అద్భుతమైన జానపద నవల ,పదిపైసల అద్దెతో నేను చిన్నప్పుడు చదివిన జానపద నవలలు .ఇప్పుడు గుర్తుకు తెచ్చిన విజయార్కె గారి " మాయాశిల్పం-మంత్రఖడ్గం " .
సర్ మీ నుంచి మరిన్ని జానపద నవలలు రావాలి.
after a long time, read so amusing folk story. Happy waiting many more to come in this genre.
ఒక సన్నివేశాన్ని సృష్టించి పాఠకులకు పాత్రలను కథ తాలూకూ ఉత్కంఠను కథనం ద్వారా చెప్పించే గొప్ప ప్రయత్నం.గంధర్వకన్య కోసం మేఘాలు పక్కకు తప్పుకోవడం అనే ఆలోచన అద్భుతం
" నేనెవరిని ? మీరెవరు ? " అని గంధర్వకన్య అమాయకంగా అడిగినతీరు మనసుతలపులను తట్టేలా వుంది.
విజయసింహుడి సాహసాలు కాళ్ళ ముందు దృశ్యాలుగా కనిపిస్తున్నాయి.
మీ కలం నుంచి మరిన్ని జానపద రచనలు రావాలి.
నేను బాల్యంలోకి వెళ్లి చదివాను.మళ్ళీ వర్తమానంలోకి వచ్చి చదివాను.మేఘాలు తప్పుకోవడం,సింహం మీద పిల్లాడు స్వారీ చేయడం,కొలనులో గంధర్వకన్య జలకాలాడుతుందని చంద్రుడు తప్పుకోవడం..అద్భుతమైన మ్యాజిక్ ...
మాయాశిల్పం మంత్రఖడ్గం అద్భుతమైన జానపదనవల. మనసును కట్టిపడేసే పదప్రయోగజాలంతో మంత్రముగ్దులను చేస్తూ ఆమూలాగ్రం ఆసాంతం విడవకుండా ఏకబిగిన చదివించే నవల. కనుమరుగైన జానపద నవలలకు పూర్వప్రాభవం కలిగించడంలో తొలిస్థానం ఆక్రమించుకుంది మాయాశిల్పం మంత్రఖడ్గం.
ఇలాంటి అపూర్వమైన జానపద నవలలు మరెన్నో విజయార్కె గారి కలం నుండి జాలువారి పాఠకులను జానపదనవలలలో విహరింపచేయాలని కోరుకుంటున్నాను.
చాలా చాలా బావుంది.ముఖ్యంగా వెన్నెల్లో మాయాశిల్పం మణిమేఘనగా మారు యువరాజును " నేనెవరు ?మీరెవరు ?అని ప్రశ్నించిన తీరు...కొలనులో కనిపించే చంద్రుడు పక్కకు తప్పుకోవడం...సాహసాలు..రచయిత చెప్పినట్టు సరికొత్త జానపద కాలానికి పాఠకులను తీసుకువెళ్ళిన నవల.
*”మా గంధర్వ యువరాణీవారు ఉద్యానవనంలో వుంది. .వెనక్కి వెళ్ళండి" అని భటులు చెప్పగానే మేఘాలు పక్కకు తప్పుకున్నాయి. చంద్రుడూ తప్పుకున్నాడు కొలనునీటిలో తన ప్రతిబింబం కనిపించకుండా..
*ఉద్యానవనంలోకి ఎవరో ప్రవేశించినట్టు మణిమేఘన మనసు కీడును శంకిస్తోంది.
కొలనులోకి అడుగుపెట్టడానికి మొసళ్ళు సైతం భయపడుతాయి. ...అయినా ఏమిటీ వైపరీత్యం
*అప్పుడే వెన్నెల భూమ్మీద పడుతోంది. చెట్ల మధ్యగా వచ్చిన వెన్నెల వెలుగు మాయాశిల్పం మీద ప్రసరించింది. మరుక్షణం పెద్ద వెలుగు.... మాయాశిల్పం మణిమేఘనగా మారింది. చుట్టూ చూసింది. తనకు తానెవరో జ్ఞప్తికి రావడం లేదు.
*నేనెవరిని? మీరెవరు? అని ప్రశ్నంచింది మణిమేఘనగా మారిన మాయాశిల్పం
ప్రముఖరచయిత విజయార్కె జానపద నవల
మాయాశిల్పం... మంత్రఖడ్గం
చదవడం మొదలుపెడితే చివరివరకూ చదివించే నవల
కొద్ది సమయాన్ని వెచ్చించి ఈ నవల చదవండి.గంధర్వలోకం ఉజ్వలసామ్రాజ్యం అడవులు మాట్లాడే సింహం..మాటవిని తప్పుకునే మేఘాలు. .అన్నీ చూసేయండి..చదువుతూ...
విజయార్కె గారి నవలలు విభిన్నం..వినూత్నం...అది జానపదం అయినా కామెడీ( నవ్వు దేవుడొచ్చాడోచ్ , బూచాడమ్మా బూచాడు ) అయినా,హారర్ ( టక్ టక్ టక్ ) రొమాన్స్ ( గుడ్ నైట్ స్టోరీస్ , క్యాండిల్ లైట్ శోభనం ) క్రైమ్ (టార్గెట్ ...789 ) సైన్స్ ఫిక్షన్
( క్యూ.మేన్ రోబో ) అయినా...మళ్ళీ మళ్ళీ చదవాలని అనిపించే శైలి .
నాకు బాగా నచ్చిన నవల.చిన్నప్పటిరోజులు గుర్తుచేసుకుని చదివాను..అద్భుతమైన రచనాశైలి.
" అప్పుడు నవల వెల పావలా అర్థ రూపాయి అలా ఉంటూ వచ్చింది. నవలల అద్దె పది నయాపైసలు "
ఇది నిజం .మా అమ్మ చెబుతూ ఉండేది.మొన్నటివరకూ ఆ పుస్తకాలు ఉండేవి.మళ్ళీ చాలా కాలానికి ఒక మంచి నవల చదివాను.
మేఘాలతో మాట్లాడించడం,చంద్రుడు పక్కకు తప్పుకునేలా చేయడం చాలా బావుంది.ముఖ్యంగా మీరు కాంతారావు గారి గురించి చెప్పడం మనసును హత్తుకుంది సర్ ...
జానపద నవలలు రచయితలను వ్రేళ్లమీద లెక్కించవచ్చు.భాషమీద పట్టు.జానపద నవలాశైలి,వున్న ప్రముఖరచయితలు కొందరే,ఒకప్పుడు జానపద నవలలు మార్కెట్ లోకి వేస్తె పండుగే.అల్లావుద్దీన్ కథలు అరేబియన్ నైట్స్,పేదరాసిపెద్దమ్మ కథలు ..
ఎన్నిసార్లు చదివామో..పిల్లలుగా వున్నప్పుడు మేము చదివాం.ఇప్పుడు మా పిల్లలకు ..మాకూ...అలాంటి జానపద నవలలు కావాలి.
మాయాశిల్పం ..మంత్రఖడ్గం చదువుతుంటే ఒక్కసాగా ముప్పయ్యేళ్ళు వెనక్కి వెళ్ళాను.అద్భుతమైన శైలి.
నా చిన్నప్పుడే విజయార్కె గారి రచనలు చాలా చదివాను.కానీ జానపద నవల తొలిసారిగా చదువుతున్నాను.
మాకోసం మీరు మరిన్ని జానపద నవలలు రాయాలని కోరుకుంటున్నాం .