• Sri Guru Charitra Parayana Granthamu
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ గురుచరిత్ర - పారాయణ గ్రంథము

    Sri Guru Charitra Parayana Granthamu

    Publisher: Janani Publications

    Pages: 104
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ముందుగా చెప్పుకోవలసినమాట. ఈ పుస్తకం చిన్నది. ఇందులో చిన్నతనమేమీ లేదు. పేజీలు ఎప్పుడయిపోతాయా అని పరుగెత్తుతూ పారాయణం చేయనక్కర్లేదు. నెలలు నిండిన స్త్రీ నీటికుండతో అశ్వత ప్రదక్షిణలు చేసినట్లు తొందరలేని మనసుతో చదువుకోవచ్చు. గురుచరిత్ర లఘుచరిత్రగా వ్రాయడంలో ఉద్దేశ్యం అదే.

ఇక గ్రంథచరిత్ర. గురుచరిత్రను మరాఠీభాషలో సరస్వతీ గంగాధరుడు అనే యోగి ఓవీలనే పద్యాలలో రచించాడు. దానిని దత్తావతారమని చెప్పబడుతున్న శ్రీవాసుదేవానంద సరస్వతి సంస్కృతంలో శ్లోకాలుగా అనువదించాడు. ఆయనే దానిని సంక్షేపించి “ద్వీసాహస్రి” అనే పేరుతో సంస్కృత శ్లోకాలలో వ్రాశాడు. వీటన్నిటికీ ముందు ఒక “లఘుచరిత్ర' (707 శ్లోకాలతో) ఉన్నట్టు “శ్రీదత్త స్తవరాజము” లో ప్రస్తావించబడి ఉంది. కాని దీనిని ఎవరు ఎప్పుడు వ్రాశారో తెలియదు. తెలుగులో గురుచరిత్రలోని కథలను కొందరు వ్రాసి ఉన్నారు. వాటిలో శ్రీ ఇసుకపల్లి సంజీవశర్మగారు వ్రాసిన “గురులీలామృతము” వ్యాప్తి పొందినది.

గురుచరిత్రను లఘువుగానైనా వ్రాయగల యోగ్యత ఎంతమాత్రము లేనివాడిని. యోగ్యత ఉండి వ్రాసినదికాదు. ఫలమాశించి వ్రాసినది కూడా కాదు. పొందిన ఫలానికి కృతజ్ఞతతో వ్రాసినది. పుస్తకం వ్రాసినతరువాత రచయిత కూడా పాఠకుడే. ఫలమేదైనా ఉంటే రచయితగా కాదు, పాఠకుడిగా మీలో ఒకడిగా మీతో పంచుకుంటాను.

బిందుమాత్ర గురుచరిత మననంలో మహాసింధువై మునకలువేసే వారికి మళ్ళీ జననమనే జలగండం తప్పించగలదు. శ్రద్ద భవసాగరాన్ని అనుభవానంద సాగరంగా మార్చివేయగలదు. అందులో మునిగిపోవడం ఉండదు. ఆ సుధాబ్దిలో సదా మునిగి ఉండడమే.

- మూర్తి

Preview download free pdf of this Telugu book is available at Sri Guru Charitra Parayana Granthamu