• Batukamma Kooturu Ramreddy
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బతుకమ్మ - కూతురు రాంరెడ్డి

    Batukamma Kooturu Ramreddy

    Pages: 180
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కథ జీవితాన్ని చిత్రిస్తుంది, వ్యాఖ్యానిస్తుంది. విభిన్న పార్శ్వాల్ని, కోణాల్ని చూపిస్తుంది. స్థల కాల పరిస్థితుల్ని ప్రతిబింబిస్తుంది. పట్టించుకుంటుంది. అంతే కాక భిన్న జీవన దృక్కోణాల్ని ముద్రించుకుని నిలుచుంటుంది. సమకాలీన సమాజానికి ప్రతిబింబమై మెరుస్తూ ఉంటుంది.

ఈ కథల ‘బతుకమ్మ’ కూడా అటువంటిదే. తెలంగాణా పల్లెలు, ఉమ్మడి కుటుంబాలు, ప్రేమలు, ఆప్యాయతలు, గ్రామీణ జీవనవ్యవస్థ, దాని స్థితి గతుల్ని అక్షర చిత్రాలుగా చూపించింది. నాకు తెలియని నిన్నటి సబ్బండ వర్ణాల తెలంగాణాను చిత్రించింది. పట్టణాలు, గ్రామాలకే కాకుండా పల్లెలకూ విస్తరించి స్థానికులుగా చలామణీ అయ్యేందుకు వలసదారులు చేసిన ఆనాటి కుట్రలను చూపించింది.

నిజానికి బతుకమ్మ అంటేనే తెలంగాణా జీవితానికి, జీవన సంస్కృతికి అచ్చమైన ప్రతీక.

తెలంగాణా ప్రజల బతుకు చిత్రమైన బతుకమ్మ నేపథ్యంగా అక్కడి జీవితాల్ని చిత్రించడం పితృ సమానులు కూతురు రాంరెడ్డి గారి ‘చేయి తిరిగిన’ కథా వ్యవసాయానికి నిదర్శనం. గతంలోని నాలుగు కథా సంపుటాలు రాంరెడ్డి గారిని కథకులుగా పరిచయం చేస్తే ఈ ‘బతుకమ్మ’ తెలంగాణా బతుకు చరిత్రల చిత్రకారునిగా నిలబెడుతుంది.

కథనం, శిల్పం పుష్కలంగా ఉన్న ఈ కథలన్నీ ఎక్కడో ఒకచోట ఏక వస్తువుతో...... ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణా ప్రజల బతుకులతో ముడిబడి ఉండటం రచయిత కనబరచిన విలక్షణత.

- పత్తిపాక మోహన్

Preview download free pdf of this Telugu book is available at Batukamma Kooturu Ramreddy