• Soviet Russialo Em Jarigindi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సోవియేట్ రష్యాలో ఏం జరిగింది?

    Soviet Russialo Em Jarigindi

    Author:

    Pages: 456
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రష్యాలో, శ్రామిక వర్గ విప్లవ ప్రారంభం, 100 సంవత్సరాల కిందట 1917లో జరిగింది. ఆ విప్లవానికి నాయకత్వం వహించిన శ్రామిక పార్టీ, ఆ విప్లవం కన్నా ముందే ఏర్పడి వుంది. ఆ విప్లవాన్ని, “రష్యన్ అక్టోబరు విప్లవం” అంటారు. తర్వాత, ఆ పార్టీయే పేర్లు మార్చుకుంటూ 1952లో, “సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ”గా అయ్యింది. కానీ, కమ్యూనిస్టు పార్టీ, 1991 ఆగసు 29న రద్దయి పోయింది! రద్దు తర్వాత, ఆ పార్టీని నిషేధించడం కూడా జరిగింది!

ఛార్లెస్ బెతల్‌హామ్, రష్యా - చైనాల గురించి రాసిన అనేక సంపుటాలు, రష్యా చైనాల విప్లవాల గురించి కొంత సమాచారం అయినా ఇవ్వగలవని గతంలోనే తెలుసు.

ఇప్పుడు, కమ్యూనిస్టు పత్రికల్లో, సోవియట్ అక్టోబరు విప్లవం గురించి, ‘శత జయంతి’ కీర్తనలే గానీ ఆ విప్లవం నామ రూపాలు లేకుండా ఎందుకు పోయిందో, ఏ సమాచారమూ చెప్పకపోవడం చూశాక, బెతల్‌హామ్ సంపుటాల వేపే నా దృష్టి తిరిగింది.

బెతల్‌హామ్ రచనలకు ఎందుకు విలువ ఇవ్వాలంటే, ఈ వ్యక్తి, "మార్క్సిజం" నించి ఏ మాత్రమూ పక్క అడుగులు వెయ్యని వ్యక్తి! వ్యక్తుల్నీ, ఉద్యమాల్నీ, విప్లవాల్నీ, శ్రామిక వర్గ పోరాటాల దృష్టితో పరిశీలించిన వ్యక్తి! ఈయన చెప్పిన సమాచారం చూసినప్పుడు, రష్యా విప్లవం గురించీ, ఆ పార్టీ గురించీ, కొంతైనా తెలిసే అవకాశం వుంది.

- రంగనాయకమ్మ

Preview download free pdf of this Telugu book is available at Soviet Russialo Em Jarigindi