• Wonderland America Nanilu
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వండర్ ల్యాండ్ - అమెరికా నానీలు

    Wonderland America Nanilu

    Pages: 42
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

" వండర్ ల్యాండ్ - అమెరికా నానీలు"
అమెరికా చూడాలని ఎవరికి ఉండదని!
అమెరికా భారత దేశం కంటే మూడంతల భూభాగం గల విశాలమైన దేశం, ముప్పయి రెండు కోట్లకు పైగా జనాభా ఉన్న దేశం. ప్రపంచములోని అన్ని మతాల ప్రజలు కలిసి సహా జీవనం చేస్తున్న ప్రజాస్వామిక దేశం. అన్నీ వనరులు ఉండి , ప్రకృతి సంపద ఉండి,, సకల సౌకర్యాలు కలిగి ఉండి, చేయడానికి పని ఉండి, పనికి తగ్గ వేతనం ఉండి ఇక్కడి వారు క్వాలిటీ జీవనముతో సౌకర్యవంతంగా జీవిస్తున్నారు అనిపించింది.
ప్రధానంగా ఉత్తరాన కెనడా, దక్షిణాన మెక్సికో దేశాలు, తూర్పున అట్లాంటిక్ , పడమరన పసిఫిక్ మహా సముద్ర తీరాలు కలిగి ఉండి విభిన్నమైన శీతోష్ణస్థితి, బౌగోళిక మండలాలుగా ఉన్నఈ దేశంను దర్శించడం ఒక విచిత్రమైన అనుభవం.
ఇక్కడ ఉన్న సమయములో అమెరికా టెక్సాస్ రాష్ట్రము లోని ఆస్టిన్ కు దగ్గరలో ఉన్న డ్యాలస్, శాన్ ఆంటోనియా, హ్యుస్టన్ నగరాలను సందర్శించడం జరిగింది. కొండలు, గుట్టల వరుసలు కలిగి ఉండి, ఎడారి ప్రాంతములా కనిపించే ఆరిజోనా రాష్ట్రము లోని ‘గ్రాండ్ కెనియన్’, ‘అంటిలోప్ కెనియన్’, నెవడ రాష్ట్రపు ‘లాస్ వేగాస్’, వివేకానంద దర్శించిన ప్రసిద్ధ ‘చికాగో’ నగరం, విశ్వ విఖ్యాత ‘నయాగరా’ జలపాతాలు, ప్రసిద్ధ నగరం ‘న్యూయార్క్’ , ఆ పక్కనే న్యూ జెర్సీ, అమెరికా రాజధాని ‘వాషింగ్టన్ డి.సి.’ ‘ఓసియన్ సిటీ’, మొదలగు ప్రదేశాలు పెన్సిల్వేనియా, డెలావేర్, మేరీ ల్యాండ్, వర్జీనియా రాష్ట్రాల గుండా పయనిస్తూ దర్శించడం జరిగింది.
అమెరికా వారి జీవన్నాన్ని, ఇక్కడి పరిసరాలను గమనిస్తూ ఇక్కడి ప్రదేశాలను చూస్తూ కొన్ని చిన్న కవితలు నానీలుగా రాసుకున్నాను.
ఇప్పుడు వస్తున్న ఈ “ వండర్ ల్యాండ్ -అమెరికా నానీలు" అమెరికాను చూస్తుంటే నాకు అద్భుతంగానే అనిపించింది. అందుకే ఈ నానీలకు “ వండర్ ల్యాండ్ -అమెరికా నానీలు" అని పేరు ఉంచడం జరిగింది. తెలిసిన విషయాలను లఘు కవితల్లో చెప్పాలని ఈ నానీలు రాసాను. మచ్చుకు కొన్ని :


అమెరికా !
ఎవరి దేశమిది?
అందరి దేశమిది !
అద్భుత దేశమిది!


ఇక్కడ పంటలు కాదు
కాసులు పండుతాయి
అదే విచిత్రం !
లాస్ వేగాస్


చికాగో
చారిత్రిక నగరం
వివేకానంద దర్శించిన
దివ్య క్షేత్రం


స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
ఫ్రాన్స్ - అమెరికా
మైత్రీ చిహ్నం
స్వేచ్చా ప్రతీక !


నయాగరా
మనసు దోచే నదికన్య !
ఎగిసి దుమికే
జలకన్య !


వాషింగ్టన్ డి.సి.
కళల నిలయం
అమెరికా
క్యాపిటల్ !


డ్యాలస్ నగరం
తెలుగు లోగిలి !
మన భాష
మనవారెక్కువ !

- సబ్బని లక్ష్మీనారాయణ

Preview download free pdf of this Telugu book is available at Wonderland America Nanilu