• Nanamma Cheppina Neeti Kathalu
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నానమ్మ చెప్పిన నీతి కథలు

    Nanamma Cheppina Neeti Kathalu

    Author:

    Publisher: Shaili Publications

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒకే ఇంట్లో అన్నా, తమ్ముళ్ళు మూడు, నాలుగు కుటుంబాలు ఉండేవి. ఎట్లాలేదన్నా ఇంచుమించు నలుగురైదుగురు పిల్లలుండేవారు. వారు నానమ్మ తాతయ్యలకు బాగా మచ్చికై వుంటారు. చీకటి పడిందంటే సరి. నానమ్మ పక్కకో, తాతయ్య పక్కకో చేరతారు. ఎన్నో కబుర్లు చెబుతూ చెప్పించుకుంటూ వుంటారు. ఆ కబుర్లలో నుండే కథలు పుట్టుకొచ్చేవి. వారు విన్నవి, చదివినవి పిల్లలకు చెబుతూ అప్పుడప్పుడు కల్పిత కథలు కూడా చెప్పేవారు. ఆ కథలు వింటూనే పిల్లలు వూహల్లో విహరించేవారు. వారే కథానాయకులయ్యేవారు. వారి వ్యక్తిత్వం కదలతోనే రూపుదిద్దుకునేది. వారిని వారే హీరోలుగా తయారు చేసుకునేవారు. ధైర్యవంతులుగా, సాహసవంతులుగా తయారయ్యేవారు. సమాజానికి పనికొచ్చే పౌరులుగా మారేవారు. విజ్ఞాన జ్యోతులుగా వెలుగొందేవారు. కథలు వినందే నిద్రరానీ బాలలు కూడా ఆరోజుల్లో వుండేవారు.

కాలం మారింది. కథలు చెప్పటానికి నానమ్మ తాతయ్యలు లేరు. వారి బదులు ఓ పెద్ద భూతం వచ్చి నట్టింట్లో కూర్చుంది. అదే టీ.వి.. అది ఆత్మీయులైనా నానమ్మ తాతయ్యాలా కాకుండా, వారు చెప్పేవాటికి పూర్తిగా వ్యతిరేకమైనవి చెప్పి ఇదే నీవు నడవవలసినతోవ అని సమాజం మీదకు వదులుతుంది. పనికొచ్చే పాత్రలుగా ఉండాల్సిన బాలలు పనికిరానివారిగా, చిన్నసమస్యను కూడా పరిష్కరించుకోలేని దౌర్భాగ్యులుగా మారుతున్నారు. నైతికం, అనైతికం తెలియని వారుగా జీవనయానంలోకి అడుగుపెడుతున్నారు. హీరోలుగా వుండాల్సినవారు జీరోలై అగమ్యగోచరంగా కాలం సాగనంపుతున్నారు.

పిల్లలకు ఆ దుస్థితి రాకూడదని, కొంతలో కొంతైనా నానమ్మ తాతయ్య లేని లోటు తీర్చాలని ఈ కథలను మీ ముందుంచాను.

- దార్ల బుజ్జిబాబు

Preview download free pdf of this Telugu book is available at Nanamma Cheppina Neeti Kathalu