• Kaliyuga Krishnarjunulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    80
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కలియుగ కృష్ణార్జునులు

    Kaliyuga Krishnarjunulu

    Publisher: Palapitta Books

    Pages: 174
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వ్యంగ్యాన్ని పదునుగా వాడుకోవటం రచయిత ప్రజ్ఞ మీద ఆధారపడి వుంది. ఈ విధమైన సృజనాత్మక ప్రతిభ వున్న రచయిత పులిగడ్డ విశ్వనాథరావు. వ్యంగ్యం కోసం వ్యంగ్యాన్ని సృజించలేదాయన. హాస్యం కోసం హాస్యాన్ని సృష్టించలేదు. పాఠకుల హృదయాల్ని సుతిమెత్తగా హత్తుకుంటూనే ఆలోచింపజేసేందుకు వ్యంగ్యాన్ని ఆయన వాడుకున్నారు. ఈ వ్యంగ్యంలో కేవలం వెక్కిరింత లేదు. అధిక్షేపం ఉంది, నిరసన ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే సమాజంలోని అపసవ్యతలపై సంధించిన వ్యంగ్యాస్త్రాలు పులిగడ్డ విశ్వనాథరావు కథలు. ‘కలియుగ కృష్ణార్జునులు’ శీర్షికన వస్తున్న ఈ కథల సంపుటిలో పదునైన వ్యక్తీకరణలున్నాయి. సమాజ పోకడల్నీ, మానవ మనస్తత్వాన్నీ ప్రతిఫలిస్తూ ఏ పరిణామం ఏ దిశగా మనుషుల్ని నడిపిస్తున్నదో చెప్పడానికి ప్రయత్నించారు. కథా సంవిధానంలో ఒక ముచ్చటయిన కూర్పు కనిపిస్తోంది. సమకాలీన అంశాన్ని తీసుకుంటూనే వాటి విభిన్న పార్శ్వాల్ని చర్చకు పెట్టారు. మంచీచెడుల గురించి ఆకళింపు చేసుకోవడానికి అనువైన శైలీ విన్యాసం కథల్లో కనిపిస్తుంది. పనిగట్టుకొని ప్రబోధాలు చేయలేదు, ప్రవక్త మాదిరిగా మాట్లాడలేదు. అసాధారణ అంశాల్ని అలవోకగా చెప్పడం వల్ల ఈ కథలు ఒక విధమైన సొగసుదనం సంతరించుకున్నాయి. ఎలాంటి గాంభీర్యం లేకుండా సులభశైలిలో కూర్చిన వ్యంగ్యకథనం ఈ కథలకి చిక్కదనాన్ని, చక్కదనాన్ని చేకూర్చింది. ఆరోగ్యకరమైన వ్యంగ్యం, హాస్యం కోసం దప్పికగొని వున్న తెలుగు పాఠకలోకం దాహం తీర్చే కథామృతం ఇది. మా ఇతర ప్రచురణల మాదిరిగానే ఈ కథల సంపుటిని పాఠకులు సమాదరిస్తారని ఆశిస్తున్నాం.

- పబ్లిషర్స్

Preview download free pdf of this Telugu book is available at Kaliyuga Krishnarjunulu