• Sneham Nerpina Prema
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 67.50
    75
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్నేహం నేర్పిన ప్రేమ

    Sneham Nerpina Prema

    Author:

    Publisher: Shaili Publications

    Pages: 177
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కొన్ని రోజులు పోయాక అయినా చంప సుదీప్‌ని వదులుతుందనుకుంటే అస్సలు వదల్లేదు. రోజు ఏదో విధంగా మాట్లాడుతూనే ఉంది, కాని సుదీప్ తననించి పారిపోవాలన్నట్లు పారిపోతూనే ఉన్నాడు. అప్పుడప్పుడూ కోప్పడుతున్నాడు కూడా. ఒకరోజు నేను సుదీప్ పక్కన ఉండగానే చంప వచ్చింది. వీడు 'మళ్ళీ వచ్చిందిరా బాబు' అంటూ తల కొట్టుకుంటున్నాడు. చంప ఏదేదో మాట్లాడేస్తుంది.
"దేవుడు! నాకు మాట ఎందుకిచ్చాడో తెలుసా! నీతో మాట్లాడమని, నాకు చేయి ఎందుకిచ్చాడో తెలుసా! నీ చేతిని అందుకోమని, చెవులెందుకిచ్చాడో తెలుసా! నీ మాటలు వినాలని, కళ్ళు ఎందుకిచ్చాడో తెలుసా! నిన్ను చూస్తూ బ్రతికేయమని"
ఆ మాటలు పూర్తవకుండానే...
“స్పెక్ట్స్ ఎందుకిచ్చాడు? నన్ను చూడ్డానికి రెండు కళ్ళు చాలవనా" అన్నాడు సుదీప్. “ఇవి దేవుడివ్వలేదు డాక్టర్ ఇచ్చాడు" అంది అమాయకంగా
దీన్ని వదిలించుకోవడం కష్టంరా బాబు అనుకున్నాడు. సుదీప్ పక్కనే ఉన్న నాకు నవ్వాగలేదు.
“నేను స్పెక్ట్స్ పెట్టుకోవడం నీకు నచ్చలేదా సుదీప్, కావాలంటే చెప్పు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటా, నన్ను లవ్ చేస్తావా”
సుదీప్ కి కూడా నవ్వొస్తుంది కాని దాన్ని పెదాల మాటునే దాచేస్తున్నాడు. రాని కోపాన్ని ముఖానికి పెట్టుకుని చంప వైపు చూస్తున్నాడు.
“నీకోసం ఏదైనా చేస్తాను సుదీప్! నువ్వంటే నాకంత ప్రేమ"
ఎన్ని సార్లు చెప్తున్నా విననందుకు ఈసారి సుదీప్ కి నిజంగానే కోపం వచ్చింది.
“ఒసేవ్ పిచ్చి మొహమా! దీన్ని ప్రేమ అనరు పిచ్చి అంటారు నీకర్ధం కావట్లేదు ఆ విషయం "
“అయ్యో సుదీప్! నీకు తెలీదా.... ప్రేమ, పిచ్చి రెండూ ఒక్కటే. ఇవి ఉన్న వారికి ప్రపంచంతో పనిలేదు, వాళ్ళేమనుకుంటే అదే చేయొచ్చు”
తన మాటల్లోనే అర్ధం అవుతుంది ఆమె ఎంత మొండిదో, చివరికి సహనం కోల్పోయిన సుదీప్
“నేను నువ్వనుకునేంత మంచోడ్ని ఏం కాదు, నా గతం నీకు తెలీదు నన్నొదిలేయ్"
“నువ్వు మంచోడివో కాదో చెప్పల్సింది నువ్వు కాదు సుదీప్ నేను. “ఒకమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంటపడి ఆ అమ్మాయి ఒప్పుకోకపోయేసరికి ఆమె మొహం మీద యాసిడ్ పోసో గొంతుకోసో హతమార్చే వాళ్ళు, ఒకమ్మాయి వెంటపడితే తమకి నచ్చకపోయినా ఆ విషయం తనకి చెప్పకుండా దాన్ని అవకాశంగా తీసుకుని ఆమె జీవితంతో ఆడుకుని వాడుకుని వదిలేసే వాళ్ళు మహత్ములం" అని తిరుగుతున్న రోజుల్లో, ఒకమ్మాయి ప్రేమిస్తున్నా ఆ అమ్మాయి ప్రేమని ఒప్పుకోకుండా తప్పించుకుని తిరుగుతున్న నీకు 'నేను మంచోడ్ని కాదు' అని చెప్పే హక్కులేదు."
ఈ మాటలు చాలా ధైర్యంగా చెప్పింది, ఆమె ఆవేదన మొత్తం వెల్లగక్కింది.

Preview download free pdf of this Telugu book is available at Sneham Nerpina Prema