• Bhagavadramanuja Mahima
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భగవద్రామానుజ మహిమ

    Bhagavadramanuja Mahima

    Publisher: Victory Publishers

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అలనాడు నాస్తిక మతాలు మన భారతదేశంలో విస్తరించి ప్రజల మనస్సులను పాడు చేయడమేగాక, ప్రజల మనస్సులు వక్రమైన రీతిలో చింతించునట్లు చేసి, సంఘంలో అల్లకల్లోలం సృష్టించి, మత వైరుధ్యం పెంచి, దేశంలో శాంతి భద్రతలు కొరవడునట్లు చేసిన సమయంలో భగవద్రామానుజుల వారు ధర్మ సంస్థాపనకై అవతరించారు. ముక్తికి సుళువైన మార్గం భక్తియేనని పామరులకు సైతం ప్రబోధించి, శ్రీ వైష్ణవ సత్సంప్రదాయం దేశం నలుమూలలా విస్తరింపచేసి, ప్రజలు శాంతియుత సహజీవనం గడపడానికి ఎనలేని కృషి సలిపి, దేశం శాంతియుతంగా వర్ధిల్లడానికి దోహదం చేసి, కళలను అభివృద్ధిపరచి, భగవద్భక్తి సలపడానికి అందరికీ (తరతమ భేదములు లేక) అర్హత ఉందని నిర్ధారించి, భారతదేశం సకలైశ్వర్యాలతో విలసిల్లడానికి అనేక విధాల ఉద్యమించి శ్రీరామానుజుల వారు సఫలీకృతులయ్యారు.

ఆ మహనీయుని ప్రధాన శిష్యులలో తిరువరంగత్తముదనార్ అనబడు శ్రీరంగామృతుడు అగ్రగణ్యుడు. శ్రీ రామానుజుల వారి నామాన్ని ప్రతి పాశురంలోనూ కీర్తిస్తూ, సాయించిన పాశురాల సంకలనం “శ్రీ రామానుజ నూట్రన్దాది' ప్రబంధం.

ఇందులో శ్రీ రామానుజులవారి విశిష్ట వ్యక్తిత్వాన్ని, పాండిత్యాన్ని, దయాగుణాన్ని, భక్తుల/ శిష్యులపైని ప్రీతిని, శ్రీరంగనాథస్వామిపై ఆ మహనీయుడు ప్రదర్శించిన అపార భక్తిని విలక్షణమైన రీతిలో పొందికగా, చక్కని పదజాలంతో, శబ్దార్థాలను చక్కగా సమన్వయం చేసి, శ్రీ రామానుజుల వారిని మనముందు సాక్షాత్కరింప చేసారీ “రామానుజ నూట్రన్దాది” ప్రబంధం ద్వారా, తిరువరంగత్తముదనార్.

- పసుమర్తి బద్రీనాథ్

Preview download free pdf of this Telugu book is available at Bhagavadramanuja Mahima