• Star Fighter
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్టార్ ఫైటర్

    Star Fighter

    Author:

    Pages: 286
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


దృష్టినంతా ఎదుట ఉన్న వీధి మీద కేంద్రీకరించి వేగంగా కారును నడుపుతున్న మిచిషీ డ్రైవర్, ఉన్నట్లుండి బ్రేకుల మీద కాలు వేశాడు.
కీచుధ్వనులు చేస్తూ రెండు వంకర్లు తిరిగి, ఒకపక్కకు ఒరిగినంత పని చేసింది ఆ కారు.
“నీకు బుద్ది ఉందా? నువ్వసలు మనిషివేనా? కళ్పు ఏమైపోయాయి?” కోపంగా అరుస్తూ, డోర్ తెరుచుకుని కిందికి దిగబోయిన అతన్ని ఆపి, తను బయటికి చూసింది మిచిషీ.
చిటికెలో తప్పిపోయింది ప్రమాదం. ఎటోచూస్తూ వస్తోంది వయసు బాగా మీద పడిపోయినట్లు కనిపిస్తున్న ఒక వృద్ధురాలు. కారు ముందుభాగం కొంచెం తగలటంతో కింద పడిపోయింది.
“క్షమించాలి తల్లీ... పొరపాటు జరిగిపోయింది దెబ్బ తగిలిందా?” చటుక్కున కిందికి దిగి, ఆమెకు చేతిని అందిస్తూ ఆదరంగా అడిగింది మిచిషీ.
సహాయం చేయటానికి వచ్చిన వారిని చూసి సంతోషించటానికి బదులుగా, తను ధరించి ఉన్న యూనిఫామ్‌ని చూసి ఆమె భయపడిపోతున్నట్టు తెలిసి, చిరునవ్వు నవ్వింది.
“భయం లేదు... నేను నిన్ను ఏమీ నిందించను” అంటూ భుజం తట్టింది. కృతజ్ఞతాసూచకంగా చిరునవ్వు కూడా నవ్వకుండా పరుగెత్తున్నట్టు పక్కనే ఉన్న సందులోకి వెళ్ళిపోయింది ఆ వృద్ధురాలు.
ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపోతూ నిలబడిన మిచిషీని “మేడమ్... ఆలస్యం అయిపోతోంది” అంటూ హెచ్చరించాడు డ్రైవర్.
సందులోకి పోయిన వృద్ధురాలు పది అడుగులు కూడా సరిగ్గా వేయలేదు. ఉన్నట్లుండి కాళ్ళు మడతపడినట్టు ముందుకు తూలింది.
చెడు వాసనను వెలువరించే చవకబారు సిగరెట్లు పొగను పీలుస్తూ, ఆరు అడుగుల దూరంలోకి వస్తున్నాడు ఒక యువకుడు. చటుక్కున ముందుకు దూకి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు.
“ఏమయింది తల్లీ? కళ్ళు తిరిగాయా?” సరిగ్గా నిలబెడుతూ మృదువుగా అడిగాడు. అటువంటిదేమీ లేదన్నట్టు తల అడ్డం తిప్పింది ఆమె. తనంతట తానుగా ఇంకో అడుగు వేసింది. అంతే మరోసారి ముందుకు తూలింది.
పెదవుల మధ్య పెట్టుకోబోతున్న సిగరెట్‌ని కిందకి వదిలేసి మళ్ళీ ఆమెను పట్టుకున్నాడు ఆ యువకుడు.
అంతకు ముందు మాదిరి తమాయించుకుని నిలబడలేదు ఆమె. ముందుకు తూలుతూ ఉండగానే తెలివి తప్పినట్లుంది. నడుములు విరిగిపోయిన బొమ్మ మాదిరి అతని చేతుల్లో వ్రేలాడిపోయింది.

Preview download free pdf of this Telugu book is available at Star Fighter