• American English - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • American English (free)

    American English - free

    Pages: 186
    Language: English, Telugu
    Rating
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    '3.50/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇంగ్లిష్ ప్రపంచ భాష. ప్రసారమాధ్యమాలలో, పత్రికలలో చాలా భాగం ఇందులోనే ఉంటాయి. అయినా ప్రతి దేశంలో, దేశంలో ప్రాంతాలలో వాడబడేది ఒకే రకమైన ఆంగ్లం కాదు. దీనిని మాతృభాషగా కాక రెండవ/అదనపు భాషగా అధికులు నేర్చుకుంటున్నారు. సరిగా చెప్పాలంటే ఒకే దేశంలో కూడా ఒకే భాష వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు మార్పులతో మాట్లాడబడుతుంది. ప్రజల మాతృభాషాప్రభావం పరాయిభాషపై పడటం సహజం. బ్రిటీష్ పాలనా ప్రభావంతో భారతీయులు బ్రిటీష్ వారి ఆంగ్లాన్నే అనుసరిస్తున్నారు. అనేక కారణాలవల్ల అమెరికా దేశంలో మాట్లాడబడే ఇంగ్లిష్ అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందుతుంది. ప్రపంచదేశాలమధ్య రాకపోకలు అధికం అవుతున్నాయి.

ముఖ్యంగా భారతీయులు అమెరికా సంయుక్తరాష్ట్రాలకు ఎక్కువగా వెళుతున్నారు. అలావెళ్లేవారిలో బ్రిటీష్ ఇంగ్లిష్ నేర్చుకున్న తెలుగు మాట్లాడే వారు అధికశాతం ఉన్నారు. వీరు స్వదేశంలో ఆంగ్లభాషాపరిజ్ఞానాన్ని సాధించి, అధిక మార్కులు సాధించి రాణించినప్పటికీ, వాళ్ల భాషానైపుణ్యాలు కొత్తదేశంలో ఆశించిన ఫలితాలను ఇవ్వటానికి ఉపయోగపడటంలేదు. అందువల్ల తెలుగువారు అమెరికాలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాము నేర్చిన భాష ఒక్కటే, అక్షరాలు అవే. కాని ఉచ్చరణ (Pronunciation), అక్షరకూర్పు (Spelling), అర్థం (Meaning), వ్యాకరణం (Grammar)లో అమెరికాలో తేడాలు ఉన్నాయి.

ఏటా తెలుగు రాష్ట్రాలనుంచి ఉద్యోగాలకోసం 30 వేలమంది దాకా అమెరికాకు వెళుతున్నారు. అక్కడ స్థిరపడిన వారిదగ్గరకు వెళ్లే వాళ్లు ఇంకా కొందరు ఉంటారు.

మొదటిసారిగా అమెరికా వెళ్లేవాళ్లకు అమెరికా ఆంగ్లాన్ని గురించిన అవగాహన కలిగించటానికి ఉద్దేశించినది ఈ కొత్త నిఘంటువు. తెలుగు వారికి మరింత ప్రయోజన కరంగా ఉండటం కోసం ఇంగ్లీష్ మాటను ఉచ్చరించవలసిన విధానాన్ని American Phonetic లోను, తెలుగులోనూ ఇచ్చాం.

- డా. పి. హరిపద్మరాణి

Comment(s) ...

Very nicely done, Dr Haripadmarani garu. I have been living in the states for nearly 25years and I fully endorse this. thank you.