• Nartaki
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నర్తకి

    Nartaki

    Author:

    Pages: 208
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగు నేలనుండి అమెరికా వెళ్ళి స్థిరపడి జీవనయానం సాగిస్తూన్న కుటుంబాల పరిస్థితులు, సంఘర్షణలు, మారుతున్న సమాజంలో నిలదొక్కు కోవడానికి చేసుకునే సర్దుబాట్లు - ఈ నేపథ్యంలో ‘నర్తకి’ పేరుతో సోమ సుధేష్ణగారు రాసిన నవలలో వివిధ సన్నివేశాలు కనులకు కట్టినట్లు చిత్రించారు. నవల చదువుతున్నంతసేపు ఆ కుటుంబాలతో మమేకమై వారి సమస్యను మన సమస్యగా ఆలోచింపచేశారు రచయిత్రి. ఈ నవలలో సుష్మ అనే నర్తకి జీవితాన్ని ప్రధానంగా చిత్రించారు.

నిర్మల కూతుళ్ళిద్దరిలో పెద్దమ్మాయి సుష్మ అపూర్వమైన అందగత్తె. అమెరికాలో ప్రాచుర్యంలో ఉన్న ‘బాలే’ నృత్యం పట్ల అభిరుచి పెంచుకుని ఒక తపస్సులా ఆ కళలో అభినివేశం సంపాదించి, ఎన్నో బిరుదులు పొందుతుంది. పేరు తెచ్చుకుంటుంది. అదే రంగంలో ఉన్న అమెరికన్ యువకుడు డేవిడ్‌తో పరిచయం, ప్రేమ, పెళ్ళి వరసగా జరిగిపోతాయి. తల్లి నిర్మల, తండ్రి రమేష్ ముందు కొంత ఘర్షణకు లోనైనా వారి ప్రేమను అంగీకరించి ఆశీర్వదిస్తారు. అయితే అంకితభావంతో కృషిచేస్తూ బాలే నృత్యంలో పేరు సంపాదించుకుంటున్న సుష్మపట్ల డేవిడ్ కొద్దిపాటి అసహనానికి లోనుకావడం, ఇద్దరి మధ్య అవగాహనాలోపం, డేవిడ్ కొంతకాలం రష్యా వెళ్ళడం - కొంత సమయం తరవాత అపార్థాలు తొలగి చివరికి ఆనందంగా ఒకటి కావడం - ఇదీ ప్రధానమైన కథ. చుట్టూ ఉన్న పాత్రల కథలూ, వారి స్వభావాలూ రచయిత్రి సమయానుగుణంగా చిత్రిస్తూ అనేక జీవితసత్యాలను ఆవిష్కరించారు. ఆమె ఎన్ని జీవితాలను ఎంత నిశితంగా పరిశీలించారో, జీవితాన్నెంత చదివారో అర్థమవుతుంది.

- డా. వంశీ రామరాజు

గమనిక: "నర్తకి" ఈబుక్ సైజు 5.7mb

Preview download free pdf of this Telugu book is available at Nartaki