• Srimadandhra Mahabharatamu
  • Ebook Hide Help
    ₹ 648
    720
    10% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీమదాంధ్ర మహాభారతము

    Srimadandhra Mahabharatamu

    Pages: 1825
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది శ్రీమదాంధ్ర మహాభారతము రెండు భాగాలు కలిపిన సంపుటి

పంచమ వేదంగా, భారతీయ విజ్ఞాన సర్వస్వంగా పరిగణించబడే భారత ఇతిహాసమైన మహాభారతం ప్రపంచంలోని అతిపెద్ద కావ్యంగా అలరారుచున్నది. భారతీయ విజ్ఞాన సర్వస్వమైన వేదాలలోని పరమార్థాన్నంతా ప్రతిపాదించే పంచమవేదంగా భారతాన్ని నిర్మించి వైదిక సంస్కృతిని శాశ్వతంగా నిలిపారు వ్యాస మహర్షి. పద్దెనిమిది పర్వాలలో, లక్ష శ్లోకాలలో అలరారే ఈ మహాకావ్యాన్ని 14వ శతాబ్దంలో కవిత్రయంగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రనలు తెలుగులోకి అనువదించారు. హిందువులకు పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, విష్ణుసహస్రనామ స్తోత్రము కూడా మహాభారతంలోని భాగాలే.

‘యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచిత్' - ఈ కావ్యంలో ఉన్నది ఎక్కడైనా ఉంది. ఈ కావ్యంలో లేనిది ఎక్కడా లేదు. కానీ భారతంలోలేని అంశం మరెక్కడా ఉండదని ఘంటాపథంగా చెప్పడంచేత ఈ కావ్యం యొక్క విశిష్టత మరింత ఇనుమడించింది. అందుకే ఈ మహాభారతం భారతీయ విజ్ఞానానికి, సంస్కృతికీ కల్పవృక్షం అయింది.

ఇక ఈ మహాభారత కావ్యంలో పాండవులను ధార్మిక, సాత్త్విక గుణాలతో కూడిన దైవీశక్తులతోను; కౌరవులను అధార్మిక, రాజస, తామస గుణాలతో కూడిన ఆసురీ శక్తులతోను పోల్చడం జరిగింది. ఈ రెండు రకాల అంటే దైవీ, ఆసురీ శక్తుల నడుమ జరిగిన సంఘర్షణయే కురుక్షేత్ర సంగ్రామం. ధర్మమార్గం అనుసరించేవారికి జయాన్ని చేకూర్చి అధర్మమార్గంలో పయనించేవారిని అంతమొందించే అవతారపురుషుడు, జగద్గురువుగా కీర్తించబడ్డాడు శ్రీకృష్ణుడు.

ఈ మహాకావ్యాన్ని వచనరూపంలో రెండు సంపుటాలలో అందించిన పరిష్కర్త శ్రీ చిలుకూరు వెంకటేశ్వర్లు గారు పాఠకులకు సుపరిచితులే. మొదటి సంపుటంలో ఆదిపర్వం, సభాపర్వం, అరణ్యపర్వం, విరాటపర్వం, ఉద్యోగ పర్వం, భీష్మపర్వం పొందుపరచబడ్డాయి. రెండవ సంపుటంలో ద్రోణ పర్వము, కర్ణ పర్వము, శల్య పర్వము, సౌప్తిక పర్వము, స్త్రీ పర్వము, శాంతి పర్వము, అనుశాసనిక పర్వము, అశ్వమేధ పర్వము, ఆశ్రమవాస పర్వము, మౌసల పర్వము, మహాప్రస్థానిక పర్వము, స్వర్గారోహణ పర్వము పొందుపరచబడ్డాయి. సులభశైలిలో ఉన్న ఈ గ్రంథం యొక్క అధ్యయనం వల్ల పాఠకులు స్ఫూర్తిని పొందగలరని ఆశిస్తున్నాం.

- ప్రకాశకులు

గమనిక: " శ్రీమదాంధ్ర మహాభారతము " ఈబుక్ సైజు 6mb

Preview download free pdf of this Telugu book is available at Srimadandhra Mahabharatamu
Comment(s) ...

Please provide rent option. Is it's the decision of Ramakrishna Math or Kinige not to provide rent option. If rent option is enabled number of readers can access and enjoy the book of hindu culture. Sorry to say this.