• Telugu Logili
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగు లోగిలి

    Telugu Logili

    Publisher: Shaili Publications

    Pages: 56
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సాహిత్యం ఒక మహా వనమైతే, అందులో తెలుగు సాహిత్యం కల్పవృక్షం వంటిది. ఆ కల్పవృక్షమందించే అమృత ఫలమే బాల సాహిత్యం. అటువంటి తెలుగు బాల సాహిత్య ఫలాలు మరెన్నో కల్పవృక్షాలను అందించే ఉత్తమ తెలుగు భాషా వేత్తలుగానూ, మాతృభాషాభిమానులుగాను తయారు కావాలన్నది నా చిరకాల వాంఛ. అది నేటి సమాజంలో ప్రతి తల్లిదండ్రులు, కవులు, ఉపాధ్యాయులు కూడా దృష్టిలో ఉంచుకొని, నేటి పిల్లల్లో ఏ విధంగా తెలుగు భాషను చొప్పించాలి, వాళ్ళకు సదవగాహన కలిగించాలి అనే విషయాన్ని ప్రధానంగా తీసుకొని బాలసాహిత్యాన్ని పిల్లల వరకు తీసుకువెళ్ళాలి. భాషా మాధుర్యాన్ని వాళ్ళకు అందించాలి. “హితేన సహితే సాహిత్యం” సమాజానికి మంచినే కూర్చేది సాహిత్యం.

అందుకే నేటి తెలుగు పిల్లలు ‘కష్టం’ అనకుండా ఇష్టంగాను, సులభంగానూ చదివి నేర్చుకోగలిగే విధంగా ఈ పుస్తకంలోని గేయాలన్నీ వ్రాయబడ్డాయి. కేవలం అక్షరజ్ఞానం కలిగి, గుణింతాలు క్షుణ్ణంగా నేర్వగానే పిల్లలు ఇందులోని గేయాల్ని చదువగలరని నా అభిప్రాయం.

ఎందుకంటే... ఇందులోని ఏ ఒక్క గేయంలోనూ ద్విత్వాక్షరాలుగాని, సంయుక్తాక్షరాలుగాని ప్రయోగించబడలేదు. అందుకే వీటిని “ఒత్తులు లేని బాలగేయాలు'గా అభివర్ణించడమయింది.

- స్వరాజ్యం వెంకట రమణమ్మ కొల్లూరు

Preview download free pdf of this Telugu book is available at Telugu Logili