• Ataveladilo America
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆటవెలదిలో అమెరికా

    Ataveladilo America

    Pages: 31
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"ఆటవెలదిలో అమెరికా" అను పద్య కావ్యాన్ని ప్రముఖ కవి సబ్బని లక్ష్మీనారాయణ తన అమెరికా దేశ పర్యటన అనుభవములతో రచించారు.. ఇదువరకు వారు అమెరికా పర్యటన అనుభవాలతో ఒక యాత్ర చరిత్ర పుస్తకాన్ని , ఒక నానీల పుస్తకాన్ని కూడా రాశారు. ఇది వారి మూడవ పుస్తకము ముచ్చటగా అమెరికాపై. అమెరికా దేశముపై హృద్యమైన వారి పద్యాలు చూడండి.


ఆట వెలది లోన అమెరికా కథరాసి
తేటతెల్ల పరుతు తెలుగులోన
అగ్రరాజ్య మదియు అన్ని రంగాలలో
ఉజ్జ్వలమ్ము చూడు ఉర్వి మీద !


జాతులన్ని అచట రీతితో అలరారు
మతములన్ని యచట మసలి యుండు
దేశ రక్షణమ్ము దీటైన పాలన
క్రమము శిక్షణకదియు క్రతువు చూడు


అమెరికనెడు దేశ మందరి దదియును
అద్భుతమ్ము లెన్నొ ఆలకింప
సుందరమ్ము మనకు సుస్వాగతమనును
అందమైన దేశ మదియ చూడు !


ఇండ్లు చూడ నిచట ఇంపుగా నుండును
చెక్క తోడనైన చక్కగాను
నాణ్యమైన పనియు నవ్య రీతి తోడ
వాస యోగ్య మవియు వాసిగాను !


మట్టి మనుషులు ఇచట మానవాళి ఇచట
అన్ని దేశములును అమరినట్టు
వివిధ జాతులిచట వివిధ మతములును
విశ్వ జనుల భూమి విశదముగను !

అమెరికా గురించి తెలుసుకోదలచిన వారు, తెలిసిన వారు, కూడా ముచ్చటగా చదువుకోదగ్గ పుస్తకం ఇది.

Preview download free pdf of this Telugu book is available at Ataveladilo America