• Teeyani Mosam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తీయని మోసం

    Teeyani Mosam

    Pages: 195
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 premium votes.
Description


హాల్లో ఆపకుండా ఫోన్ రింగ్ అవుతూంటే పెరట్లో మొక్కలకి నీరు పెడుతున్న సలిల పరుగెత్తుకొచ్చింది కంగారుగా..
"ఇప్పుడేగా అమ్మవాళ్లతో మాట్లాడి ఫోన్ పెట్టింది... అంతలోనే ఎవరూ!'' విసుగ్గా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది.
''హలో... సలిల స్పీకింగ్…” అంది కాస్త చిరాగ్గా.
“మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి…” అవతల నుండి గంభీరంగా పలికిందో స్వరం...
అది పూర్తిగా అపరిచితమైన కంఠస్వరం.
''నాతోనా! ఇంతకీ మీరెవరో తెలుసుకోవచ్చా?” మర్యాదగా అడిగింది సలిల.
అవతల వ్యక్తి గలగల నవ్వి "అది మీకనవసరం... మీకు నేను చెప్పే రహస్యంతోటే సంబంధం... నా గురించిన వివరాలు అప్రస్తుతం'' అన్నాడు.
"రహస్యమా! ఏమిటి మీరంటున్నది?” విస్మయంగా అడిగింది సలిల.
“అవును... రహస్యమే... కిరణ్... అదే మీ పతిదేవులుంగారు... ఆయనకి సంబంధించిన సీక్రెట్ ఒకటి చెప్దామని...'' మళ్లీ నవ్వాడు అతను.
"నా భర్తకి, నాకు నడుమ ఎటువంటి రహస్యాలూ లేవు... ఆయన గురించి నాకు బాగా తెలుసు...'' గర్వంగా చెప్పింది సలిల..
"నీ భర్త మీద నువ్వేర్పరచుకున్న నమ్మకానికి హ్యాట్సాఫ్... కానీ నీ భర్త నిన్ను మోసం చేస్తున్నాడు..." పలికింది ఆ స్వరం.
''నేవ్వర్... ఆయనెన్నటికీ నన్ను మోసం చేయరు... చేయలేరు...” దృఢంగా అంది సలిల.
"అలా అనుకోవడం నీ అమాయకత్వం... అంతదాకా ఎందుకు... అతడొక కాలేజ్ లెక్చరర్ అని నీతో చెప్పాడు అవునా!''
"అవును... ఆయన సిద్ధార్థ కాలేజ్లో మ్యాథ్స్ లెక్చరర్... అది నాకు బాగా తెలుసు..." అంది సలిల..
''అక్కడే నువ్వు పప్పులో... సారీ తప్పులో కాలేశావు... కిరణ్ లెక్చరర్ కానే కాదు..." "మరి!'' ఆతృత ఆపుకోలేకపోయింది సలిల.
"అమ్మా! అప్పుడే అన్ని వివరాలు చెప్పేస్తే మజా ఏముంటుంది? తరువాయి భాగం కొద్ది రోజుల్లో..." నవ్వేసి ఫోన్ పెట్టేశాడవతల వ్యక్తి.
సలిల ఆలోచనలో పడింది. ఎవరీ అపరిచితుడు? కిరణ్ తనను మోసం చేశాడంటాడేమిటి? తన కిరణ్... తనంటే ప్రాణిమిచ్చే కిరణ్ తనను వంచిస్తాడా!?
నో... ఎన్నటికీ కాదు... ఎవరో పేరు, ఊరు తెలియని మనిషి ఫోన్ చేస్తే కిరణ్ గురించి అవాకులు చవాకులు పేలితే తాను వాటిని నమ్మడమంత అవివేకం మరొకటి ఉండదు.
తను కిరణ్ ని శంకించడమంటూ జరిగితే అది తనను తాను అవమానించుకోవడమే...
కిరణ్ లాంటి ప్రేమికుడు దొరకడం తన అదృష్టం. ఎవరో చెప్పిన గాలి కబుర్లను ఆధారంగా తీసుకొని అతడిని అవమానిస్తే తను ప్రేమసౌధం బీటలువారే ప్రమాదముంది.
ఇలాంటి కబుర్లని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయాలి.
ఈ ఆలోచన రాగానే స్థిమితపడింది సలిల మనసు. కిరణ్ గురించి ఆ అజ్ఞాత వ్యక్తి అన్న మాటలను మరచిపోయింది వెంటనే.

Preview download free pdf of this Telugu book is available at Teeyani Mosam